జంబ్లింగ్.. వసూళ్ల గ్యాంబ్లింగ్! | Of Gambling with extortion Jambling ..! | Sakshi
Sakshi News home page

జంబ్లింగ్.. వసూళ్ల గ్యాంబ్లింగ్!

Published Thu, Feb 4 2016 12:34 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

జంబ్లింగ్.. వసూళ్ల గ్యాంబ్లింగ్! - Sakshi

జంబ్లింగ్.. వసూళ్ల గ్యాంబ్లింగ్!

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో సుమారు 157 ఇంటర్ కళాశాలలున్నాయి. వీటిలో 87వరకు ప్రైవేట్‌వే. విద్యార్థుల నుంచి ప్రయోగ పరీక్షల పేరిట ఇప్పటికే రూ.300నుంచి కళాశాలల స్థాయిని బట్టి రూ.1000 వరకు, ప్రభుత్వ కళాశాలల్లో రూ.100నుంచి రూ.300వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. వీటి మొత్తాల్ని ఏ విధంగా అధికారులకు మామూళ్లివ్వాలన్న విషయమై ఇటీవల ఓ ఆదివారం ఇక్కడి కళాశాలల నిర్వహకులు కొంతమంది రహస్య సమావేశంలో చర్చించుకున్నారు. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అధికారులతో పాటు డిపార్ట్‌మెంటల్ అధికారికి, బోర్డు తరఫున స్వ్కాడ్ సిబ్బందికి వాటాలివ్వాల్సిన విషయంలో వ్యూహం రచించుకున్నారు.

జంబ్లింగ్ విధానంలో ఇబ్బందులొస్తాయి, డబ్బులిస్తేనే పనవుతుందంటూ విద్యార్థుల్ని కౌన్సిలింగ్ చేసి మరీ డబ్బు పిండుకున్నారు. జంబ్లింగ్ రద్దవడంతో విద్యార్థులు తమ వద్ద వసూలు చేసిన మొత్తాల్లో కొంతయినా వెనక్కు ఇస్తారేమోనని ఆశపడ్డారు. వసూలు చేసిన మొత్తాల్ని అధికారుల వద్ద కాకుండా కిందిస్థాయి సిబ్బంది వద్ద దాయడం కూడా చిచ్చురేపుతోంది. జంబ్లింగ్ రద్దయిన నేపథ్యంలో కళాశాలల నిర్వహకులు భారీగా కాకుండా స్వల్ప మొత్తాల్లోనే పంపకాలు చేయాలంటూ నిర్ణయించడంతో ఆయా మొత్తాలపై వివాదం రేగుతోంది.  ఖర్చెవరిది?శ్రీకాకుళంలో జంబ్లింగ్ విధానం అజెండాగా సాగిన రహస్య సమావేశానికి కార్పొరేట్ క ళాశాలల నిర్వహకులే పెత్తనం వహించారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని సమావేశం జరిగే ప్రాంతానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆ మొత్తాల్ని ఏయే అధికారికి ఏ విధంగా వాటాలివ్వాలో వ్యూహం పన్నారు.

వసూళ్ల మొత్తంలో 10శాతం సమావేశపు ఖర్చుగా నిర్ణయించారు. మిగిలిన మొత్తాన్ని కళాశాలల తరఫున కొంతమంది మాత్రమే అధికారుల్ని రహస్యంగా కలిసి ముందస్తుగానే చెల్లించాలని నిర్ణయించారు. అయితే విద్యార్థుల నుంచి వసూలైన మొత్తాన్ని తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు తలె త్తడంలో పరీక్షల ప్రారంభానికి ముందురోజు పంపకాలు చేయాలని వ్యూహం పన్నారు. తీరా జంబ్లింగ్ విధానం రద్దయిందని తేలడంతో ఇప్పుడు ఆయా మొత్తాలపై చర్చ జరుగుతోంది. అనవసరంగా సమావేశం పెట్టుకున్నామని, ఖర్చులు వృథా అయ్యాయని మథనపడిపోతున్నారు.  కిందిస్థాయికీ ఖర్చులే
 
 పరీక్షల సమయంలో మొన్నటివరకూ కొన్ని స్థాయిల్లోనే విచారణాధికారులుగా నియమించేవారు. ఇప్పుడు అధ్యాపకుల్నీ భాగస్వాములుగా కొన్ని ప్రాంతాల్లో నియమించారు. అడ్మిన్ విభాగంలో ఉన్న వారినీ స్క్వాడ్ సిబ్బందిగా వరించే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో తమ కిందిస్థాయి సిబ్బందిని అడ్మిన్ విభాగ అధికారులు ఇప్పటికే ఆయా కళాశాలలకు పంపించేసి వసూళ్లు తెమ్మంటుండడం చర్చనీయాంశమైంది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండడంతో వసూలైన మొత్తాల్ని చెల్లించేసి తమ కళాశాలల విద్యార్థులకు మంచి మార్కులొచ్చేలా చూడాలని నిర్వాహకులు చెప్పుకుంటున్నారు.

అంతేకాకుండా పట్టణంలో ఉన్న ఆర్‌ఐవో కార్యాలయం చుట్టూ నిర్వాహకులు క్యూ కట్టారు. బోర్డు ద్వారా వచ్చిన లేఖల్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. స్క్వాడ్ వివరాల్ని తెలుసుకుంటున్నారు. ఈ సారి ప్రయోగ పరీక్షలు యథాతథంగానే నిర్వహిస్తున్నా జంబ్లింగ్ విధానం కోసం వసూలు చేసిన మొత్తాలతో ఎలాగైనా మేనేజ్ చేసి వెనుక బడిన విద్యార్థుల్ని ఎలాగైనా పాస్ చేయించాలనే దృఢనిశ్చయంతో నిర్వాహకులున్నట్టు తెలిసింది. తెలివైన విద్యార్థులు మాత్రం తాము పరీక్షలకు బాగానే సిద్ధమైనా అంతంత వసూళ్లా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement