పల్లెలకు కార్పొరేట్ కటాక్షం | Offset corporate kataksam | Sakshi
Sakshi News home page

పల్లెలకు కార్పొరేట్ కటాక్షం

Published Sun, Mar 2 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

పల్లెలకు కార్పొరేట్ కటాక్షం

పల్లెలకు కార్పొరేట్ కటాక్షం

సామాజిక బాధ్యత ద్వారా నిధుల ప్రవాహం
 ప్రభుత్వ నిబంధనలతో అభివృద్ధికి అవకాశం

 
యలమంచిలి, న్యూస్‌లైన్ : సమస్యలతో సతమతమవుతున్న పల్లెలకు కార్పొరేట్ నిధుల ద్వారా స్వాంతన ల భించనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా సమస్యల నుంచి పల్లెలకు ఊరట లభించనుంది. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పన, క్రీడాభివృద్ధి, పాఠశాలల్లో కనీస సదుపాయాల పెంపు కోసం ఈ నిధుల వినియోగం తప్పనిసరి కానుంది.  ఆసరా లేని వృద్ధాశ్రమాలు, క్షీణిస్తున్న అడవులు, అంతరిస్తున్న హస్తకళలు.. వీటన్నిటికీ కార్పొరేట్ నిధుల ద్వారా మేలు చేకూరబోతోంది.  

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలపై కొరడా ఝళిపించడంతో నిధుల విడుదల తప్పనిసరి కానుంది. కార్పొరేట్ సంస్థలకు సామాజిక బాధ్యత నిధుల వ్యయం తప్పనిసరి చేసిన ప్రభుత్వం అందుకు సంబంధించి మరిన్ని నిబంధనలు విధించడంతో గ్రామాలకు లాభం కలగబోతోంది. కొత్త కంపెనీల చట్టం 2013 ప్రకారం ఏప్రిల్ 1 నుంచి యాజమాన్యాలు సేవాకార్యక్రమాలను తప్పనిసరిగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశిం చింది. రూ. 500 కోట్ల నెట్‌వర్త్, రూ. 1000 కోట్ల టర్నోవర్ లేదా రూ. 5 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తున్న పరిశ్రమలన్నీ ఖచ్చితంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులు ఖర్చుచేయవలసి ఉంది.

పరిశ్రమల యాజమాన్యాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనల ప్రకారం లాభాల్లో 2 శాతం నిధులను సేవా కార్యక్రమాలకు వినియోగించవలసి ఉంది. గతంలోనే ఈ నిబంధనలున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. సీఎస్‌ఆర్ నిబంధనల ప్రకారం పరిశ్రమల లాభాల నుంచి నిధులను కేటాయిస్తున్న యాజ మాన్యాలు ఖర్చుపై తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నాయి.

గత కొన్నేళ్ల నుంచి జిల్లాలో విశాఖ స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, జింక్, షిప్‌యార్డు, ఎస్‌ఆర్‌గుజరాత్‌తోపాటు అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్, తీరప్రాంతంలో రసాయన పరిశ్రమల వద్ద దాదాపు రూ. 200 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు మూలుగుతున్నట్టు తెలుస్తోంది.  వీటి వినియోగంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ పట్టిం చుకోకపోవడంతో యాజమాన్యాలు ఈ నిధులను ఖర్చు చేయడంలేదన్న విమర్శలున్నాయి.

పలు పరిశ్రమలు మొక్కుబడిగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పాఠశాలలో మౌలిక వసతులు, ప్రకృతి వైపరీత్యాల్లో పరిశ్రమల యాజమాన్యాల మొక్కుబడిగా సేవా కార్యక్రమాలు ని ర్వహించి చేతులు దులిపేసుకున్నాయి.  కేంద్ర ప్రభు త్వం తాజా ఉత్తర్వులతో పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్‌ఆర్ నిధుల వినియోగానికి సిద్ధమయితే పల్లెల సమస్యలు తొలగనున్నాయి.
 
నిధులు కేటాయించాల్సిన కార్యక్రమాలు
సురక్షితమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, సామాజికాభివృద్ధి ప్రాజెక్టులు.

 గ్రామీణ క్రీడలు, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన క్రీడలకు ప్రోత్సాహం, శిక్షణ కార్యక్రమాలు
 
అడవుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతరక్షణ, ప శుసంవర్ధక కార్యక్రమాలు, సహజవనరుల సంరక్షణ.
 
మహిళలు, అనాథలకు ఇళ్లు, హాస్టళ్ల ఏర్పాటు, వృద్ధుల ఆశ్రమాలకు అండదండలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement