water facility
-
దాహం..దాహం!
సాక్షి, మక్తల్: వేసవికాలం ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీళ్లు కరువయ్యాయి. ప్రతి రోజు పాఠశాలల్లో విద్యార్థులు మంచినీళ్లు లభించక దాహార్తితో అలమటిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు వంటలు చేయడానికి నానా ఇక్కట్లు పడుతున్నారు. పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం. కొన్ని సంవత్సరాల నుంచి పాఠశాలల్లో మంచినీటి ఎద్దడి నెలకొన్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. మక్తల్ మండలంలో మొత్తం 56 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 36 పీఎస్‌లు, 14 యూపీఎస్‌లు, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మండలంలో మొత్తం దాదాపు 27 పాఠశాలల్లో మంచినీటి సమస్య ఏర్పడి విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా కనీసం పాఠశాల విద్యార్థులకు మంచినీళ్లు కూడా అందించలేని దుస్థితి దాపురించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు అక్కడ తాగడానికి కూడా మంచినీళ్లు లేకపోవడం మధ్యాహ్న భోజన సమయంలో భోజనం చేసిన విద్యార్థులకు కనీసం చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు కరువైపోయాయి. ఈ పరిస్థితిలో విద్యార్థులు ప్రతి రోజు ఆయా పాఠశాలల్లో మంచినీళ్ల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బం దులు వర్ణనాతీతం. కొందరు విద్యార్థులు బాటిళ్లలో నీళ్లు తెచ్చుకొని తోటి విద్యార్థులతో కలిసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని పంచదేవ్‌పహాడ్, పస్పుల, జక్లేర్, బొందల్‌కుంట, మక్తల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కర్ని, రామసముద్రం, జౌలపురం, ఉపర్పల్లి, సోమేశ్వర్‌బండ తదితర పాఠశాలల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆయా పాఠశాలల్లో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని వారు కోరారు. -
అన్ని పాఠశాలలకూ రన్నింగ్ వాటర్ సౌకర్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: వచ్చే విద్యా సంవత్సరం నాటికి జిల్లాలో అన్ని పాఠశాలలకు రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో నీటి సౌకర్యం ఏర్పాటుపై సంబంధిత అధికారులతో గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరంతర నీటి సరఫరా లేని పాఠశాలలను గుర్తించి అందుకు తగిన అంచనాలు రూపొందించాలన్నారు. మరుగుదొడ్లకు నీటి సరఫరా ఉంటే విద్యార్థులు వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుందని చెప్పారు. జిల్లాలో 739 పాఠశాలల్లో నీటి వసతులు ఉన్నాయని, అయితే ట్యాంకులు, పైపులైన్లు లేకపోవడం, మోటారు పనిచేయకపోవడం వంటి కారణాలతో నిరంతర నీటి సరఫరా ఉండటంలేదని సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి ఎస్.త్రినాధరావు తెలిపారు. సమావేశంలో డీఈఓ ఎం.సాయిరాం, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ టి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు, ఈడబ్ల్యూఐడీసీ కార్యనిర్వాహక ఇంజినీర్ కె.భాస్కరరావు, సర్వశిక్ష అభియాన్ కార్యనిర్వాహక ఇంజనీర్ పి.సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలపై పెట్రోల్
సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చమురు సంస్థల నిబంధనలను పాతరేస్తున్నాయి. బంకుల్లో సౌకర్యాల కల్పనలో విఫలమవుతున్నాయి. వాహనదారులకు ఇంధనం తప్ప ఇతర సేవలు అందని ద్రాక్షగానే మారాయి. బంకులకు వచ్చిన వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయడమే కాదు.. వాటికి ఉచితంగా గాలి, వాహనదారులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కచ్చితంగా కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత పరీక్ష పరికరాలను అందుబాటులో ఉంచాలి. ఎండ, వానల నుంచి రక్షణకు తగిన నీడ వసతి కల్పించాలి. కానీ.. ఇవేవీ పెట్రోల్ బంకుల్లో కనిపించడంలేదు. వీటి పట్టింపేలేదు.. పెట్రో బంకులకు మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ, అగ్ని ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవడానికి అనువుగా ఉండాలి. బకెట్లలో ఇసుక. సమీపంలో నీరు అందుబాటులో ఉండాలి. మరోవైపు ప్రథమ చికిత్స పెట్టెలు అత్యవసరం. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయాల్లో వాటిని ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన ధ్రువీకరణ యాజమాన్యం వద్ద తప్పకుండా ఉండాలి. బంకుల వద్ద విద్యుత్ తీగలు, హైటెన్షన్ తీగలు లేకుండా చూసుకోవాలి. పొగ తాగరాదు అనే బోర్డులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ ఇవేవీ మచ్చుకైనా కనిపించడం లేదు. కనిపించని నాణ్యత పరిశీలన.. పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరిశీలన కనిపించడం లేదు. ఇంధన నాణ్యతను పరీక్షించేందుకు హైడ్రో ధర్మా మీటర్లు అందుబాటులో లేకుండాపోయాయి. బంకుల్లో కనీసం 20 లీటర్ల పెట్రోల్, 50 లీటర్ల డీజిల్ నిల్వ నిరంతరం ఉండాలి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్, పోలీసులకు, వికలాంగులకు ఇంధనం లేదనకుండా పోయాలి. హైడ్రోమీటర్, ఫిల్టర్ పేపర్, ఐదు లీటర్ల క్యాన్ అందుబాటులో ఉండాలి. వినియోగదారులు అడిగిన సమయంలో వెంటనే వీటిని అందజేయాల్సి ఉంటుంది. పెట్రోల్‌లో హైడ్రోమీటర్ పెట్టినప్పుడు సాంద్రత 700–760 మధ్యలో , డీజిల్ 800–860 చూపితే నాణ్యమైనది. కొలతల్లో అనుమానం ఉంటే క్యాన్‌లో పోయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కానీ దానిని పెట్రో బంకుల యాజమానులు మాత్రం అనుమతించడం లేదు. వినియోగదారులుఇలా తెలుసుకోవచ్చు.. ఇంధనం నాణ్యతను పరీక్షించే అధికారం వినియోగదారులకు ఉంటుంది. అందుకు సంబంధించిన కిట్లను వారు కోరినప్పుడు బంక్ సిబ్బంది అందించాలి. కిట్లు అందుబాటులో లేకపోయినా, వాటిని ఇవ్వడానికి వెనుకాడినా మోసం జరుగుతుందని గ్రహించాలి. కల్తీ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఫిల్టర్ పేపర్‌పై ఒక్క చుక్క ఇంధనం వేస్తే పది సెకన్లలో ఆవిరి అయిపోతుంది. ఆరిన తర్వాత పేపర్ప మరక కనిపించకూడదు. మరక కనిపిస్తే కల్తీ జరిగినట్లు గ్రహించాలి. హైడ్రో మీటర్ల ద్వారా కూడా నాణ్యత తెలుసుకోవచ్చు. నగరంలో 49 లక్షల వాహనాలు.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 49 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. ఇందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 29 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాలు కలిపి సుమారు 20 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 460 పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. -
చెప్పుకోలేని బాధ..!
- మహబూబ్‌నగర్ బాలికల కళాశాలలో అధ్వానంగా మూత్రశాలలు - టాయిలెట్ గదిలో నీటి సౌకర్యం లేక.. లోపలికెళ్లలేని దుస్థితి - ఒకటికై నా, రెంటికై నా ఇంటికెళ్లాల్సిందేనంటున్న అమ్మాయిలు ఈ చిత్రంలో కనిపిస్తున్న మూత్రశాలలు మహబూబ్‌నగర్‌లోని బాలికల జూనియర్ కళాశాలలోనివి. ఈ కళాశాలలో 2,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే మూత్రశాలల కోసం ఏర్పాటు చేసిన ఒక చిన్న గది సరిపోక దాంట్లో నీళ్లు బయటికి వెళ్లక దుర్వాసన వస్తోంది. కుళారుు కనెక్షన్ లేకపోవడంతో ఇవి ఏమాత్రం ఉపయోగపడని దుస్థితి. స్థానికంగా చదువుతున్న అమ్మాయిల ఇబ్బందులు మాటల్లో చెప్పలేం. గత్యంతరం లేని పరిస్థితిలో కొంతమంది విద్యార్థినులు అక్కడికే వెళ్తుంటే.. మరికొందరు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాతే టారుులెట్‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. లేదంటే సౌకర్యాలు లేని మూత్రశాలకో, కళాశాల సమీపంలోకో వెళ్లే దుస్థితి నెలకొంది. అమ్మారుులైతే అధ్వానంగా ఉన్న మూత్రశాలల్లోకి వెళ్లలేక.. అలాగే ఇబ్బందితో ఉండలేక గంటలపాటు నరకయాతన అనుభవిస్తున్నారు. - పాలమూరు 2500 మంది అమ్మాయిల దుస్థితి.. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఇతర కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 2500 మంది చదువుకుంటున్నారు. రాష్ట్రంలోనే ఇంటర్లో అత్యధిక విద్యార్థులు కల్గిన కళాశాల ఇదేనని పేరుంది. కానీ ఇక్కడి విద్యార్థినులందరికీ ఒక చిన్నగదిలో ఆరు మూత్రశాలలు ఏర్పాటు చేశారు. దీంట్లో నల్లా కనెక్షన్ ఉన్నా.. వాడుకోవడానికి నీళ్లు రావు. దీంతో మూత్రశాలలకు వెళ్లిన వారు టారుులెట్ అనంతరం చేతులు శుభ్రం చేసుకోకుండానే బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. అరుుతే కొందరు తాగడానికి ఏర్పాటు చేసిన నీటిని తెచ్చుకుని అక్కడ వాడుతున్నట్లు తెలుస్తోంది. టారుులెట్ గదిలో వాడిన నీళ్లు బయటకు వెళ్లకపోవడంతో దుర్వాసన వస్తోంది. పల్లెలనుంచి అధికంగా వస్తారు ఈ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అమ్మారుులలో మహబూబ్‌నగర్ మండలంతోపాటు, దేవరకద్ర, భూత్పూర్, అడ్డాకల్, నవాబ్‌పేట, హన్వాడ, కొరుులకోండ చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు 80శాతం మంది ఉంటారు. అరుుతే కళాశాల ఉదయం 9.30గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4గంటలకు వదిలిపెడతారు. అరుుతే 4గంటలకు కాలేజీ నుంచి బయటకు వచ్చిన అమ్మారుులు ఇంటికి చేరుకోవడానికి మరో 2 గంటల సమయం పడుతుంది. అంటే సాయంత్రం 6 గంటల అవుతుంది. అంటే ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మూత్రశాలలకు వెళ్లకుండా ఉండే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. చాలామంది ఇంట్లో పూర్తి చేసుకోని మళ్లీ ఇంటికి వెళ్లేవరకు అలాగేఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. గంటల పాటు టారుులెట్‌కు వెళ్లకుండా ఉంటే అమ్మారుుల శారీరక ఎదుగుదలతో పాటు ఇతర రోగ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాగా, కొత్తగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్ స్పందించి తమ సమస్యలను తప్పక పరిష్కారిస్తారని ఆ కళాశాల విద్యార్థినులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం మా కళాశాలలో మూత్రశాలలు లేకపో వడం చాలా ఇబ్బం దిగా మారింది. కళా శాలలో 2500 మందికి పైగా విద్యార్థినులం ఉన్నాం. కళాశాలలో కేవలం ఒక గదిలో ఆరుగురు వెళ్లడానికి అవకాశం కల్పిస్తూ టారుులెట్స్ ఏర్పాటు చేశారు. కానీ దాంట్లో కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో ఎవరూ వెళ్లడం లేదు. ప్రభుత్వం పట్టించుకుని కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి. - సునీత, కళాశాల విద్యార్థిని కొత్త కలెక్టర్‌పైనే.. కోటి ఆశలు కళాశాలలో సరిపడా టారుులెట్స్, మరుగుదొడ్లు లేక స్థానికంగా చదువు తున్న విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్ మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. హన్వాడ మండలం సల్లోనిపల్లి మాదిరిగా మా కళాశాలలో బాత్రూంలను నిర్మిస్తారని ఆశిస్తున్నాం. - మౌనిక, కళాశాల విద్యార్థిని -
తొలిరోజు పుష్కరం మమ
* పెనుమూడి పుష్కర ఘాట్‌కు చేరని జలాలు * నామమాత్రంగా భక్తుల సందడి * సముద్రపు పోటు నీటిని పైపుల ద్వారా.. అందించిన అధికారులు మోర్తోట (నిజాంపట్నం), రేపల్లె: కృష్ణమ్మ పుష్కరాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.. తొలిరోజు భక్తుల సందడి నామమాత్రంగానే కనిపించటంతో పుష్కర ఘాట్లు వెలవెలపోయాయి. కృష్ణమ్మ పుష్కరాల సందర్భంగా ఆతల్లి ఒడిలో పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలు హరించి, సుఖశాంతులు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కృష్ణమ్మ జాడలేకపోవటంతో నిరుత్సోహాన్ని మిగిల్చింది. పెనుమూడి ఘాట్, మండలంలో రావిఅనంతవరం, పెనుమూడి వీఐపీ ఘాట్, మోర్తోట, మైనేనివారిపాలెం, గంగడిపాలెం, రాజుకాల్వల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. అయితే నదిలో నీటి కొరత ఏర్పడింది. ఘాట్ ఇనుప కంచె తొలగించి.. ఘాట్‌కు ఏర్పాటు చేసిన ఇనుమ కంచెను తొలగించిన కొద్ది దూరంలో పడవలు ఏర్పాటు చేసి స్నానాలకు ఏర్పాటు చేయటంతో పాటు పైపులైన్ల ద్వారా స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు ఆనీటితోనే స్నానాలు చేసి సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దక్షిణ కాశీగా పేరుగాంచి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మోర్తోట ముక్తేశ్వరుని ఆలయం వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానమాచరించి ముక్తిని పొందవచ్చని వచ్చిన భక్తులు ముక్తి మాట దేవుడెరుగు పుణ్యస్నానాలకు నీరే కరువు అంటూ ఏకరువుపెట్టారు. సముద్రపు జలాలల్లోనే పుణ్యస్నానాలు చేసి సంతృప్తి పొందాల్సి వచ్చింది. మండలంలోని పెనుమూడి, మోర్తోట తదితర పుష్కర ఘాట్లలో భక్తుల సందడి నామమాత్రంగానే కనిపించింది. మోర్తోటలో పుణ్యస్నానాలు.. రేపల్లె మండలం మోర్తోట గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామి దేవాలయ సమీపంలోని కృష్ణా పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఘాట్‌కు ఉదయం 7.30గంటల వరకు సముద్రపు పోటునీరు తాకిడి ఉండటంతో అరకొరగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. 7.30గంటల నుంచి సముద్రపు పాటు మళ్ళటంతో ఘాట్ దరికి నీరు చేరకపోవటంతో వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించకుండా వేచి చూడాల్సి వచ్చింది. అయితే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీరు లేకపోవటంతో కొందరు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఘాట్ వద్ద నీరులేకపోవడంతో.. 11.30 గంటల తరువాత ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పుష్కరఘాట్‌కు పక్కనే నదిలో స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయించడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించారు. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శాస్త్రోక్తంగా పిండ ప్రధానాలు నిర్వహించుకున్నారు. ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బక్కెట్లతో నీళ్లు.. నదిలోని నీటిని గజ ఈతగాళ్ళ దగ్గర నుంచి బకెట్లతో తెప్పించుకుని మగ్గులతో నెత్తిపై పోసుకోవాల్సిన పరిస్థితి. వచ్చిన భక్తులు నీరులేకపోవటంతో నిరాశకుగురై ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్లలేక నెత్తిపై కొంచెం నీరు చిమ్ముకుని మమ అనుకున్నారు. నీరు వచ్చే విధంగా ఘాట్లు నిర్మించకపోవటంతో వచ్చిన భక్తులు ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేశారు. ముందుగానే భక్తులు తమ వెంట బక్కెట్టు, మగ్గు తెచ్చుకోవాలని ప్రకటన ఇచ్చి ఉంటే బాగుండేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
సర్కార్ బడుల్లో సమస్యల తిష్ట
♦ కానరాని మరుగుదొడ్లు ♦ ఉన్నా.. నీటి సౌకర్యం సున్నా ♦ తాగునీళ్లూ కరువే సర్కార్ బడుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు ఉన్న చోట నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. నారాయణఖేడ్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నతపాఠశాలలో 700 మంది విద్యార్థినులకు గాను మూడే మరుగుదొడ్లు ఉన్నాయి. ఇంటర్వెల్ సమయంలో టాయిలెట్ల వద్ద బారులు తీరాల్సి వస్తుందంటే వసతులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం లేకపోవటంతో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,899 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1260 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో 3.5 లక్షలపైచిలుకు విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యార్థుల అవసరాలకు మేర మూత్రశాలలు లేవు. దీంతో ఆరుబయట మూత్రవిసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవటం విద్యార్థుల డ్రాపౌట్స్‌కు దారితీస్తోంది. - సాక్షి, సంగారెడ్డి ఆరుబయటకే... నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్, వెల్దుర్తి, శివ్వంపేట, హత్నూర, కౌడిపల్లి, కొల్చారం మండలాల్లోని సగానికి సగం పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఈ ఏడాది బడికి వచ్చే పిల్లలు అవస్థలకు పడక తప్పని పరిస్థితి నెలకొంది. నీటి సమస్య కారణంగా చాలావరకు వినియోగంలో లేకుండా పోయాయి. శిథిలమైనా మరమ్మతులకు నోచుకోవడం లేదు. తండాల్లోనైతే మరుగుదొడ్లు అసలే లేవు. అంతా ఆరుబయటకే వెళ్తున్నారు. - నర్సాపూర్ తాళాలే.. నియోజకవర్గంలో 304 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 50 వేల పైచిలుకు విద్యార్థులు చదువుతున్నారు. గత ఏడాది సుప్రీం కోర్టు హెచ్చరికతో ఆర్వీఎం ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లులేక ఇబ్బందులు తప్పడం లేదు. సగానికిపైగా పాఠశాలల్లో నీటి వసతిలేక నిరుపయోగంగా మారాయి. నీటి వసతిలేని అనేక మరుగుదొడ్లుకు ఉపాధ్యాయులు తాళాలు వేశారు. చిన్నశంకరంపేట జెడ్పీహెచ్ఎస్లో 600 పైచిలుకు విద్యార్థులు ఉండగా, సగానికిపైగా బాలికలు చదుతున్నారు. వీరందరికి కలిపి ఒకే టాయిలెట్ ఉండటంతో దాని ఎదుట విద్యార్థులు గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. - మెదక్ శిథిలం... జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గల మరుగుదొడ్లు, మూత్రశాలలు నీళ్లు లేక నిరుయోగంగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పట్లో హడావిడి చేసిన అధికారులు ఆ తరువాత చేతులెత్తేశారు. జహీరాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 900 మందికిగాను మరుగుదొడ్లు మూడు మాత్రమే ఉండగా అందులో రెండే వినియోగంలో ఉన్నాయి. నీటి వసతి లేకపోవడంతో నిర్వహణ అధ్వానంగా మారింది. - జహీరాబాద్ నీళ్లు లేక సమస్య.. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఫలితంగా మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దుర్వాసన వస్తోంది. మంత్రి హరీశ్‌రావు చొరవతో అరబిందో వంటి సంస్థల సహకారంతో సిద్దిపేటలో అత్యాధునికంగా నిర్మించిన మరుగుదొడ్లు నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచాయి. అయితే మౌలిక వసతుల కల్పనలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఈ ఏడాదైనా నీటి వసతి కల్పించి మరుగుదొడ్లు, మూత్రశాలలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. - సిద్దిపేట జోన్ కంపు కంపు... దుబ్బాక మండలంలో మండలంలో 18 ఉన్నత, 12 ప్రాథమికోన్నత, 43 ప్రాథమిక పాఠశాలలు 43 ఉన్నాయి. దాదాపు అన్ని పాఠశాలల ఆవరణలో బాలురు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మూత్ర శాలలు నిర్మించినా నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వీటిని నిర్మించక పోవడం సమస్యగా మారింది. మిరుదొడ్డి మండలంలోనే అదే పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, మూత్రశాలల వినియోగించిన తర్వాత శుభ్రం చేయడానికి నీటి సరఫరా లేక కంపు కొడుతున్నాయి. మిరుదొడ్డిలో సకల హంగులతో మోడ ల్ స్కూల్ నిర్మించినా వసతులు లేక విద్యార్థులు ఆరు బయటకు వెళ్తున్నారు. - దుబ్బాక/మిరుదొడ్డి సీఎం ఇలాకాలోనూ అంతే... సీఎం సొంత నియోజకవర్గంలోనూ మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిగ్గా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. లేని చోట అసలే లేవు. ఉన్న చోట నీటి కొరత ఏర్పడింది. ఫలితంగా నిరుపయోగంగా మారిం ది. మరికొన్ని చోట్ల నిర్వహణ సరిగా లేక అస్తవ్యస్తంగా ఉంది. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. - గజ్వేల్ బడి ఒకచోట.. మరుగుదొడ్డి మరోచోట.. అందోలు నియోజకవర్గంలోని అందోలు, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాల్లో మొత్తం 342 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఒకటి, రెండు శాతం మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి లక్షల రూపాయలు వెచ్చించినా నిరుపయోగంగా ఉన్నాయి. నీటి వసతిలేని ప్రాంతంలో నిర్మించడంతో 80 శాతం మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి.అందోల్ మండలం అన్నాసాగర్‌లో బడి ఒకచోట ంటే మరుగుదొడ్డి మరో చోట నిర్మించారు. దాదాపు అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. వినియోగంలో లేక తాళం వేశారు. - జోగిపేట జిల్లా కేంద్రంలోనూ... జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, న్యూ హైస్కూల్లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. మండలంలోని పలు పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. గతేడాది బీడీఎల్ యాజమాన్య ఆర్థిక సహకారంతో ఉత్తర్పల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, కంది, చెర్యాల్, ఇంద్రకరణ్, కొత్లాపూర్ తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నీటి సరఫరా లేక నిరుపయోగంగా మారాయి. సదాశివపేట, కొండాపూర్ మండలాల్లోనూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - సంగారెడ్డి రూరల్/సదాశివపేట/కొండాపూర్ బాలికలకు ఇబ్బందులు... నారాయణఖేడ్ మండలంలో 104 పాఠశాలలు ఉండగా ఇందులో 8 పాఠశాలల్లో అసలే మరుగుదొడ్లు లేవు. 56 పాఠశాలలకు నీటివసతి లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు వినియోగంలో లేవు. కల్హేర్ మండలంలో 74 పాఠశాలలకు గాను 32 పాఠశాలల్లో మరుగుదొడ్లు అసలే లేవు. నీటివసతి లేకపోవడంతో మరో 20 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కంగ్టి మండలంలో 67 పాఠశాలలకు ఐదారు పాఠశాలల్లో మినహా ఎక్కడా మరుగుదొడ్ల వినియోగం లేదు. పెద్దశంకరంపేట మండలంలో 13 పాఠశాలల్లో సరైన టాయ్లెట్లు లేవు. మనూరు మండలంలో 91 పాఠశాలలకు గాను 13 పాఠశాలల్లో మరుగుదొడ్లు అసలే లేవు. నీటిసౌకర్యంలేకపోవడంతో 12 పాఠశాలల్లోనూ మరుగుదొడ్లు వినియోగించడంలేదు. 78 పాఠశాలలకు నీటివసతి లేదు. ఫలితంగా ఈ పాఠశాల్లోనూ మరుగుదొడ్లు వినియోగించడంలేదు. దాదాపు అన్ని చోట్ల విద్యార్థులు ఆరుబయటకే వెళ్తున్నారు. బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - నారాయణఖేడ్ మొక్కుబడిగా... పటాన్చెరు, జిన్నారంలోని అత్యధిక పాఠశాలల్లో మరుగుదొడ్లు వాడే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు ప్రతినిధులు కొందరు పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిస్థితిని పరిశీలించి వెళ్లిన తర్వాత కొన్ని పాఠశాలల్లో మూత్ర శాలలకు, మరుగుదొడ్లకు రంగులు పడ్డాయే తప్ప పరిస్థితి మారలేదు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. కొన్ని చోట్ల పైప్లైన్లు ఏర్పాటు చేయలేదు. జిన్నారంలోని దాదాపు 30 పాఠశాలల్లో టాయ్లెట్లు వాడేందుకు అనువుగా లేవు. - పటాన్చెరు -
నీరు...రానీరు
గ్రేటర్ గ్రిడ్‌కు మొండి చేయి తాగునీటి పథకాలకు గ్రహణం మహా నగర దాహార్తిపై సర్కారు నిర్లక్ష్యం సిటీబ్యూరో: ‘రాబోయే నాలుగేళ్లలో గ్రేటర్లో ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తాం’... ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నగరానికి చెందిన మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నిత్యం ఏదో ఒక సందర్భంలో నగర వాసులకు ఇస్తున్న వాగ్దానమిది. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నీళ్లిచ్చే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. మహా నగర దాహార్తిని తీర్చేందుకు జలమండలి సిద్ధం చేసిన కీలక మంచినీటి పథకాలపై సర్కారు శీతకన్ను వేయడంతో వీటిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గ్రేటర్ మంచినీటి ముఖచిత్రం పరిశీలిస్తే.. మహా నగరంలో సుమారు 22 లక్షల భవంతులు ఉండగా.. వీటిలో నల్లా కనెక్షన్లు ఉన్నవారు కేవలం 8.64 లక్షలు మాత్రమే. మిగిలిన ఇళ్లలో నివాసం ఉంటున్న వారంతా బోరుబావులు, ప్రైవేటు ఫిల్టర్ ప్లాంట్లు, ట్యాంకర్ నీళ్లపై ఆధార పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీరందరికీ కుళాయి నీళ్లు అందని ద్రాక్షగా మారాయి. ‘మహా’ నిర్లక్ష్యం... గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీలకు మంచినీటి సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. జలమండలి మంచినీటి సరఫరా పైప్‌లైన్ నెట్వర్క్, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడంతో లక్షలాది మంది దాహార్తితో అలమటిస్తున్నారు. దీని నుంచి బయట పడేందుకు జలమండలి అధికారులు మంచినీటి పథకాలను పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినా.. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. వీటిలో ఏ ఒక్క పథకానికీ రాష్ట్ర సర్కారు మోక్షం కల్పించలేదు. దీంతో ఇంటింటికీ నల్లా నీరు అందించడం తీరని కలగా మారనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ప్రమాద ఘంటికలు
అనంతపురం టౌన్: తాగునీటి సమస్య ఈసారి పట్టణాలనూ వదిలేటట్లు లేదు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరగడంతో రానున్న మూడు నెలల్లో నీటి సమస్య తీవ్రత గురించిన ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి వనరులను సద్వినియోగించుకోవడంపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే వేసవిలో పట్టణ జనం గుక్కెడు నీటి కోసం అల్లాడాల్సిందే. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నివేదిక పంపించారు. వేసవిలో నీటి ఎద్దడి నుంచి గట్టేందుకు ఏ మేరకు నీరు అవసరముందో తెలియజేస్తూ స్పష్టమైన ప్రతిపాదనలు ఇందులో ఉంచారు. వాటి అమలు దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటే చాలా వరకు సమస్య నుంచి గట్టెక్కవచ్చు. పీఏబీఆర్‌లో 0.727 టీఎంసీలు నిల్వ చేయాలి జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తో పాటు హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర మునిసిపాలిటీలకు పెన్న అహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి నీటిని ఇస్తున్నారు. ప్రస్తుత వేసవిలో ఆగస్టు వరకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే 0.727 టీఎంసీల నీటిని డ్యాంలో నిలువ చేయాలి. అనంతపురం కార్పొరేషన్‌కి పీఏబీఆర్ పైప్‌లైన్ ప్రాజెక్టు ద్వారా నీటిని ఇస్తుంటే, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర మునిసిపాలిటీలకు శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇస్తున్నారు. వేసవిలో అనంతపురం కార్పొరేషన్ అవసరాలకు0.508 టీఎంసీలు, హిందూపురం మునిసిపాలిటీకి 0.155 టీఎంసీలు, కళ్యాణదుర్గం మునిసిపాలిటీకి 0.042 టీఎంసీలు, మడకశిర మునిసిపాలిటీకి 0.022 టీఎంసీలు మొత్తం 0.727 టీఎంసీ నీరు అవసరం. ఈ మేరకు నీటిని పీఏబీఆర్‌లో నిలువ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. సీబీఆర్‌లో 0.640 టీఎంసీలు నిలువ చేయాలి ధర్మవరం, కదిరి, పుట్టపర్తి మునిసిపాలిటీలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) నుంచి నీటిని ఇస్తున్నారు. వేసవిలో ఆగస్టు వరకు ఈ ప్రాంతాల్లో నీటి అవసరాలకు 0.640 నీరు అవసరం అవుతుంది. ధర్మవరం మునిసిపాలిటీకి 0.323 టీఎంసీ, కదిరి మునిసిపాలిటీకి 0.236 టీంఎసీ, పుట్టపర్తి మునిసిపాలిటీకి 0.081 టీఎంసీ మొత్తం 0.640 టీఎంసీ నీరు అవసరమవుతుంది. పెన్నాకి రెండు టీఎంసీలు కావాలి పెన్నానదిలో బోర్లు ద్వారా తాడిపత్రి, పామిడి, గుత్తి మునిసిపాలిటీలకు నీటిని ఇస్తున్నారు. అయితే గత నాలుగేళ్లగా పెన్నా పూర్తిగా ఎండిపోవడంతో బోర్లలో నీరు లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. వేసవిలో ఈ సమస్య మరింత ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఇదే విషయాన్ని ఈఎన్సీ ఉంచారు. ఈ సమస్యను అధిగమించాలంటే పెన్నా నదికి మిడ్ పెన్నార్ నుంచి రెండు టీ ఎంసీ నీటిని ఇవ్వాలి. ఈ నీటితో భూగర్భజలాల పెరిగి బోర్లు రిచార్జ్ అవుతాయి. తద్వారా నీటి ఎద్దడి తలెత్తకుండా చూడవచ్చని నివేదికలో పేర్కొన్నారు. -
7 జిల్లాల్లో వాటర్ గ్రిడ్
దశలవారీగా రాష్ట్ర ప్రజలందరికీ మంచినీరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజలందరికీ వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి వసతి కల్పించాలన్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో.. తొలి దశలో ఏడు జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ఏర్పాటునకు పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. తొలి దశలో అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించనున్నారు. ఈ జిల్లాల్లో తాగునీటికి, పరిశ్రమలకు సరఫరా చేసేందుకు 73.134 టీఎంసీలు అవసరమని లెక్కకట్టారు. ఏడు జిల్లాలకుగాను అనంతపురం జిల్లా వాటర్ గ్రిడ్‌కు మాత్రం సవివరమైన ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు. దీనికి రూ.1,400 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. మిగతా ఆరు జిల్లాల్లో వాటర్ గ్రిడ్‌కు సవివరమైన ప్రాజెక్టు నివేదికలు తయారీ దశలో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు పెన్నా అహోబిలం, తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా నీటిని వాటర్ గ్రిడ్‌కు వినియోగించాలని ప్రతిపాదించారు. అలాగే చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా సుజల స్రవంతి, గండికోట ద్వారా నీటిని వాటర్ గ్రిడ్‌కు వినియోగించాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గండికోట మైలవరం నీటిని, కర్నూలు జిల్లాలో శ్రీశైలం నీటిని వాటర్ గ్రిడ్‌కు వినియోగించాలని ప్రతిపాదించారు. నెల్లూరు జిల్లాకు సోమశిల, కండలేరు నీటిని, గుంటూరు, ప్రకాశం జిల్లాల వాటర్ గ్రిడ్‌కు కృష్ణా జలాలను వినియోగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇదిలా ఉండగా మొత్తం 13 జిల్లాలకు వాటర్ గ్రిడ్‌కు తాగునీటి, పరిశ్రమల అవసరాలకోసం 232.10 టీఎంసీలు అవసరమని అధికారులు తేల్చారు. ఇందులో 13 జిల్లాల పట్టణ, గ్రామీణ మంచినీటి అవసరాలకు 166.42 టీఎంసీలు, పరిశ్రమలకోసం 65.68 టీఎంసీలు అవసరమని లెక్కకట్టారు. నీటి అవసరాలను కూడా 2044 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని లెక్కకట్టారు. వాటర్ గ్రిడ్లకు జలాశయాల్లో నీటిని వినియోగించడానికి అవసరమైన అనుమతిని సాగునీటి శాఖ ఇవ్వాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనాభా పెరుగుదలను ఈ విధంగా అంచనా వేశారు. 20112014 10 శాతం జనాభా పెరుగుదల 20142024 9 శాతం జనాభా పెరుగుదల 20242034 8 శాతం జనాభా పెరుగుదల 20342044 7 శాతం జనాభా పెరుగుదల తాగునీరు, పరిశ్రమలకు 73.134 టీఎంసీలు 13 జిల్లాలకు 232 టీఎంసీలు అవసరం అనంతపురం వాటర్ గ్రిడ్‌కు 1,400 రూ. కోట్ల అంచనా -
రబీ.. ఆరుతడి పంటలే మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులు, కుంటలు, చెరువుల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా జిల్లాలో 60 వేల హెక్టార్లకు గాను 20వేల హెక్టార్లలోనే వరి సాగైంది. ఇదే ప్రభావం వల్ల మెట్ట పంటల్లోనూ దిగుబడి తగ్గింది. ఖరీఫ్ ప్రభావం ప్రస్తుతం రబీ కాలంలో కరెంటు కోతలతో సహా అదే విధంగా ఉంది. నీటి సౌకర్యం ఉన్న రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే దిగుబడి సాధించి అవసరమైన ఆదాయం పొందవచ్చని ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజశేఖర్ వివరించారు. ప్రత్యామ్నాయ పంటల్లో మొక్కొజన్న, జొన్న, పెసర, మినుము, కుసుమ, పొద్దు తిరుగుడు పంటలు సాగు చేయొచ్చు. ఆరుతడి పంటలు సాగు చేస్తే అవసరమైన నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడులు తగ్గుతాయి. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో కనీసం రెండు నుంచి నాలుగెకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. పంట మార్పిడి వల్ల పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పైరులో పప్పు ధాన్యాల పంటలతో భూసారం వృద్ధి చెందుతుంది. మొక్కజొన్న అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు వేసుకోవచ్చు. జీరోటిల్లేజి పద్ధతిలో మొక్కజొన్న విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కేజీల విత్తనం అవసరమవుతుంది. డీహెచ్ఎం-111/ 117 వంటి మధ్యకాలిక రకాలు, డీహెచ్ఎం-115 వంటి స్వల్పకాలిక రకాలు వేసుకోవచ్చు. హైబ్రిడ్లలో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఎంచుకుని వేసుకోవచ్చు. కోహినూర్, బియో-9637 95రోజుల నుంచి వంద రోజులు, పయనిర్ 3342, డీకేసీ-7074, జేకేఎంహెచ్-1701, 85- 90 రోజుల పంట కాలం. మొక్కజొన్నకు 600 మిల్లీమీటర్ల నీటి పరిమాణం, 450 యూనిట్లు విద్యుచ్ఛక్తి అవసరం. పొద్దుతిరుగుడు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం. ఊష్ణోగ్రతలు 38డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు దిగుబడి అంతగా రాదు. పంట కాలం 90 రోజులు. హైబ్రిడ్లు కేబీఎస్‌హెచ్1/14, ఎన్‌డీఎస్‌హెచ్-1, డీఆర్‌ఎస్‌హెచ్-1, ఏపీఎస్‌హెచ్ 66, ఇంకా ప్రైవేట్ హైబ్రిడ్లను కూడా వేసుకోవచ్చు. దీనికి 400 మిల్లీమీటర్ల నీటి పరిమాణం, 300 యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరం. శనగ వరికి ప్రత్యామ్నాయమే కాకుండా సోయాబీన్ తర్వాత కూడా ఆరుతడి పంటగా నవంబర్ వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 25-30 కిలోల విత్తనం అవసరం. జేజీ11, అన్నెగిరి, జేఏకేఐ 9218 రకాలు ఎంచుకోవచ్చు. 100-105 రోజుల పంట కాలం. దీనికి 150 మిల్లీమీటర్ల నీటి పరిమాణం. 112 యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరం. -
పీజీ హాస్టల్లో ఆకలి కేకలు
రెండు రోజులుగా భోజనాలు బంద్ ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు రాయచూరు : గుల్బర్గా వర్సిటీకి అనుబంధంగా స్థానిక శివారు ప్రాంతంలోని జ్ఞానతుంగ స్నాతకోత్తర కేంద్రం హాస్టల్లో ఆకలికేకలు మార్మోగుతున్నాయి. హాస్టల్ అస్తవ్యస్త నిర్వహణ కారణంగా రెండు రోజులుగా విద్యార్థులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. నీటి సౌకర్యం లేక రెండు రోజులుగా స్నానాలకు కూడా నోచుకోవడం లేదు. హాస్టల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 130 విద్యార్థులు, 10 విద్యార్థినిలు వసతి పొందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి టిఫిన్లు, భోజనాల కోసం టెండర్లు పిలిచి కంట్రాక్టు ఇచ్చారు. కాంట్రాక్టర్ అందజేస్తున్న భోజనంలో నాణ్యత లేదని రెండు రోజుల క్రితం విద్యార్థులు ఆరోపించడంతో కాంట్రాక్టర్ ఏకంగా భోజనాలు వడ్డించడం మానేశారు. దీంతో విద్యార్థులు బయటి హోటళ్లను ఆశ్రయించారు. జేబులు ఖాళీ కావడంతో దాదాపు 80 మంది స్వగ్రామాలకు వెళ్లిపోగా 40 విద్యార్థులు ఒక్కొక్కరు 20 రూపాయలు చందా వేసుకొని ఒకపూట భోజనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై హాస్టల్ ప్రత్యేక అధికారి, ఇంచార్జి వార్డెన్‌ను వివరణ కోరగా తన నిస్సాహాయతను వ్యక్తం చేశారు. ఆ కేంద్రం ప్రత్యేక అధికారి భాస్కర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్‌తో వివాదం ఫలితంగానే విద్యార్థుల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయంలో చట్టరీత్య చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విషయాన్ని కలెక్టర్ శశికాంత్ సెంథిల్ దృష్టికి తీసుకెళ్లగా గుల్బర్గ విశ్వవిద్యాలయం కులపతితో మాట్లాడి భోజన ఇతర వసతులకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని కోరతానన్నారు. -
మిరప సాగుకు తరుణమిది
బాల్కొండ : జిల్లాలో మిరప సాగు తక్కువే అయినా.. ఇటీవలి కాలంలో పలువురు రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జలాల్పూర్ గ్రామంలోని పలువురు రైతులు ఏ కాలంలోనైనా మిరప పండిస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నా.. నీటి సౌకర్యం ఉన్న రైతులు మిరప సాగు చేస్తున్నారు. పలువురు నారు మళ్లు పోసుకుంటున్నారు. నారు పేసే పద్ధతి కిలో మిరప విత్తనాలకు థయిరం 3 గ్రా ములు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. భూమిని బెడ్ రూపంలో ఎత్తుగా చేసి నారు పోయాలి. భూమిలో తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. లేకపోతే నారు ఎండిపోతుంది. బెడ్‌గా చేసి నారు పోయడం వల్ల నారులో వేర్లు దృఢంగా ఏర్పడతాయి. దీంతో నారు తీసి నాట్లు వేయగానే మిరప నాటుకుంటుంది. మిరప నాట్లు వేసే భూమిలో వర్మి కంపోస్ట్ లేదా కాంప్లెక్స్ ఎరువులైన 20ః20, డీఏపీలను చల్లాలి. 30 రోజుల తర్వాత నారు పీకి నాట్లు వేయాలి. తెగుళ్లు.. నివారణ మిరపను ప్రధానంగా రెండు తెగుళ్లు ఆశిస్తాయి. ఒకటి కింది ముడత, రె ండోది పై ముడత. వీటితోపాటు రసం పీల్చు పురుగులూ పంటకు నష్టం చేకూరుస్తాయి. కింది ముడత ఆశించినప్పుడు నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా డైనోపాల్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకు పైముడతకు క్లోరోపైరిఫాస్ లేదా ఇమిడిక క్లోపడ్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు కాపర్ యాసిడ్ క్లోరిఫైడ్ 1.5 మిల్లీ లీటర్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. -
కొండంత నిర్లక్ష్యం
శ్రీకృష్ణదేవరాయల పాలన ఎంత ఘనంగా సాగిందన్న దానికి పొరుగునున్న కర్ణాటకలోని హంపి తర్వాత పెను‘కొండ’ కోట మచ్చుతునక. చరిత్రకు సాక్షాలుగా నిలిచిన పెను‘కొండ’ కట్టడాలను భావి తరాల వారూ తిలకించేలా భద్రంగా కాపాడటంలో పాలకులు విఫలమవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి.. గుప్త నిధుల కేటుగాళ్ల తవ్వకాలతో ‘కొండ’పై రాయల వైభవం మసకబారుతోంది. చారిత్రక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న ఆర్భాటపు ప్రకటనలతోనే కాలం వెల్లబుచ్చుతున్నారు. హంపి, గోల్కొండ, చంద్రగిరి కోట విషయంలో పర్యాటక శాఖ అధికారులు చూపుతున్న శ్రద్ధలో పదో వంతు పెను‘కొండ’పై చూపితే అనతికాలంలోనే అసంఖ్యాక పర్యాటకుల ఆదరణ చూరగొంటుందనడంలో సందేహం లేదు. మొక్కుబడి ఉత్సవాలతో చేతులు దులుపుకోకుండా ప్రజాప్రతినిధులు అభివృద్ధికి చేయూతనివ్వాలి. పెనుకొండ/ సాక్షి, అనంతపురం : ప్రఖ్యాతిగాంచిన పెనుకొండలోని కోట, ఇతర చారిత్రక కట్టడాల సంరక్షణలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. పట్టించుకునే వారు లేకపోవడంతో గుప్త నిధుల కేటుగాళ్లు విచ్చలవిడిగా తవ్వకాలకు పాల్పడుతున్నారు. రాయల ఉత్సవాలపై చూపుతున్న శ్రద్ధ.. ఈ కట్టడాల సంరక్షణపై కూడా చూపితే బావుంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గగన్‌మహల్, గాలిగోపురం, నాటి పరిపాలనా భవనమైన ఖిల్లా, బసవణ్ణ బావి, తిమ్మరుసు బందీఖానా, పలు ఆలయాలు.. విజయనగర రాజుల పాలనకు దర్పణం పడుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. కొండ పైభాగంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఎంతో సుందరంగా నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ ఆలయం నేడు శిథిలావస్థకు చేరుకుంది. గుప్త నిధుల వేటగాళ్ల తవ్వకాలతో ఆలయ రూపురేఖలే మారిపోయాయి. ఆలయంలోని నరసింహస్వామి మూలవిరాట్టునే పెకిలించివేసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆలయం లోపల, గర్భగుడిలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేసిన దృశ్యాలు ఇక్కడి దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఖిల్లా, తిమ్మరుసు సమాధి తదితర ప్రాంతాలు వేటగాళ్ల తవ్వకాల మూలంగా ధ్వంసమయ్యాయి. కట్టడాల అభివృద్ధి, లక్ష్మీనరసింహ ఆలయం పూర్వ వైభవానికి కృషి చేస్తామని గతంలో జరిగిన రాయల ఉత్సవాల్లో మంత్రులు, అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సైతం గతంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినపుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఆలయం పునర్నిర్మాణానికి తగిన సహకారం అందిస్తామని ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో హామీ ఇచ్చారు. అధికారులు సైతం గట్టి చర్యలు చేపడతామని చెప్పారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. కొండపైకి వాహనం వెళ్లడానికి వీలుగా రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో రూ. 5.50 కోట్లు కేటాయించారు. ఆ పనులు సగంలోనే ఆగిపోయాయి. కల్వర్టు, మట్టిపనులు నాసిరకంగా చేశారన్న విమర్శలు వున్నాయి. రోడ్డు నిర్మాణం పూర్తికాకుండానే కల్వర్టులు దెబ్బతినడం ఈ విమర్శలకు బలాన్నిస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆక్రమణలను పట్టించుకున్న వారే లేరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆక్రమించిన వారికి సలాములు కొడుతున్నారే తప్ప వారిపై చర్యలు తీసుకోవడానికి అడుగు ముందుకు వేసిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. కొండ రోడ్డులో అర్ధంతరంగా ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి రూ.6 కోట్ల మేర అవసరమున్నా నిధులు విడుదల అనుమానంగా మారింది. మ్యూజియం ఏర్పాటుకు స్థల సేకరణతోనే పుణ్య కాలం కాస్తా గడచిపోయేలా వుంది. కొండపైకి విద్యుత్, తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేక పోయారంటే అధికారుల అలసత్వం ఏపాటిదో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. పెను‘కొండ’ను వీక్షించడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తున్నా.. వారిని ఆకట్టుకుని ఇక్కడి చరిత్రను, గత వైభవాన్ని తెలియజెప్పేందుకు ఎలాంటి ఏర్పాట్లూ లేవు. గుప్త నిధుల వేటగాళ్ల తవ్వకాలతో ఈ ప్రాంతం కళావిహీనంగా మారుతుంటే అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినపుడు మీడియా ఎదుట షో చేయడం మినహా నిర్ధిష్టంగా తీసుకున్న చర్యలంటూ ఏవీ లేవు. ప్రస్తుతం రాయల ఉత్సవాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంత విశిష్టతను కాపాడటంలో శ్రద్ధ వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంత అభివృద్ధితో పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానికులకు ఉపాధి కలుగుతుందనే వాస్తవాన్ని వారు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ‘కొండ’పై కేటుగాళ్ల దృష్టి విజయనగర సామ్రాజ్యం విస్తరించిన పలు ప్రాంతాల్లో నాటి రాజులు ఆలయాల నిర్మాణానికి పెద్దపీట వేశారు. అద్భుత శిల్పకళతో అపురూప కట్టడాలకు ప్రాధాన్యం ఇచ్చారు. భవిష్యత్‌లో ఈ ఆలయాలు దెబ్బతింటే.. పునర్నిర్మాణానికి, మరమ్మతులకు ఎవరిపై ఆధారపడకుండా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే కొన్ని ఆలయాలు, కట్టడాల సమీపంలో నిధి నిక్షేపాలు ఏర్పాటు చేశారని పురావస్తు శాఖ పరిశోధనల్లో వెల్లడైంది. విజయనగర సామ్రాజ్యం అస్తమించే సమయంలో సంపద పరాయివారి వశం కాకుండా ఎక్కడపడితే అక్కడ దాచిపెట్టారనే వాదన కూడా ఉంది. ఈ విషయాలపై లోతుగా అధ్యయనం చేసిన కొందరు కేటుగాళ్లు ముఠాలుగా ఏర్పడి రాత్రిళ్లు తవ్వకాలు సాగిస్తుండటం పరిపాటి. ఆ సమయంలో అటువైపు ఎవరైనా వెళ్తే వారి ఉనికి బయట పడుతుందని భావించి కడతేర్చడానికి సైతం వెనుకాడరని గత సంఘటనలు వెల్లడిస్తున్నాయి. గుప్త నిధులు దక్కించుకునే క్రమంలో ఎందరో ప్రాణాలు సైతం (పంపకాల్లో గొడవల వల్ల) కోల్పోయారు. -
తెలంగాణలో సగం ఊళ్లకు నీళ్లు లేవు
మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సగం గ్రామాలకు సరైన మంచినీటి సౌకర్యం లేదని గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ అధికారులు మంత్రి తారక రామారావు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో మొత్తం 27,139 గ్రామాలుండగా, అందులో 13,516 గ్రామాలు తాగునీరు సౌకర్యాలు సరిగా లేక అల్లాడుతున్నాయని వివరించారు. 41 శాతం గ్రామాలకు మాత్రమే మంచినీటి సౌకర్యం ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. 1,847 ఫ్లోరైడ్ గ్రామాలున్నాయని అధికారులు వివరించగా.. ఈ గ్రామాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. -
పల్లెలకు కార్పొరేట్ కటాక్షం
సామాజిక బాధ్యత ద్వారా నిధుల ప్రవాహం ప్రభుత్వ నిబంధనలతో అభివృద్ధికి అవకాశం యలమంచిలి, న్యూస్‌లైన్ : సమస్యలతో సతమతమవుతున్న పల్లెలకు కార్పొరేట్ నిధుల ద్వారా స్వాంతన ల భించనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా సమస్యల నుంచి పల్లెలకు ఊరట లభించనుంది. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పన, క్రీడాభివృద్ధి, పాఠశాలల్లో కనీస సదుపాయాల పెంపు కోసం ఈ నిధుల వినియోగం తప్పనిసరి కానుంది. ఆసరా లేని వృద్ధాశ్రమాలు, క్షీణిస్తున్న అడవులు, అంతరిస్తున్న హస్తకళలు.. వీటన్నిటికీ కార్పొరేట్ నిధుల ద్వారా మేలు చేకూరబోతోంది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలపై కొరడా ఝళిపించడంతో నిధుల విడుదల తప్పనిసరి కానుంది. కార్పొరేట్ సంస్థలకు సామాజిక బాధ్యత నిధుల వ్యయం తప్పనిసరి చేసిన ప్రభుత్వం అందుకు సంబంధించి మరిన్ని నిబంధనలు విధించడంతో గ్రామాలకు లాభం కలగబోతోంది. కొత్త కంపెనీల చట్టం 2013 ప్రకారం ఏప్రిల్ 1 నుంచి యాజమాన్యాలు సేవాకార్యక్రమాలను తప్పనిసరిగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశిం చింది. రూ. 500 కోట్ల నెట్‌వర్త్, రూ. 1000 కోట్ల టర్నోవర్ లేదా రూ. 5 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తున్న పరిశ్రమలన్నీ ఖచ్చితంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు ఖర్చుచేయవలసి ఉంది. పరిశ్రమల యాజమాన్యాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనల ప్రకారం లాభాల్లో 2 శాతం నిధులను సేవా కార్యక్రమాలకు వినియోగించవలసి ఉంది. గతంలోనే ఈ నిబంధనలున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. సీఎస్ఆర్ నిబంధనల ప్రకారం పరిశ్రమల లాభాల నుంచి నిధులను కేటాయిస్తున్న యాజ మాన్యాలు ఖర్చుపై తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి జిల్లాలో విశాఖ స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, జింక్, షిప్‌యార్డు, ఎస్ఆర్గుజరాత్తోపాటు అచ్యుతాపురం ఎస్ఈజెడ్, తీరప్రాంతంలో రసాయన పరిశ్రమల వద్ద దాదాపు రూ. 200 కోట్ల సీఎస్ఆర్ నిధులు మూలుగుతున్నట్టు తెలుస్తోంది. వీటి వినియోగంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ పట్టిం చుకోకపోవడంతో యాజమాన్యాలు ఈ నిధులను ఖర్చు చేయడంలేదన్న విమర్శలున్నాయి. పలు పరిశ్రమలు మొక్కుబడిగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పాఠశాలలో మౌలిక వసతులు, ప్రకృతి వైపరీత్యాల్లో పరిశ్రమల యాజమాన్యాల మొక్కుబడిగా సేవా కార్యక్రమాలు ని ర్వహించి చేతులు దులిపేసుకున్నాయి. కేంద్ర ప్రభు త్వం తాజా ఉత్తర్వులతో పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధుల వినియోగానికి సిద్ధమయితే పల్లెల సమస్యలు తొలగనున్నాయి. నిధులు కేటాయించాల్సిన కార్యక్రమాలు సురక్షితమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, సామాజికాభివృద్ధి ప్రాజెక్టులు. గ్రామీణ క్రీడలు, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన క్రీడలకు ప్రోత్సాహం, శిక్షణ కార్యక్రమాలు అడవుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతరక్షణ, ప శుసంవర్ధక కార్యక్రమాలు, సహజవనరుల సంరక్షణ. మహిళలు, అనాథలకు ఇళ్లు, హాస్టళ్ల ఏర్పాటు, వృద్ధుల ఆశ్రమాలకు అండదండలు. -
మంచానపడ్డ పీహెచ్‌సీలు
= మందుల కొరత =భర్తీకాని ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు =సిబ్బందికి క్వార్టర్స కరువు =వైద్యులుగా మారుతున్న నర్సులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే(పీహెచ్‌సీలు) జబ్బు చేసింది. చాలాచోట్ల మందులు లేవు. వైద్య పరికరాలు అందుబాటులో లేవు. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉంది. క్లినికల్ పరీక్షలు నిర్వహించే సౌకర్యం లేదు. క్వార్టర్స లేకపోవడంతో సిబ్బంది బయటి ప్రాంతాల నుంచి వస్తున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి నియోజకవర్గం పీలేరు మినహా మరే పీహెచ్‌సీల్లోనూ తగిన సౌకర్యాలు లేవు. జిల్లా వ్యాప్తంగా 94 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన కమ్యూనిటీహెల్త్ సెంటర్లు 7, అర్బన్ హెల్త్సెంటర్లు 11, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులు 16 ఉన్నా యి. పీహెచ్‌సీలకు ప్రభుత్వం మూడు నెలల కోసారి రూ.1.25 లక్షలు కేటాయిస్తోంది. ఈ మొత్తం మందుల కొనుగోలుకే సరిపోవడం లేదు. చాలాచోట్ల ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. పరికరాలు లేవు. కొన్ని చోట్ల వైద్యులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదు. కొన్ని పీహెచ్‌సీల్లో నర్సులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. అత్యధిక పీహెచ్‌సీల్లో సరఫరా చేస్తున్న మందులు రోగుల సంఖ్యకు తగినట్లు లేవు. వైద్య పరీక్షలు చేసుకోవాలంటే బయట వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏ పీహెచ్‌సీలోనూ తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి. సత్యవేడులోని దాసుకుప్పం పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ అందుబాటులో లేరు. నర్సే వైద్య పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ గురు, శుక్రవారాల్లో మాత్రమే పని చేస్తున్నారు. గర్భిణులకు బుధవారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడ ప్రసవాలు జరగడం లేదు. తిరుపతి సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుంచి ప్రతి మూడునెలలకోసారి మందులు తెస్తున్నారు. నీటి వసతి లేదు. హస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు పీహెచ్సీలో వైద్యుల కొరత నెలకొంది. ఎంపేడు ఆస్పత్రిలో మందులు లేవు. అన్ని రకాల జబ్బులకు జ్వరం మాత్రలే దిక్కవుతున్నాయి. తొట్టంబేడు పీహెచ్సీలో వైద్యులు సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 6 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇక్కడ బడ్జెట్ కొరత వేధిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.25 లక్షలు చాలడం లేదు. పారాసిటమాల్ మాత్రలూ దొరకడం లేదు. రక్త పరీక్ష సౌకర్యాలు లేవు. కోసవారిపల్లె పీహెచ్సీలో ఒక డాక్టర్, ఫార్మసిస్టు ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ చాలడం లేదు. సదుంలో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టారు. ఇక్కడ సిబ్బంది, మందుల కొరతలేదు. క్వార్టర్స లేకపోవడంతో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. పులిచెర్ల మండలంలోనూ వైద్య సిబ్బందికి క్వార్టర్స్ లేవు. నగరి నియోజకవర్గంలోని నిండ్ర పీహెచ్సీలో జ్వరానికి సంబంధించిన మందులూ లేవు. రక్తపరీక్షకు అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. అధికారులకు నివేదించాం, మందులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. నగరి ఏరియా ఆస్పత్రిని వంద పడకలకు మార్చారు. అయితే బెడ్లు లేవు. అలాగే వైద్య పరికరాలు లేవు. సిబ్బంది ఉన్నా పరికరాలు లేకపోవడంతో పరీక్షలు చేసుకోలేని పరిస్థితి. పుత్తురు సీహెచ్‌సీలో గదులు కొరత నెలకొంది. కొత్తగా నిర్మించిన గదులు ప్రారంభానికి నోచుకోలేదు. మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో తాగునీటి వసతి లేదు. ప్యూరిఫైడ్ వాట ర్ప్లాంట్ నిరుపయోగంగా ఉంది. కుటుంబ నియంత్రణ వార్డులో వేసెక్టమీ ఆపరేషన్ చేసుకునేవారికి వేడినీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం సరఫరా లేదు. ప్రజలు బయట కొనుక్కొంటున్నారు. ఇక్కడ పరిశుభ్రత మాటే లేదు. రక్త పరీక్షలకు డబ్బులు ఖర్చు పెట్టి కిట్స్ తెప్పించుకుంటున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. పలమనేరు నియోజకవర్గంలో 8 పీహెచ్‌సీలు, వంద పడకల ఆస్పత్రి ఉన్నాయి. బెరైడ్డిపల్లె పీహెచ్సీలో వైద్యులులేరు. నర్సులే వైద్యం చేస్తున్నారు. వి.కోట ఆస్పత్రిలో పారాసిటమాల్ మాత్రలూ లేవు. పెద్దపంజాణి ఆస్పత్రిలో పెయిన్‌కిల్లర్స్ లేవు. పలమనేరు వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో రావడం లేదు. కుప్పం నియోజకవర్గంలో తొమ్మిది పీహెచ్‌సీలు, ఒక వంద పడకల ఆస్పత్రి ఉన్నాయి. అన్ని ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వల్ల వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. శాంతిపురం పీహెచ్సీలో మందుల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కుప్పం వంద పడకల ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించడం లేదు. పీలేరు నియోజకవర్గంలో వైద్యులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జనానికి ఎదురుచూపులు తప్పడం లేదు. -
సర్కారీ స్కూళ్లలో టాయిలెట్లు లేక బాలికల ఇక్కట్లు
రాష్ట్రంలో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్న స్కూళ్లు 48 శాతమే కర్ణాటకలో 97 శాతం స్కూళ్లలో వేర్వేరుగా టాయిలెట్లు సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు.. 78,450. అందులో బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్న స్కూళ్లు కేవలం 37,997. అంటే కేవలం 48 శాతం! కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలు.. 50,257. అందులో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సదుపాయం ఉన్నవి 49,185. అంటే 97 శాతం!! డిపెప్, సర్వశిక్షా అభియాన్, విద్యాహక్కు చట్టం.. ఇలా అనేక పథకాల పేరుతో ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా మన రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లేమితో ఏటా నాలుగైదు కోట్లు కుమ్మరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. టాయిలెట్లే కాదు.. అనేక స్కూళ్లలో తాగునీటి సౌకర్యం కూడా లేదు. రాష్ట్రంలో 78,450 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.. అందులో 22,026 స్కూళ్లలో (28.08 శాతం) బాలబాలికలకు ఉమ్మడి టాయిలెట్లు ఉన్నాయని, కేవలం 37,997 (48.43 శాతం) స్కూళ్లలోనే వారికి వేర్వేరుగా టాయిలెట్ సదుపాయం ఉందని స్వయంగా విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన గణాంకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఉన్న టాయిలెట్లలో కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. కొన్నింటికి నీటి సదుపాయం లేకపోగా, మరికొన్ని నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. టాయిలెట్ల ఏర్పాటుకు విద్యాశాఖ నిధులు ఇస్తున్నా.. వాటి నిర్వహణకు పక్కా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. దీంతో నిర్మించిన టాయిలెట్లు కూడా చెత్తా చెదారంతో నిండిపోయి కొన్నాళ్లకు శిథిలమైపోతున్నాయి. 66,989 పాఠశాలల్లో (85.39 శాతం) తాగునీటి సదుపాయం ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతోంది కానీ క్షేత్రస్థాయిలో ఉపయోగకరంగా ఉన్నవి తక్కువే. టీచర్ల కొరత సమస్య కూడా తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 15,892 పోస్టులు ఖాళీగా ఉండగా, సర్వశిక్షా అభియాన్ పరిధిలో 11,787 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో బోధనలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో చెత్తా చెదారం పడకుండా కిచెన్ షెడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వమే వందల కోట్ల రూపాయలు ఇచ్చినా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సద్వినియోగపరచుకోలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు సరిపోవనే సాకుతో వాటి నిర్మాణాలను గాలికొదిలేసింది. రాష్ట్రం తరపున కొంత మొత్తం కేటాయించి పూర్తి చేయాలన్న ధ్యాస లేకపోవడంతో 40 వేల కిచెన్ షెడ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు.