చెప్పుకోలేని బాధ..! | Worst toilets in the Mahbubnagar | Sakshi
Sakshi News home page

చెప్పుకోలేని బాధ..!

Published Wed, Nov 23 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

Worst toilets in the Mahbubnagar

- మహబూబ్‌నగర్ బాలికల కళాశాలలో అధ్వానంగా మూత్రశాలలు
- టాయిలెట్ గదిలో నీటి సౌకర్యం లేక.. లోపలికెళ్లలేని దుస్థితి
- ఒకటికై నా, రెంటికై నా ఇంటికెళ్లాల్సిందేనంటున్న అమ్మాయిలు
 
 ఈ చిత్రంలో కనిపిస్తున్న మూత్రశాలలు మహబూబ్‌నగర్‌లోని బాలికల జూనియర్ కళాశాలలోనివి. ఈ కళాశాలలో 2,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే మూత్రశాలల కోసం ఏర్పాటు చేసిన ఒక చిన్న గది సరిపోక దాంట్లో నీళ్లు బయటికి వెళ్లక దుర్వాసన వస్తోంది. కుళారుు కనెక్షన్ లేకపోవడంతో ఇవి ఏమాత్రం ఉపయోగపడని దుస్థితి. స్థానికంగా చదువుతున్న అమ్మాయిల ఇబ్బందులు మాటల్లో చెప్పలేం. గత్యంతరం లేని పరిస్థితిలో కొంతమంది విద్యార్థినులు అక్కడికే వెళ్తుంటే.. మరికొందరు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాతే టారుులెట్‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. లేదంటే సౌకర్యాలు లేని మూత్రశాలకో, కళాశాల సమీపంలోకో వెళ్లే దుస్థితి నెలకొంది. అమ్మారుులైతే అధ్వానంగా ఉన్న మూత్రశాలల్లోకి వెళ్లలేక.. అలాగే ఇబ్బందితో ఉండలేక గంటలపాటు నరకయాతన అనుభవిస్తున్నారు.          - పాలమూరు

 2500 మంది అమ్మాయిల దుస్థితి..
 ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఇతర కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 2500 మంది చదువుకుంటున్నారు. రాష్ట్రంలోనే ఇంటర్‌లో అత్యధిక విద్యార్థులు కల్గిన కళాశాల ఇదేనని పేరుంది. కానీ ఇక్కడి విద్యార్థినులందరికీ ఒక చిన్నగదిలో ఆరు మూత్రశాలలు ఏర్పాటు చేశారు. దీంట్లో నల్లా కనెక్షన్ ఉన్నా.. వాడుకోవడానికి నీళ్లు రావు. దీంతో మూత్రశాలలకు వెళ్లిన వారు టారుులెట్ అనంతరం చేతులు శుభ్రం చేసుకోకుండానే బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. అరుుతే కొందరు తాగడానికి ఏర్పాటు చేసిన నీటిని తెచ్చుకుని అక్కడ వాడుతున్నట్లు తెలుస్తోంది. టారుులెట్ గదిలో వాడిన నీళ్లు బయటకు వెళ్లకపోవడంతో దుర్వాసన వస్తోంది.  

 పల్లెలనుంచి అధికంగా వస్తారు
 ఈ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అమ్మారుులలో మహబూబ్‌నగర్ మండలంతోపాటు, దేవరకద్ర, భూత్పూర్, అడ్డాకల్, నవాబ్‌పేట, హన్వాడ, కొరుులకోండ చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు 80శాతం మంది ఉంటారు. అరుుతే కళాశాల ఉదయం 9.30గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4గంటలకు వదిలిపెడతారు. అరుుతే 4గంటలకు కాలేజీ నుంచి బయటకు వచ్చిన అమ్మారుులు ఇంటికి చేరుకోవడానికి మరో 2 గంటల సమయం పడుతుంది. అంటే సాయంత్రం 6 గంటల అవుతుంది. అంటే ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మూత్రశాలలకు వెళ్లకుండా ఉండే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. చాలామంది ఇంట్లో పూర్తి చేసుకోని మళ్లీ ఇంటికి వెళ్లేవరకు అలాగేఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. గంటల పాటు టారుులెట్‌కు వెళ్లకుండా ఉంటే అమ్మారుుల శారీరక ఎదుగుదలతో పాటు ఇతర రోగ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాగా, కొత్తగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్ స్పందించి తమ సమస్యలను తప్పక పరిష్కారిస్తారని ఆ కళాశాల విద్యార్థినులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
 చాలా ఇబ్బంది పడుతున్నాం

 మా కళాశాలలో మూత్రశాలలు లేకపో వడం చాలా ఇబ్బం దిగా మారింది. కళా శాలలో 2500 మందికి పైగా విద్యార్థినులం ఉన్నాం. కళాశాలలో కేవలం ఒక గదిలో ఆరుగురు వెళ్లడానికి అవకాశం కల్పిస్తూ టారుులెట్స్ ఏర్పాటు చేశారు. కానీ దాంట్లో కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో ఎవరూ వెళ్లడం లేదు. ప్రభుత్వం పట్టించుకుని కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి.
 - సునీత, కళాశాల విద్యార్థిని
 
 కొత్త కలెక్టర్‌పైనే.. కోటి ఆశలు
  కళాశాలలో సరిపడా టారుులెట్స్, మరుగుదొడ్లు లేక స్థానికంగా చదువు తున్న విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్ మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. హన్వాడ మండలం సల్లోనిపల్లి మాదిరిగా మా కళాశాలలో బాత్‌రూంలను నిర్మిస్తారని ఆశిస్తున్నాం.  
 - మౌనిక, కళాశాల విద్యార్థిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement