చెప్పుకోలేని వ్యథ.. | Toilets in public schools | Sakshi
Sakshi News home page

చెప్పుకోలేని వ్యథ..

Published Mon, Sep 22 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

చెప్పుకోలేని వ్యథ..

చెప్పుకోలేని వ్యథ..

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా వాటిని ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఉన్న కొన్నిచోట్ల నిధులు లేమితో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చెప్పుకోలేని వ్యథను అనుభవిస్తున్నారు. కనీస వసతులైన వురుగు దొడ్లు, వుంచినీరు లేక నానా అవస్థలు పడుతున్నారు.

ముఖ్యంగా బాలికలు ఈ సవుస్యతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి ‘వాటిని’ అదుపు చేసుకోవటం వల్ల వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. పాఠశాలల్లో తమ గారాలపట్టీలు పడుతున్న బాధలు చూసిన తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. ఉపాధ్యాయల వద్ద గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోవడంతో బడి మాన్పించేస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో వలిక వసతులపై ‘సాక్షి’ బృందం నిర్వహించిన సర్వేలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.

2157 పాఠశాలల్లో వురుగుదొడ్లు లేవు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల  పరిధిలో 3,285 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలు ఉన్నాయి. సగానికి పైగా పాఠశాలల్లో అంటే 2,157లలో మరుగుదొడ్లలు లేవు. బాలికల వురుగుదొడ్లు లేని పాఠశాలు 785. బాలుర పాఠశాలలు 1,372 ఉన్నాయి. 1,313 పాఠశాలల్లో వురుగుదొడ్లున్నా నిర్వహణ లేమితో అవి ఉన్నా లేనట్టే. నిర్వహణ లోపంతో పని చేయుని మరుగుదొడ్లలో బాలికలవి 864 కాగా, బాలురవి 449. మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయుకపోవటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. రెండేళ్లుగా మరుగుదొడ్ల నిర్వహణ కోసం నిధులు విదల్చటం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభుత్వం లెక్కల ప్రకారం వురుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రాథమిక పాఠశాలకు రూ. 400, ఉన్నత పాఠశాలకు రూ. 500 వుంజూరు చేయూల్సి ఉంది.

రెండేళ్ల నుంచి నిధులు వుంజూరు చేయునందున నిర్వహణ లోపం వల్ల వాటిల్లో వ్యర్థాలు భారీగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. విద్యార్థుల బాధను చూడలేని కొందరు ఉపాధ్యాయులు వాటి నిర్వహణ ఖర్చును భరిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణపై నిధులు వుంజూరు చేయూలని ఉన్నతాధికారుల నుంచి, సర్కారు వరకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. కొన్ని పాఠశాల్లో వురుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టినా... నిధుల సమస్యతో అవికాస్తా వుధ్యలోనే నిలిచి పోయూయి.
 
వుచ్చుకు కొన్ని పాఠశాలల్లో పరిస్థితి...
కుల్సుంపురాలో ఒకే చోట ఉన్న భవన సముదాయూల్లో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లో 1845 విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 949 వుంది బాలికలు ఉన్నారు. 8 మరుగుదొడ్ల, 24 మూత్రశాలలు వూత్రమే ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వురో నాలుగు వురుగుదొడ్లు నిర్వహణ లోపంతో పని చేయుక పోగా... కొత్తగా నిర్మించేందుకు 9 నెలల కిందట చేపట్టిన 4 వురుగుదొడ్ల పనులు నిలిచిపోయూరు. పని చేస్తున్న మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చు ప్రతి నెల రూ.4 వేలు ఇక్కడి ఉపాధ్యాయులే భరిస్తున్నారు.
     
గుడి వూల్కాపూర్‌లోని దేవల్ జూమ్‌సింగ్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో మొత్తంగా 878 వుంది విద్యార్థులుండగా, ఇందులో బాలికలు 451 వుంది ఉన్నారు. ఇక్కడ 4 మరుగుదొడ్ల, 12 మూత్రత్రశాలున్నా నీళ్లు లేని నిరుపయోగంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉపాధ్యాయులే రూ. 2500 పని వునిషికి చెల్లిస్తున్నారు.
     
హస్తినాపురం, పంజగుట్టలోని ఎర్రవుంజిల్, నాంపల్లి, సనత్‌నగర్‌లలోని ప్రభుత్వ పాఠశాలలో డోర్లు సరిగా లేక వురుగుదొడ్లు వాడడంలేదు.
     
వుల్లంపేట, చైతన్యపురిలోని ఇందిరానగర్, ఎల్బీనగ ర్లోని శివవ్మునగర్, వనస్థలిపురంలోని ఎన్‌జీవోస్‌కాలనీ, కార్వాన్‌లోని వుస్తెద్‌పుర ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సౌకర్యం, నిర్వహణ లోపం కారణంగా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి.
     
గోల్కొండ, లంగర్‌హౌజ్, సుల్లాన్‌బజారులోని బడీచౌడి, కవూలానగర్, ఫిలింనగర్‌లోని బీటీఆర్‌నగర్, వినాయుకనగర్ బస్తీలలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ లేకపోవడంతో వాటిని ఉపయోగించడం లేదు. కొన్ని పాఠశాలల్లోనైతే వురుగుదొడ్ల గదుల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో అటువైపు విద్యార్థులు వెళ్లేందుకు భయపడుతున్నారు.
     
పాతబస్తీలోని చార్మినార్ పరిధిలోని 52, బండ్లగూడలో 87, బహదూర్‌పురాలో 125ల చొప్పున మొత్తం 264 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో ఎక్కువ శాతం పాఠశాలల్లో మంచినీటి ఉంది. నీటి సౌకర్యం లేకపోవడంతో మూత్రశాలలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఈ సమస్య కారణంగా  విద్యార్థులు బడి మానేయాల్సిన పరిస్థితి నెలకొంది. బండ్లగూడ మండల పరిధిలోని కోట్ల అలిజా ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలలకు మూడు నెలలుగా చుక్క నీరు లేదు. దీంతో విద్యార్థినులు బడికి వెళ్లడం మానివేశారు.
     
అంబర్‌పేట్ నియోజకవర్గంలో మొత్తం 21 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు పాఠశాలలు మాత్రమే ప్రైవేటు అద్దె భవనంలో నడుస్తున్నాయి. బాపునగర్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో  విద్యార్థినులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ్‌నగర్‌లోని ప్రాధమిక పాఠశాలలో అపరిశుభ్రంగా మారాయి.
     
శేరిలింగంపల్లి గోపీనగర్ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్లు ఉన్నా వినియోగించ లేని పరిస్థితి  ఉంది. పవర్‌బోర్‌లో నీరు లేకపోవడంతో నీటి సరఫరా లేక వాటని వినియోగించకుండా తాళాలు వేశారు.
     
హఫీజ్‌పేట్, ఎంఏనగర్‌లో పాఠశాలలో మరుగుదొడ్లు లేవు, నీటి సౌకర్యం లేవు.
     
వనస్థలిపురం కమలానగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఒకే గదిలో 5 తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 40మంది విద్యార్థులు ఉండగా ఎలాంటి టాయిలెట్ సౌకర్యం లేదు.
     
లాలాపేట చంద్రబాబునాయుడు నగర్‌లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో టాయిలెట్ వ్యవస్థ లేకపోవడంతో మూత్రవిసర్జన కోసం విద్యార్థులు సమీపంలోని తమ ఇళ్ల వద్దకే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
     
లాలాపేట ఏపీ డెయిరీ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో టాయిలెట్లు లేకపోవడంతో పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో మూత్ర విసర్జనకు వెళుతున్నారు.
 
 బాలికలు బడికి రావడంలేదు..
 టాయిలెట్స్ లేక అమ్మాయిలు బడిమానేస్తున్నారు. గత సంవత్సరం అంబర్‌పేట బాలికల హైస్కూల్‌లో నలుగురు, ఈ సంవత్సరం ఒక అమ్మాయి స్కూల్‌కు రావడం మానేసింది. అంబర్‌పేట బాలికల పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. వసతులు కల్పించాలి.    
 - యాసాని కరుణాకర్‌రెడ్డి, టీచర్, ప్రభుత్వ పాఠశాల, హస్తినాపురం
 
ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం
పాఠశాలల్లో మూత్రశాలలు లేక పోవడం వల్ల చాలా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బాలికలు మూత్ర విసర్జనను బలవంతంగా ఆపుకొంటారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వయసు మీదపడిన తర్వాత మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు పలు రకాల వ్యాధులకు కారణం అవుతుంది. రోజూ ఇలాంటి కేసులు 10-15 కేసులు వస్తుంటాయి.
 - డాక్టర్ శ్రీభూషణ్‌రాజు, మూత్రపిండాల వ్యాధి నిపుణుడు, నిమ్స్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement