restrooms
-
మూత్రశాలలు లేక ఇబ్బందులు
చిన్నంబావి (వనపర్తి): మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నామని వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని అమ్మాయిపల్లి, వెల్టూరు గ్రామాల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శుక్రవారం లేఖలు పంపిం చారు. విద్యాహక్కు చట్టం ప్రకారం మౌలిక వసతుల్లో భాగమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని, కానీ నేటికీ ఆచరణలో పెట్టడం లేదని పేర్కొన్నారు. కొన్నిం టిని నామమాత్రంగా నిర్మించినా నీటి సౌకర్యం లేకపోవడంతో పనికిరాకుండా పోయాయని తెలిపారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని వారు లేఖలో న్యాయమూర్తిని కోరారు. -
మూత్రశాలలు లేక ఇబ్బందులు
చిన్నంబావి (వనపర్తి): మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నామని వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని అమ్మాయిపల్లి, వెల్టూరు గ్రామాల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శుక్రవారం లేఖలు పంపిం చారు. విద్యాహక్కు చట్టం ప్రకారం మౌలిక వసతుల్లో భాగమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని, కానీ నేటికీ ఆచరణలో పెట్టడం లేదని పేర్కొన్నారు. కొన్నిం టిని నామమాత్రంగా నిర్మించినా నీటి సౌకర్యం లేకపోవడంతో పనికిరాకుండా పోయాయని తెలిపారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని వారు లేఖలో న్యాయమూర్తిని కోరారు. -
చెప్పుకోలేని బాధ..!
- మహబూబ్‌నగర్ బాలికల కళాశాలలో అధ్వానంగా మూత్రశాలలు - టాయిలెట్ గదిలో నీటి సౌకర్యం లేక.. లోపలికెళ్లలేని దుస్థితి - ఒకటికై నా, రెంటికై నా ఇంటికెళ్లాల్సిందేనంటున్న అమ్మాయిలు ఈ చిత్రంలో కనిపిస్తున్న మూత్రశాలలు మహబూబ్‌నగర్‌లోని బాలికల జూనియర్ కళాశాలలోనివి. ఈ కళాశాలలో 2,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే మూత్రశాలల కోసం ఏర్పాటు చేసిన ఒక చిన్న గది సరిపోక దాంట్లో నీళ్లు బయటికి వెళ్లక దుర్వాసన వస్తోంది. కుళారుు కనెక్షన్ లేకపోవడంతో ఇవి ఏమాత్రం ఉపయోగపడని దుస్థితి. స్థానికంగా చదువుతున్న అమ్మాయిల ఇబ్బందులు మాటల్లో చెప్పలేం. గత్యంతరం లేని పరిస్థితిలో కొంతమంది విద్యార్థినులు అక్కడికే వెళ్తుంటే.. మరికొందరు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాతే టారుులెట్‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. లేదంటే సౌకర్యాలు లేని మూత్రశాలకో, కళాశాల సమీపంలోకో వెళ్లే దుస్థితి నెలకొంది. అమ్మారుులైతే అధ్వానంగా ఉన్న మూత్రశాలల్లోకి వెళ్లలేక.. అలాగే ఇబ్బందితో ఉండలేక గంటలపాటు నరకయాతన అనుభవిస్తున్నారు. - పాలమూరు 2500 మంది అమ్మాయిల దుస్థితి.. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఇతర కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 2500 మంది చదువుకుంటున్నారు. రాష్ట్రంలోనే ఇంటర్లో అత్యధిక విద్యార్థులు కల్గిన కళాశాల ఇదేనని పేరుంది. కానీ ఇక్కడి విద్యార్థినులందరికీ ఒక చిన్నగదిలో ఆరు మూత్రశాలలు ఏర్పాటు చేశారు. దీంట్లో నల్లా కనెక్షన్ ఉన్నా.. వాడుకోవడానికి నీళ్లు రావు. దీంతో మూత్రశాలలకు వెళ్లిన వారు టారుులెట్ అనంతరం చేతులు శుభ్రం చేసుకోకుండానే బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. అరుుతే కొందరు తాగడానికి ఏర్పాటు చేసిన నీటిని తెచ్చుకుని అక్కడ వాడుతున్నట్లు తెలుస్తోంది. టారుులెట్ గదిలో వాడిన నీళ్లు బయటకు వెళ్లకపోవడంతో దుర్వాసన వస్తోంది. పల్లెలనుంచి అధికంగా వస్తారు ఈ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అమ్మారుులలో మహబూబ్‌నగర్ మండలంతోపాటు, దేవరకద్ర, భూత్పూర్, అడ్డాకల్, నవాబ్‌పేట, హన్వాడ, కొరుులకోండ చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు 80శాతం మంది ఉంటారు. అరుుతే కళాశాల ఉదయం 9.30గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4గంటలకు వదిలిపెడతారు. అరుుతే 4గంటలకు కాలేజీ నుంచి బయటకు వచ్చిన అమ్మారుులు ఇంటికి చేరుకోవడానికి మరో 2 గంటల సమయం పడుతుంది. అంటే సాయంత్రం 6 గంటల అవుతుంది. అంటే ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మూత్రశాలలకు వెళ్లకుండా ఉండే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. చాలామంది ఇంట్లో పూర్తి చేసుకోని మళ్లీ ఇంటికి వెళ్లేవరకు అలాగేఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. గంటల పాటు టారుులెట్‌కు వెళ్లకుండా ఉంటే అమ్మారుుల శారీరక ఎదుగుదలతో పాటు ఇతర రోగ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాగా, కొత్తగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్ స్పందించి తమ సమస్యలను తప్పక పరిష్కారిస్తారని ఆ కళాశాల విద్యార్థినులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం మా కళాశాలలో మూత్రశాలలు లేకపో వడం చాలా ఇబ్బం దిగా మారింది. కళా శాలలో 2500 మందికి పైగా విద్యార్థినులం ఉన్నాం. కళాశాలలో కేవలం ఒక గదిలో ఆరుగురు వెళ్లడానికి అవకాశం కల్పిస్తూ టారుులెట్స్ ఏర్పాటు చేశారు. కానీ దాంట్లో కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో ఎవరూ వెళ్లడం లేదు. ప్రభుత్వం పట్టించుకుని కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి. - సునీత, కళాశాల విద్యార్థిని కొత్త కలెక్టర్‌పైనే.. కోటి ఆశలు కళాశాలలో సరిపడా టారుులెట్స్, మరుగుదొడ్లు లేక స్థానికంగా చదువు తున్న విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్ మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. హన్వాడ మండలం సల్లోనిపల్లి మాదిరిగా మా కళాశాలలో బాత్రూంలను నిర్మిస్తారని ఆశిస్తున్నాం. - మౌనిక, కళాశాల విద్యార్థిని -
లోపం ఎక్కడుంది?
అన్ని వసతులు ఉన్నా విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది టీచర్లను నిలదీసిన పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు హైదరాబాద్: ‘‘నేను మూడు రోజుల క్రితం నల్లగొండ జిల్లా, కొత్తపల్లిలోని శివారెడ్డి గూడెంకు వెళ్లి అక్కడి పాఠశాలలో మీటింగ్ పెట్టాను. అక్కడ అంతా బాగానే ఉంది. ఆరు గదులతో పాఠశాల, కాంపౌండ్ వాల్, తాగునీరు, మూత్రశాలలు ఉన్నాయి. అయితే పిల్లలు ఎంత మంది ఉన్నారని ఆరా తీస్తే 13 మంది అని తేలింది. సరే అక్కడే ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఎంత మంది ఉన్నారు అని తెలుసుకుంటే 410 మంది ఉన్నారని తెలిసింది. మరి లోపం ఎక్కడుంది’’ అని రాష్ట్ర పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఉపాధ్యాయులను నిలదీశారు. శనివారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణోత్సవానికి వచ్చిన చిరంజీవులు మాట్లాడుతూ ‘మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, ఉచిత పాఠపుస్తకాలు, దుస్తులు, అన్ని సదుపాయాలతో విద్యను అందిస్తున్నాం, అయినా కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉంది’ అని అసహనం వ్యక్తం చేశారు. ఏటా లక్ష నుంచి 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికనుగుణంగా ఉపాధ్యాయులు మారాలని, పాఠశాలకు సమయానికి రావడంతో పాటు బోధన పద్ధతిలో కూడా కొంత మార్పు తీసుకువచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచాలని అన్నారు. రాష్ట్రంలో ఐదు వేల పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిని మూలన పెట్టకుండా విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు చెప్పాలని సూచించారు. -
బస్టాండ్లలో దోపిడీ!
రాష్ర్టం మొత్తం మీద ఏ ఆర్టీసీ బస్టాండ్లు చూసినా అపరిశుభ్రతే! ఎంత ఘోరం అంటే కనీస సదుపాయాలు కూడా లేవు. మంచినీటి దగ్గర నుంచి మూత్రశాలల వరకూ అన్నీ అరకొరే. ఇక లోపల తినుబండారాల దుకాణాలు అయితే చెప్పనక్కరలేదు. ఏ మాత్రం శుచిగా లేకున్నా ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకోవడం ప్రయాణికు లను నిలువునా దోచుకోవడం అక్కడ దుకాణదారులకు పరిపా టైపోయింది. ఏ అధికారికి చెప్పినా ఫలితం శూన్యం. ఇది మామూలైపోయింది. ఎవరూ ఏమీచేయలేని పరి స్థితి దాపురించింది. ఒకానొక సందర్భంలో సంబం ధిత మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు మంత్రి గారికే పరాభవం ఎదురైందంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఎంతో ఘనంగా చెప్పుకునే హైద రాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్ పరిస్థితి కూడా అంతే! అదే కాదు హైదరాబాద్‌లో అన్ని ఆర్టీసీ బస్టాండ్ల పరిస్థితి అంతే, ఒక్కసారైనా ఏ ఒక్క అధికారి అడిగిన పాపాన పోలేదు, ఇక మురుగు, పారి శుధ్యం సంగతి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. కాబట్టి ఇప్పటికైనా మన అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవల సిన అవసరం ఎంతైనా ఉంది. - ఎస్.రాజేశ్వరి చిక్కడపల్లి, హైదరాబాద్ -
చెప్పుకోలేని వ్యథ..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా వాటిని ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఉన్న కొన్నిచోట్ల నిధులు లేమితో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చెప్పుకోలేని వ్యథను అనుభవిస్తున్నారు. కనీస వసతులైన వురుగు దొడ్లు, వుంచినీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బాలికలు ఈ సవుస్యతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి ‘వాటిని’ అదుపు చేసుకోవటం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. పాఠశాలల్లో తమ గారాలపట్టీలు పడుతున్న బాధలు చూసిన తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. ఉపాధ్యాయల వద్ద గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోవడంతో బడి మాన్పించేస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో వలిక వసతులపై ‘సాక్షి’ బృందం నిర్వహించిన సర్వేలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. 2157 పాఠశాలల్లో వురుగుదొడ్లు లేవు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 3,285 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలు ఉన్నాయి. సగానికి పైగా పాఠశాలల్లో అంటే 2,157లలో మరుగుదొడ్లలు లేవు. బాలికల వురుగుదొడ్లు లేని పాఠశాలు 785. బాలుర పాఠశాలలు 1,372 ఉన్నాయి. 1,313 పాఠశాలల్లో వురుగుదొడ్లున్నా నిర్వహణ లేమితో అవి ఉన్నా లేనట్టే. నిర్వహణ లోపంతో పని చేయుని మరుగుదొడ్లలో బాలికలవి 864 కాగా, బాలురవి 449. మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయుకపోవటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. రెండేళ్లుగా మరుగుదొడ్ల నిర్వహణ కోసం నిధులు విదల్చటం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభుత్వం లెక్కల ప్రకారం వురుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రాథమిక పాఠశాలకు రూ. 400, ఉన్నత పాఠశాలకు రూ. 500 వుంజూరు చేయూల్సి ఉంది. రెండేళ్ల నుంచి నిధులు వుంజూరు చేయునందున నిర్వహణ లోపం వల్ల వాటిల్లో వ్యర్థాలు భారీగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. విద్యార్థుల బాధను చూడలేని కొందరు ఉపాధ్యాయులు వాటి నిర్వహణ ఖర్చును భరిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణపై నిధులు వుంజూరు చేయూలని ఉన్నతాధికారుల నుంచి, సర్కారు వరకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. కొన్ని పాఠశాల్లో వురుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టినా... నిధుల సమస్యతో అవికాస్తా వుధ్యలోనే నిలిచి పోయూయి. వుచ్చుకు కొన్ని పాఠశాలల్లో పరిస్థితి... కుల్సుంపురాలో ఒకే చోట ఉన్న భవన సముదాయూల్లో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లో 1845 విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 949 వుంది బాలికలు ఉన్నారు. 8 మరుగుదొడ్ల, 24 మూత్రశాలలు వూత్రమే ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వురో నాలుగు వురుగుదొడ్లు నిర్వహణ లోపంతో పని చేయుక పోగా... కొత్తగా నిర్మించేందుకు 9 నెలల కిందట చేపట్టిన 4 వురుగుదొడ్ల పనులు నిలిచిపోయూరు. పని చేస్తున్న మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చు ప్రతి నెల రూ.4 వేలు ఇక్కడి ఉపాధ్యాయులే భరిస్తున్నారు. గుడి వూల్కాపూర్లోని దేవల్ జూమ్సింగ్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో మొత్తంగా 878 వుంది విద్యార్థులుండగా, ఇందులో బాలికలు 451 వుంది ఉన్నారు. ఇక్కడ 4 మరుగుదొడ్ల, 12 మూత్రత్రశాలున్నా నీళ్లు లేని నిరుపయోగంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉపాధ్యాయులే రూ. 2500 పని వునిషికి చెల్లిస్తున్నారు. హస్తినాపురం, పంజగుట్టలోని ఎర్రవుంజిల్, నాంపల్లి, సనత్‌నగర్‌లలోని ప్రభుత్వ పాఠశాలలో డోర్లు సరిగా లేక వురుగుదొడ్లు వాడడంలేదు. వుల్లంపేట, చైతన్యపురిలోని ఇందిరానగర్, ఎల్బీనగ ర్లోని శివవ్మునగర్, వనస్థలిపురంలోని ఎన్జీవోస్కాలనీ, కార్వాన్‌లోని వుస్తెద్పుర ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సౌకర్యం, నిర్వహణ లోపం కారణంగా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గోల్కొండ, లంగర్‌హౌజ్, సుల్లాన్బజారులోని బడీచౌడి, కవూలానగర్, ఫిలింనగర్‌లోని బీటీఆర్‌నగర్, వినాయుకనగర్ బస్తీలలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ లేకపోవడంతో వాటిని ఉపయోగించడం లేదు. కొన్ని పాఠశాలల్లోనైతే వురుగుదొడ్ల గదుల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో అటువైపు విద్యార్థులు వెళ్లేందుకు భయపడుతున్నారు. పాతబస్తీలోని చార్మినార్ పరిధిలోని 52, బండ్లగూడలో 87, బహదూర్‌పురాలో 125ల చొప్పున మొత్తం 264 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో ఎక్కువ శాతం పాఠశాలల్లో మంచినీటి ఉంది. నీటి సౌకర్యం లేకపోవడంతో మూత్రశాలలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఈ సమస్య కారణంగా విద్యార్థులు బడి మానేయాల్సిన పరిస్థితి నెలకొంది. బండ్లగూడ మండల పరిధిలోని కోట్ల అలిజా ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలలకు మూడు నెలలుగా చుక్క నీరు లేదు. దీంతో విద్యార్థినులు బడికి వెళ్లడం మానివేశారు. అంబర్పేట్ నియోజకవర్గంలో మొత్తం 21 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు పాఠశాలలు మాత్రమే ప్రైవేటు అద్దె భవనంలో నడుస్తున్నాయి. బాపునగర్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ్‌నగర్‌లోని ప్రాధమిక పాఠశాలలో అపరిశుభ్రంగా మారాయి. శేరిలింగంపల్లి గోపీనగర్ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్లు ఉన్నా వినియోగించ లేని పరిస్థితి ఉంది. పవర్బోర్లో నీరు లేకపోవడంతో నీటి సరఫరా లేక వాటని వినియోగించకుండా తాళాలు వేశారు. హఫీజ్‌పేట్, ఎంఏనగర్‌లో పాఠశాలలో మరుగుదొడ్లు లేవు, నీటి సౌకర్యం లేవు. వనస్థలిపురం కమలానగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఒకే గదిలో 5 తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 40మంది విద్యార్థులు ఉండగా ఎలాంటి టాయిలెట్ సౌకర్యం లేదు. లాలాపేట చంద్రబాబునాయుడు నగర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో టాయిలెట్ వ్యవస్థ లేకపోవడంతో మూత్రవిసర్జన కోసం విద్యార్థులు సమీపంలోని తమ ఇళ్ల వద్దకే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. లాలాపేట ఏపీ డెయిరీ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో టాయిలెట్లు లేకపోవడంతో పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో మూత్ర విసర్జనకు వెళుతున్నారు. బాలికలు బడికి రావడంలేదు.. టాయిలెట్స్ లేక అమ్మాయిలు బడిమానేస్తున్నారు. గత సంవత్సరం అంబర్‌పేట బాలికల హైస్కూల్లో నలుగురు, ఈ సంవత్సరం ఒక అమ్మాయి స్కూల్‌కు రావడం మానేసింది. అంబర్‌పేట బాలికల పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. వసతులు కల్పించాలి. - యాసాని కరుణాకర్‌రెడ్డి, టీచర్, ప్రభుత్వ పాఠశాల, హస్తినాపురం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పాఠశాలల్లో మూత్రశాలలు లేక పోవడం వల్ల చాలా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బాలికలు మూత్ర విసర్జనను బలవంతంగా ఆపుకొంటారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వయసు మీదపడిన తర్వాత మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు పలు రకాల వ్యాధులకు కారణం అవుతుంది. రోజూ ఇలాంటి కేసులు 10-15 కేసులు వస్తుంటాయి. - డాక్టర్ శ్రీభూషణ్‌రాజు, మూత్రపిండాల వ్యాధి నిపుణుడు, నిమ్స్