చిన్నంబావి (వనపర్తి): మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నామని వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని అమ్మాయిపల్లి, వెల్టూరు గ్రామాల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శుక్రవారం లేఖలు పంపిం చారు. విద్యాహక్కు చట్టం ప్రకారం మౌలిక వసతుల్లో భాగమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని, కానీ నేటికీ ఆచరణలో పెట్టడం లేదని పేర్కొన్నారు. కొన్నిం టిని నామమాత్రంగా నిర్మించినా నీటి సౌకర్యం లేకపోవడంతో పనికిరాకుండా పోయాయని తెలిపారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని వారు లేఖలో న్యాయమూర్తిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment