=జిల్లాపై వాయుగుండం ప్రభావం.. పలు ప్రాంతాల్లో వర్షం
=వరి కోత సమయం కావడంతో అన్నదాతల్లో ఆందోళన
=దోమకాటు విజృంభించే అవకాశం
=మిర్చికి మచ్చ తెగులు.. వ్యవసాయ శాస్త్రవేత్తల హెచ్చరిక
వరంగల్, న్యూస్‌లైన్: రైతులకు మరోసారి కష్టాలు మొదల య్యాయి. ఇప్పటికే పై-లీన్ ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులు... మరోసారి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం, హెలెన్ ప్రభావంతో శనివారం జిల్లాలోని పలు ప్రాం తాల్లో వర్షం కురిసింది. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షం కురవడంతో అన్నదా తలు లబోదిబోమంటున్నారు.
పై-లీన్ ధాటికి ఇదివరకే లక్షల ఎకరాల మేర వరికి దోమకాటు సోకింది. ఇప్పుడు మళ్లీ వర్షం కురువడంతో రోగాలు మరింత ప్రబలే అవకాశముండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మధ్యాహ్నం నుంచి చిరు జల్లులతో మొదలైన వాన సాయంత్రం వరకు ఓ మోస్తారుగా కురిసింది. వరంగల్, నర్సంపేట, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట, జనగామ, పరకాల ప్రాంతాల్లో వర్షం కురిసింది. రఘునాథపల్లిలో ఓ మోస్తారుగా వాన కురువడంతో వరి వంగింది.
రాత్రి వరకు కూడా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. దీంతో మిర్చి, వరి పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది. మిరప తోటలకు ఇప్పుడిప్పుడే కాయలు పడుతుండగా... కురుస్తున్న వర్షంతో కాయలపై మచ్చలు ఏర్పడి దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రైతులు వెంటవెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
మొన్న పై-లీన్.. నేడు హెలెన్రైతుల హడల్
Published Sun, Nov 24 2013 2:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement