మావోయిస్టు కొరియర్ అరెస్ట్
Published Sun, Aug 4 2013 5:07 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
మందుపాతరలు, తుపాకులలో వాడే సామగ్రిని మావోయిస్టులకు చేరవేస్తున్న కొరియర్‌ను భద్రాచలం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయా న్ని భద్రాచలం ఏఎస్‌పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి శనివారం భద్రాచలం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 2న పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో కలిసి స్థానిక అంబేద్కర్ సెంటర్‌లోని ఆటో స్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రెండు మూటలతో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. అతని వద్దనున్న మూటలను పోలీసులు విప్పి చూశారు. అందులో- డ్రిల్ బిట్స్, రేంచీలు, టేపులు, సుత్తులు తదితర సామగ్రి కనిపిం చాయి. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇతని పేరు కారం వెంకటేశ్వర్లు. కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
మావోయిస్టు పార్టీ శబరి దళం కార్యదర్శి నరేష్ గన్‌మెన్ కోటీ, నందాకు అప్పగించేందుకు ఈ సామగ్రి తీసుకెళ్తున్నట్టుగా అత డు చెప్పాడు. మందు పాతర లు, రాకెట్ లాంచర్లు, తుపాకుల తయారీకి ఈ సామగ్రి ఉపయోగిస్తారని ఏఎస్‌పీ చెప్పారు. ఈ సామగ్రి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు.పోలీసుల పకడ్బందీ తనిఖీలతోనే కొరియర్‌ను, ఈ సామగ్రిని పట్టుకోగలిగినట్టు చెప్పారు. ఇతనిని పట్టుకున్న సీఐ శ్రీనివాసరెడ్డిని, పోలీసు సిబ్బందిని ఏఎస్‌పీ అభినందించారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement