తణుకు అర్బన్ : తణుకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మోడల్ హాస్పటల్‌గా రూపుదిద్దుకోనుంది. వైద్యసేవలను ఆన్‌లైన్ ప్రక్రియలో నిక్షిప్తం చేసేందుకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తణుకు ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఈ నెల 15లోగా ఆసుపత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రావాలని వైద్యశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తణుకు ఏరియా ఆసుపత్రితో పాటు క్లస్టర్ పరిధిలోని 6 పీహెచ్‌సీల వైద్యసేవలను ఆన్‌లైన్ చేయనున్నారు. రోగి ప్రభుత్వాసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికివెళ్లినా వారి రోగ వివరాలతో పాటు వాడే మందులను కూడా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు. దీంతో వైద్య సేవలు మరింత సులభమవుతాయని వైద్యులు తెలిపారు. ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసే సర్వర్ ద్వారా ఉన్నతాధికారులు ఆన్‌లైన్ సేవలను పర్యవేక్షించనున్నారు. తణుకు ఆసుపత్రి అనంతరం జిల్లాలోని మిగిలిన ఆసుపత్రుల్లో ఆన్‌లైన్ సేవలను ప్రారంభించనున్నారు.
ఆన్‌లైన్ సేవలిలా..
ఆన్‌లైన్ సేవల్లో భాగంగా చీటీలు అవసరం ఉండదు. రోగి ఆధార్ కార్డు నంబరు, బయోమెట్రిక్ విధానంతో వైద్యసేవలు మొదలవుతాయి. ముందుగా ఓపీ విభాగంలో ఆధార్‌తో రోగి వివరాలు నమోదు చేస్తారు. అక్కడి నుంచి వైద్యుని వద్దకు వెళ్లగానే సంబంధిత వైద్యులు ఆన్‌లైన్‌లో రోగికి అవసరమైన వైద్యపరీక్షలు పొందుపరుస్తారు. రక్తపరీక్షల విభాగంలో సైతం ఆన్‌లైన్‌లో వైద్యులు పొందుపరచిన పరీక్షలను నిర్వహించి అక్కడ కూడా ఆన్‌లైన్‌లోనే పొందుపరుస్తారు. పరీక్షల ఆధారంగా వైద్యులు ఆన్‌లైన్‌లో మందుల వివరాలను రాస్తారు. ఫార్మసీలో ఆ మందులను రోగులకు అందిస్తారు. ఆన్‌లైన్ సేవలు పూర్తిస్థారుులో వినియోగంలోకి వస్తే రోగి ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా అతని వివరాలు అక్కడ లభ్యమవుతారుు. దీంతో అక్కడే వైద్య సేవలు పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆరోగ్య సేవలు
Published Sat, Sep 5 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM
Advertisement
Advertisement