8 మంది సిబ్బంది, 150 మంది పోలీసులు.. ఒకే ఒక్క ఓటరు | Only one vote casted till end of polling for Teacher MLC polling at Donkarai | Sakshi
Sakshi News home page

8 మంది సిబ్బంది, 150 మంది పోలీసులు.. ఒకే ఒక్క ఓటరు

Published Mon, Mar 23 2015 2:54 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

Only one vote casted till end of polling for Teacher MLC polling at Donkarai

డొంకరాయి (వై.రామవరం) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ నిమిత్తం వై.రామవరం మండలం డొంకరాయిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ సిబ్బంది (8 మంది) ఆదివారం ఉదయం 8 గంటలకే విధి నిర్వహణకు సిద్ధమయ్యూరు. పోలింగ్ కేంద్రం బయట తుపాకులతో భారీ పోలీసు బందోబస్తూ ఉంది. అంతేకాక.. మావోయిస్టులు ఎక్కడ పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కల్పిస్తారోనన్న అనుమానంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో యూంటీ నక్సల్ స్క్వాడ్ తదితర బలగాలు గాలింపునూ చేపట్టాయి.
 
  మొత్తం మీద పోలింగ్ కేంద్రం వద్ద, అటవీ ప్రాంతంలో సుమారు 150 మంది పోలీసులు ఉన్నారు. అయితే మధ్యాహ్నం 2.30 గంటల వరకూ డొంకరాయి పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటూ పోలవలేదు. సరిగ్గా ఆ సమయంలో ఒక ఓటరు వచ్చి ఓటేశారు. అంతే.. ఆ కేంద్రంలో పోలింగ్ ముగిసిపోయింది. 8 మంది సిబ్బందీ బ్యాలట్‌బాక్సుకు సీలు వేసి, తాము వచ్చిన ప్రత్యేక బస్సులో తిరుగు ముఖం పట్టారు. వై.రామవరంలోనే ఏర్పాటు చేయొచ్చు..
 
 ‘ఇదేమిటి.. ఒక్కరు ఓటేయగానే పోలింగ్ ముగియడమేమిటి?’ అనుకుంటున్నారా! అవును.. అక్కడ ఓటేసేది ఆయనొక్కరే. అది ముందే తెలిసినా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన యూంత్రిక నిర్వాకం పర్యవసానమే ఇదంతా. డొంకరాయిలో 5 ఉపాధ్యాయ ఓట్లు ఉండగా, వారిలో ఒకరు ఏడాది క్రితం మృతి చెందారు. మరొకరు రిటైరై మైదాన ప్రాంతంలో స్థిరపడ్డారు. మరో ఇద్దరు బదిలీపై వెళ్ళిపోయారు. మిగిలిన ఒక్కరూ అక్కడి జెడ్పీ హైస్కూలులో హెచ్‌ఎంగా పని చేసిన కె.ప్రసాదబాబుది.  ప్రస్తుతం డొంకరాయి స్కూలులో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో ఇద్దరికే ఓటు హక్కుండగా మిగిలిన వారు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారు కావడంతో ఓటు హక్కు లేదు. ఆ హక్కున్న ఇద్దరూ వై.రామవరం నుంచి బదిలీ కాగా.. వారి ఓట్లు ఇంకా అక్కడి పోలింగ్ కేంద్రంలోనే ఉన్నాయి.
 
 వై.రామవరం నుంచి డొంకరాయి సుమారు 175 కిలోమీటర్లు. అదీ కొండల్ని చుట్టుకుని అరుుదుమండలాల మీదుగా ప్రయూణించాలి. ప్రసాదబాబు వై.రామవరం నుంచి ఉదయం మోటారు బైక్‌పై బయలుదేరి అష్ట కష్టాలు పడి, డొంకరాయి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకే ఒక్క ఓటు కోసం ఒక బస్సు ఏర్పాటు చేయడం, ఎన్నికల సిబ్బందిని తరలించడం, పోలీసుల్ని మోహరించడం అధికారుల యూంత్రికమైన పనితీరుకు సాక్ష్యం. ఆ పోలింగ్ కేంద్రంలో ఓటేయూల్సిన ప్రసాదబాబు వై.రామవరంలో ఉంటారు. ఆ పోలింగ్‌ను కూడా వై.రామవరం కేంద్రంలోనే నిర్వహిస్తే అటు ప్రభుత్వానికి వేలాది రూపాయల ఖర్చు, పోలింగ్ సిబ్బందికి, పోలీసులకు, ‘ఒక్కగానొక్క ఓటరు’ ప్రసాదబాబుకూ ప్రయూసా తప్పి ఉండేవి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement