* నిబంధనలకు విరుద్ధంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం
* ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు
బొబ్బిలి రూరల్ : ఉద్యోగాలు లేక అనేకమంది ప్రతిభావంతులైన నిరుద్యోగులు వీధిన పడి తిరుగుతుంటే నిబంధనలు అతిక్రమించి రాజకీయ నాయకులకే అధికారులు ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. ఓడీఎఫ్ గ్రామాల వివరాలు నమోదు చేసేందుకు టీడీపీకి చెందిన వార్డు సభ్యుడికే ఔట్‌సోర్సింగ్‌లో నియమించారు మన అధికారులు. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి నాయకుల మధ్య విబేధాలతో ఈ విషయం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ఎనిమిది నెలల కిందట ఓడీఎఫ్ గ్రామాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు పారాది పంచాయతీ 11వ వార్డు సభ్యుడు చందక శ్రీనివాసరావుకు (టీడీపీ) అవకాశం కల్పించారు. నిబంధనల మేరకు పంచాయతీ మెంబర్లను ఔట్‌సోర్సింగ్‌లో ఏ ఉద్యోగంలో కూడా నియమించరాదు. కాని ఎనిమిది నెలలుగా ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. అరుుతే ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆల్తి వెంకటరమణ ఈ విషయూన్ని గమనించి ఎంపీడీఓ చంద్రమ్మను సోమవారం ప్రశ్నించారు. పంచాయతీ సభ్యుడ్ని ఔట్‌సోర్సింగ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఎలా నియమించారని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ ఔను కొనసాగిస్తున్నాం... ఎనిమిది నెలలుగా ఆయనకు జీతం కూడా ఇవ్వలేదు.. ఏమంటావ్ అని తిరిగి వెంకటరమణపై విరుచుకు పడ్డారు.
తడబడిన అధికారులు
చందక శ్రీనివాసరావు ఔట్ సోర్సింగ్‌లో ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నాడని ఎంపీడీఓ చెప్పగా, ఫిబ్రవరితో అతని పని పూర్తయిందని ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సమాధానమిచ్చారు.
అందరి ఆమోదంతోనే..
చందక శ్రీనివాసరావును ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్‌గా అందరి ఆమోదంతోనే నియమించాం. ఎనిమిది నెలలుగా జీతం కూడా ఇవ్వలేదు.
- పి.చంద్రమ్మ, ఎంపీడీఓ, బొబ్బిలి
నాకు తెలియదు
ఓడీఎఫ్ గ్రామాల వివరాల నమోదుకు సంబంధించి ఫిబ్రవరితో అతని పని పూర్తయింది. ఇంకా కొనసాగుతున్న విషయం నాకు తెలియదు.
- రామకృష్ణ,ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ, బొబ్బిలి
ఇదేమి చిత్రం...
Published Tue, May 24 2016 1:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement