పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు నెక్కొండలో హాల్ట్
విజయవాడ, న్యూస్‌లైన్: ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే పద్మావతి ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12764/12763)కు వరంగల్ జిల్లా నెక్కొండలో హాల్ట్ కల్పిస్తున్నట్లు విజయవాడ సీనియర్ పీఆర్‌వో మైకేల్ శుక్రవారం తెలిపారు. ఈ రైలు నెక్కొండకు రాత్రి 8.55కి చేరి 8.56కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 1.56కి వచ్చి 1.57కి బయలుదేరుతుంది. ఈ మార్పు శనివారం నుంచి ఆరు నెలలపాటు అమల్లో ఉంటుందన్నారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్‌లో హాల్ట్
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12728/12727)ను వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఒక నిమిషం పాటు నిలుపుతారు. ఈ ట్రైన్ మహబూబాబాద్‌కు రాత్రి 8.32కి చేరి 8.33కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 1.54కి వచ్చి 1.55కి బయలుదేరుతుంది. ఈ మార్పు శని వారం నుంచి ఆరు నెలలపాటు అమలులో ఉంటుంది.