padmavathi express
-
బ్రేకింగ్: పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్..
-
రైలు ఆపి.. వందలాది ప్రాణాలు కాపాడి!
రేణిగుంట: సోమవారం.. తెల్లవారుతున్న వేళ... పొలంలో నాట్లు వేసే పని నిమిత్తం ఓ రైతు మండలంలోని వెదుళ్లచెరువు సమీపంలో రైలు పట్టాలు దాటుతూ గుర్తించిన ఓ దృశ్యం, తర్వాత ఆయన చేసిన సాహసం... వందలాది మంది ప్రాణాలను నిలబెట్టింది. ప్రమాద ఘంటికలను మోగిస్తూ విరిగిపోయి ఉన్న రైలు పట్టాలను గమనించిన అన్నదాత ప్రమాదమని తెలిసినా ఎర్రటి టీషర్టు ఊపుతూ రైలుబండికి ఎదురెళ్లి ఆపేశాడు. చిత్తూరు జిల్లా రేణిగుంట–శ్రీకాళహస్తి రైల్వేమార్గంలో మండలంలోని వెదుళ్లచెరువు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో పెను ప్రమాదమే తప్పింది. వెదుళ్లచెరువుకు చెందిన రైతు మల్లికార్జున్ తన పొలంలో నాట్లు కోసం కూలీలను పిలిచేందుకు సోమవారం తెల్లవారుజామున ఎస్టీ కాలనీ వైపు వెళుతుండగా రైలు పట్టాలను దాటే సమయంలో ఎడమ వైపు ఉన్న ఓ రైలు పట్టా రెండుగా విరిగిపోయి ఉండటాన్ని గుర్తించాడు. సమీపంలో వెళుతున్న ఎస్టీ కాలనీకి చెందిన మచ్చ అంకయ్యను అరిచాడు. ఇంతలోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వస్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు దూరంగా కూతపెడుతూ వస్తుండటాన్ని గమనించారు. రైలును ఎలాగైనా ఆపి ప్రమాదాన్ని తప్పించాలని వారిద్దరూ భావించారు. అంకయ్య వేసుకున్న ఎర్రటి టీషర్టును విప్పి చేతితో ఊపుతూ రైలుకు ఎదురుగా పరుగులు పెట్టారు. గమనించిన రైలు డ్రైవర్ విరిగిన పట్టాలకు కొద్ది దూరంలో రైలును ఆపేశాడు. రైల్వే గ్యాంగ్‌మెన్ తేజకు విషయాన్ని తెలియజేయడంతో ఆయన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అరగంటపాటు శ్రమించి తాత్కాలిక మరమ్మతులను చేసి ఆగి ఉన్న రైలును సురక్షితంగా పంపారు. తర్వాత విరిగిన పట్టాలను శాశ్వత మరమ్మతులు చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని వాకబు చేసి తప్పిన ప్రమాదంతో ఊపిరి పీల్చుకున్నారు. మల్లికార్జున్‌ను రైల్వే అధికారులు, ప్రయాణికులతోపాటు గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు. -
రైలులో సెల్ ఫోన్ కలకలం
ప్రకాశం: పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో సెల్ ఫోన్ కలకలం రేగింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఈ రైలులోని ఎస్ 3 బోగి టాయిలెట్లో సెల్ ఫోన్ ఉందంటూ ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఒంగోలు స్టేషన్లో రైలును ఆపేసి తనిఖీలు నిర్వహించారు. అనంతరం అందులో ఏమి లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
చీరాలలో నిలిచిపోయిన పద్మావతి
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి నిలిచిపోయింది. రాత్రి 10 గంటల ప్రాంతం నుంచి దాదాపు గంట సేపటికి పైగా రైలు నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. రైలు ఎందుకు ఆగిపోయిందన్న సమాచారం ఏదీ ప్రయాణికులకు తెలియకపోవడంతో, రాత్రిపూట.. చీకట్లో ఎలా ఉండాలంటూ వాళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వాళ్ల ఆందోళనను రైల్వే శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. రైలును తిరిగి ఎన్ని గంటలకు నడిపించేదీ కూడా చెప్పకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. -
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
మారణాయుధాలతో బెదిరింపు ఐదు తులాల బంగారం అపహరణ గుంతకల్లు, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపాన గురువారం అర్ధరాత్రి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ స్పెషల్) రైలులో దోపిడీదొంగలు బీభత్సం సృష్టిం చారు. ప్రయాణికులపైకి రాళ్లు రువ్వి.. మారణాయుధాలతో భయభ్రాంతులకు గురిచేసి ఐదుతులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైలు నం- 12731) గురువారం రాత్రి 9గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరింది. గుత్తి రైల్వేస్టేషన్‌కు రాగానే దొంగల ముఠా సభ్యులు కొందరు రైలులో ఎక్కారు. మరికొందరు పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపాన కాపు కాశారు. ఎస్6, ఎస్7, ఎస్8, ఎస్9, ఎస్10 బోగీల్లో ప్రయాణిస్తున్న దుండుగులు కొందరు అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి రైలు పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ చేరుకోగానే పథకం ప్రకారం చైనులాగి రైలును ఆపారు. బయట ఉన్న దుండగులు లోపలికి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. తలుపులన్నీ వేసి ఉండటంతో లోనికి రావడానికి వీలుకాక రాళ్లు రువ్వి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. రైలులో ప్రయాణిస్తున్న దుండగులు వెంట తెచ్చుకున్న కత్తులు, పిడిబాకులు చూపి ప్రయాణికులను బెదిరించారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన భవాని మెడలోని 5 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని రైలుదిగి పారిపోయారు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ రైలు బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ కావడం వల్ల అందులో ఎస్కార్టు పోలీసులు లేరని తెలిసింది. విషయం తెలుసుకున్న గుంతకల్లు జీఆర్పీ సిబ్బంది పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఏప్రిల్ 4వతేదీ రాత్రి కూడా అనంతపురం-పెనుగొండ మధ్య దుండుగులు ఇదేతరహాలో హంపి ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీకి విఫలయత్నం చేశారు. రైళ్లలో దోపిడీలపై చంద్రబాబు ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రైళ్లలో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలపై టీడీపీ అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే సీఎం నారా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ఘటనలను అరికట్టడంలో అధికారు లు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందోబస్తు వైఫల్యం వల్లే ఇలా జరుగుతోందన్నారు. వారం రోజుల్లో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మూడుసార్లు దోపిడీ జరగడం రైల్వే పోలీస్ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైల్వేశాఖ ప్రయాణికుల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. -
పద్మావతి, చెన్నై ఎక్స్ప్రెస్ల్లో దొంగల బీభత్సం
-
పద్మావతి, చెన్నై ఎక్స్ప్రెస్ల్లో దొంగల బీభత్సం
అనంతపురం : తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి రాగానే దుండగులు చైను లాగి దోపిడీ చేశారు. ఎస్-6,7,8,9 బోగీల్లో ప్రయాణికుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఇక చెన్నై-సికింద్రాబాద్ మధ్య నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ దొంగలు మరోసారి దోపిడీ తెగబడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో ఓ మహిళ నుంచి దుండగులు బంగారం అపహరించి పరారయ్యారు. వారం వ్యవధిలో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు మూడుసార్లు దోపీడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల భద్రతలో వైఫల్యం చెందుతున్న రైల్వే సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు నెక్కొండలో హాల్ట్
విజయవాడ, న్యూస్‌లైన్: ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే పద్మావతి ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12764/12763)కు వరంగల్ జిల్లా నెక్కొండలో హాల్ట్ కల్పిస్తున్నట్లు విజయవాడ సీనియర్ పీఆర్వో మైకేల్ శుక్రవారం తెలిపారు. ఈ రైలు నెక్కొండకు రాత్రి 8.55కి చేరి 8.56కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 1.56కి వచ్చి 1.57కి బయలుదేరుతుంది. ఈ మార్పు శనివారం నుంచి ఆరు నెలలపాటు అమల్లో ఉంటుందన్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్‌లో హాల్ట్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12728/12727)ను వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఒక నిమిషం పాటు నిలుపుతారు. ఈ ట్రైన్ మహబూబాబాద్‌కు రాత్రి 8.32కి చేరి 8.33కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 1.54కి వచ్చి 1.55కి బయలుదేరుతుంది. ఈ మార్పు శని వారం నుంచి ఆరు నెలలపాటు అమలులో ఉంటుంది.