చీరాలలో నిలిచిపోయిన పద్మావతి | padmavathi express stalls in chirala railway station | Sakshi
Sakshi News home page

చీరాలలో నిలిచిపోయిన పద్మావతి

Published Fri, Aug 1 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

padmavathi express stalls in chirala railway station

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి నిలిచిపోయింది. రాత్రి 10 గంటల ప్రాంతం నుంచి దాదాపు గంట సేపటికి పైగా రైలు నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

రైలు ఎందుకు ఆగిపోయిందన్న సమాచారం ఏదీ ప్రయాణికులకు తెలియకపోవడంతో, రాత్రిపూట.. చీకట్లో ఎలా ఉండాలంటూ వాళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వాళ్ల ఆందోళనను రైల్వే శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. రైలును తిరిగి ఎన్ని గంటలకు నడిపించేదీ కూడా చెప్పకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement