తల్లిదండ్రులూ..తస్మాత్‌ జాగ్రత్త..! | Parents Becarefull On Half day Schools On Your Children | Sakshi
Sakshi News home page

ఒంటిపూట..కనిపెట్టాలి ఓ కంట

Published Tue, Mar 27 2018 9:54 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Parents Becarefull On Half day Schools On Your Children - Sakshi

బద్వేలు సమీపంలో ఈత కొడుతున్న చిన్నారులు

ఒంటిపూట బడులతో అర్ధరోజు సెలవు.. చిన్నారులు ఎక్కువ సమయం ఆడుకోవచ్చు... స్నేహితులతో సరదాగా గడపొచ్చు... కానీ సరదాల మాటున ప్రమాదాలు పొంచి ఉన్నాయి... బడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే బ్యాగును పక్కనపెట్టి ఆటల బాట పడుతుంటారు... తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా స్నేహితులతో బయటకు వెళ్లి హాయిగా గడపాలనుకుంటారు. తల్లిదండ్రులు వీరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి... ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా కష్టమే... అప్రమత్తతతో ప్రమాదాల నుంచి చిన్నారులను కాపాడుకుందాం..

కడప ఎడ్యుకేషన్‌/బద్వేలు: ఒంటిపూట బడి అనగానే పిల్లలకు ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే ఒక పూట బడికిపోతే మరోపూట ఆటలాడుకోవచ్చన్న సంతోషం. కానీ ఆ సరదా విషాదం కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. పిల్లలు బడి నుంచి రాగానే వారిపై ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఏటా ముక్కుపచ్చలారని చిన్నారులు కాలువులు, చెరువులు, వంకలు, బావుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి మృత్యువాత పడుతూ కన్నవారికి కడపుకోతను మిగుల్చుతున్నారు. జిల్లాలో చెరువులు, బావులు ఎక్కువగానే ఉన్నాయి.

వీటిని చూడగానే పిల్లలు ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. తాము దిగిన చెరువు లోతెంతో తెలియక, ఈత రాక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం ఒంటిపూట బడి నేపథ్యంలో పిల్లల పరిరక్షణపై తల్లిదండ్రులు దృష్టిని సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈనెల 12 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు బడి నుంచి ఇంటికి రాగానే పుస్తకాల బ్యాగును మూల పడేసి ఎంచక్కా ఆటలబాట పడుతుంటారు. ఈత, బైక్‌ రైడింగ్, క్రికెట్‌ వంటివి మండే ఎండలో చిన్నారులను ముప్పుతిప్పలు పెట్టేవే.

టీవీలతో ముప్పు
ఇంట్లో తరుచూ టీవీలు, కంప్యూటర్, సెల్, లాప్‌టాప్‌ వీడియో గేమ్స్‌లకు అతుక్కుపోవడం ద్వారా దృష్టిలోపం తలెత్తే అవకాశం ఉందని నేత్య వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ వాటికి దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.

ఇంటిపట్టునే ఉండేలా..
పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తే అది వారి భవిష్య త్తు అనారోగ్యంపై ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటిపూట బడి సమయంలో పాఠశాల అయిపోగానే చిన్నారులను ఇంటికి తీసుకుని వచ్చి కాస్తంత భోజనం చేయించి కొద్దిపేపు పడుకునేలా చర్యలు తీసుకోవాలి. ఆ తర్వా త ఇంటి పరిసరాలు, చెట్లు నీడలో అడుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు  తీసుకోవాలి.

ఎండలతో అనర్థాలు
ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు మండుతున్నాయి. పిల్లలను వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో ఉంటే శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలకు వాంతులు, విరేచనాలయ్యే ప్రమాదం ఉంది. ఎండలకు పిల్లలు అధిక నీరు తాగేలా కూడా చూసుకోవాలి. అప్పుడప్పుడు మంచినీటిలో చిటికెడు ఉప్పు, చక్కెర వేసి నీరు ఇవ్వడం కూడా మంచిదే.

ఇవి పాటించాలి
బడి ముగిశాక చిన్నారులు స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. పిల్లలను ఇంటి ఆవరణలో, పరిసర ప్రాంతాలలో ఆడుకునులా, చదువుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలి. పాఠశాల అనంతరం ఇంటి పట్టునే ఉండేలా చూడాలి.
ఈత నేర్పాలనుకుంటే తల్లిదండ్రులే తీసుకెళ్లి నేర్పించడం ఉత్తమం. జిల్లాలో స్విమ్మింగ్‌ పూల్స్‌ చాలానే ఉన్నాయి. ఇప్పటికే రెండు, మూడు చోట్ల చిన్నారులు చెరువుల్లో ఈతకు వెళ్లి మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

జాగ్రత్తలు తీసుకుంటే మేలు
బడి వదలగానే పిల్లలను అవసరమైతే తప్ప బయటకు పంపడం మంచిది కాదు. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకునేలా చూడాలి.
తల్లిదండ్రులు పిల్లల కోసం సమయం కేటాయించాలి. వారితో సరదాగా గడపడంతోపాటు విజ్ఞాన, వినోద సంబంధమైన పుస్తకాలు చదివేలా చూడాలి. ∙పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లినా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వెళ్లేలా అవగాహన కల్పించి, జాగ్రత్తలు పాటించేలా చూడాలి. ∙పిల్లలు ఇంట్లో మారాం చేస్తే వారికి సర్దిజెప్పాలే తప్ప కోపతాపాలకు పోకూడదు. వారిని కొట్టడం, తిట్టడం, బెదిరించడం చేయకూడదు. వారిని సన్మార్గంలో నడిపించేలా నేర్పించాలి. ∙తల్లిదండ్రులకు ఇంటిç ³నిలో సాయమందించే అలవాటును నేర్పించాలి. ∙ఇంటిలోనే ఉంటూ క్యారంబోర్డు, చెస్‌లాంటి ఆటలను పిల్లలకు అలవాటు చేయాలి.

వాహనాలతో భద్రం
ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజు ఎక్కువ. ఇంట్లో చెప్పకుండా వాటిని నడుపుతూ, తొక్కుతూ రోడ్డెక్కి ప్రమాదాల బారిన పడే అవకాశముంది. చిన్నారులకు బైక్‌లు, సైకిళ్లను దూరంగా ఉంచాలి. బైక్‌ల తాళాలు వారికి అందుబాటులో ఉంచకూడదు. అవసరమైతే పెద్దల పర్యవేక్షణలో వాహనాలను నడిపించడం నేర్పించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement