'పరిటాలది రాజకీయ హత్యకాదు..సెటిల్ మెంట్ హత్య'
శ్రీకాకుళం: అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి అని ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ వైఫ్యల్యాలకు సమాధానం చెప్పలేకే అసెంబ్లీలో తప్పుదోవ పట్టిస్తోందని తమ్మినేని విమర్శించారు.
పరిటాల రవిది రాజకీయ హత్య కాదు.. సెటిల్‌మెంట్ హత్య అని తమ్మినేని వ్యాఖ్యలు చేశారు. పరిటాలరవి హత్యకు కారకులైన జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. నేరచరితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు.