Paritala ravi
-
పొలిటికల్ కారిడార్: రౌడీ షీటర్ విడుదల కోసం రోడ్డెక్కిన పరిటాల సునీత
-
25 ఏళ్లుగా పరిటాల కుటుంబం అనంతపురం జిల్లాకు చేసిందేమి లేదు : తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి
సాక్షి, అనంతపురం : మొద్దు శ్రీను హత్యకేసులో నిందితుడైన ఓం ప్రకాశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గతకొంత కాలంగా బాధపడుతున్న ఆయన.. సోమవారం విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును 2008 నవంబర్ 9న జైలులోనే డంబుల్తో కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవిత ఖైదు విధించింది. 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైలులో ఓం ప్రకాశ్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ.. సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఓం ప్రకాష్ మరణవార్త తెలిసిన అతని కుటుంబ సభ్యులు విశాఖ చేరుకున్నారు. అతని తనయుడు సాయి కుమార్ తన తండ్రి ఇంకో కొంత కాలం జీవిస్తారని అనుకున్నానని ఊహించని రీతిలో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వస్తే సొంత ఊరు తీసుకుని వెళ్తామని అతని తనయుడు సాయి కుమార్ తెలిపారు. ఓం ప్రకాశ్ తల్లి సరోజనమ్మ కూడా అనారోగ్యంతో గత ఏప్రిల్ మృతిలో మృతిచెందారు. -
నిజమైన హీరో పరిటాల రవి: శ్రీరెడ్డి
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పలువురు సినీ సెలబ్రిటీల గుట్టు విప్పిన శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్ మీద కూడా పడ్డారు. అయితే తాజాగా శ్రీరెడ్డి పరిటాల రవి పేరు చెప్పుకుంటూ.. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరో రా పరిటాల రవి. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగులు చెబితే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై జనసేన అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పరిటాల రవికి భయపడి జేసీ ఊరు వదిలివెళ్లలేదా?
తాడిపత్రి : మూడు దశాబ్దాలుగా తాడిపత్రిలో రౌడీ రాజ్యం నెలకొందని, ఈ ప్రాంతాన్ని జేసీ సోదరులు సర్వనాశనం చేశారంటూ వైఎస్సార్ సీపీ నేత పైలా నరసింహయ్య విమర్శించారు. స్థానిక భగత్‌సింగ్ నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ.. జేసీ సోదరుల నీచ సంస్కృతి జిల్లావాసులకు తెలిసిందేనన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు వారు పెట్టింది పేరన్నారు. అందితే జట్టు... అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్తత్వం ఉన్న జేసీ సోదరులు.. గ్రామాల్లో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోస్తూ వచ్చారన్నారు. వారి స్వార్థానికి ఎందరో బలిపశువులయ్యారన్నారు. నేటికీ తాను పెద్ద రౌడీగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి.. పరిటాల రవి బతికున్నప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయకుండా ఊరు వదిలి వెళ్లిన విషయం నేటికీ తాడిపత్రి వాసులు మరిచిపోలేదన్నారు. వీరిని నమ్మి మోసపోగూడదంటూ ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్ జిలాన్‌బాషా, కౌన్సిలర్ డీవీ కుమార్‌కి హితవు పలికారు. జేసీ సోదరులను నమ్ముకున్న వారిలో పొట్టి రవి తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. వైఎస్సార్ సీపీ తాడిపత్రి సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జేసీ సోదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతూ వస్తోందన్నారు. దీనిని జీర్ణించుకోలేక వారు మతి చలించి మాట్లాడుతున్నారన్నారు. సమావేశంలో విజయమ్మ సేవా సమితి అధ్యక్షుడు సంపత్ కుమార్, బాలరాజు, నాయకులు బాణా నాగేశ్వరరెడ్డి, కంచెం రామోహ్మన్ రెడ్డి, పేరం అమర్నాథరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. -
చమన్‌ది సహజ మరణమేనా.?
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్‌ది సహజ మరణమేనా.? ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే ఆయన ఎందుకు హఠాన్మరణం చెందారు? గుండెపోటుతోనే మృతి చెందారా..? లేదా ఆరోజు ఏమైనా జరిగిందా? ఇటీవల చమన్ అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి. చమన్ మృతి చెందిన నాలుగురోజుల్లోనే ఆయన కారు డ్రైవర్ నూర్ మహ్మమద్(27) గురువారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనతో చమన్ మృతిపై అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అనంతపురం టాస్క్ఫోర్సు: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పరిటాల రవి ముఖ్య అనుచరుడు దూదేకుల చమన్ ఈనెల 7న హఠాన్మరణం చెందారు. పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల కుమార్తె స్నేహలత వివాహాన్ని అంతకు ముందురోజు వెంకటాపురంలో ఘనంగా జరిపించారు. మరుసటిరోజు వెంకటాపురానికి వెళ్లిన చమన్ హఠాన్మరణం చెందారు. మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే చమన్ అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నా... అధికారికంగా వెల్లడించలేదు. చమన్ మృతి చెందిన మరుసటి రోజు నుంచి టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా రాజీనామా..! ముందుగా నిర్ణయించిన రెండున్నర సంవత్సరాల పదవీకాలం ముగిసినప్పటికీ చమన్ జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకపోవడం...ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సెప్టెంబర్ 8న ఆయనతో చైర్మన్ పదవికి బలవంతంగా రాజీనామా చేయించారు. తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారని పుకార్లు వినిపించినా ఆ మేరకు చర్యలు లేవు. టీడీపీకి కోసం, పరిటాల రవీంద్ర కోసం తన జీవితాన్నే త్యాగం చేసినా.. పార్టీ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో చమన్ తీవ్ర అసంతృప్తిలో ఉండిపోయారు. పార్టీ మారే యోచనలో ఉన్నట్లు చర్చ పార్టీ తనను గుర్తించలేదని ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆపార్టీ వర్గాల్లోనే జోరుగా సాగింది. ప్రముఖ పార్టీ తరుఫున హిందూపురం ఎంపీ టికెట్‌ను ఆశించినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఈనెల 7న మంత్రి సునీత సమక్షంలో చర్చ జరిగినట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఒత్తిడి తెచ్చారని, చిన్నపాటి వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనైన ఆయన అస్వస్థతకు గురైనట్లు అనుమనాలు గుప్పుమంటున్నాయి. అయితే గతంలో ఒకసారి చమన్ గుండెపోటుకు గురయ్యారని, వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందువల్ల ఆయన గుండెపోటుతోనే హఠాన్మరణం చెందారని పేర్కొంటున్నారు. చమన్ డ్రైవర్ అనుమానాస్పద మృతి చమన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన కారుడ్రైవర్‌గా పనిచేసిన నూర్‌మహ్మద్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నగరంలో బోయవీధికి చెందిన నూర్‌మహ్మద్ గత కొద్దికాలంగా చమన్‌కు కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన హఠాన్మరణం చెందిన రోజు కూడా నూర్ మహ్మదే కారు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిసింది. అతన్ని బుధవారం నుంచి పనిలోకి రావద్దన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం రాత్రి బత్తలపల్లివైపు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. అయితే మన్నీల సమీపంలోకి రాగానే మహబూబ్ బాషా(45) అనే వ్యక్తి ఐచర్ వాహనం పంక్చర్ కాగా, ఆ డ్రైవర్‌ను మాట్లాడించేందుకు వెళ్తుండగానే... అనంతపురం నుంచి బత్తలపల్లి వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనం వీరిని ఢీ కొంది. ఈ ఘటనలో గుత్తి ఆర్ఎస్ ప్రాంతానికి చెందిన ఐచర్ డ్రైవర్ మహబూబ్ బాషా (47)తో పాటు జెడ్పీ మాజీ చైర్మన్ చమన్ డ్రైవర్ నూర్ మహమ్మద్ (27) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం నగరంలోని బోయవీధికి చెందిన నూర్ మహమ్మద్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఐచర్ వాహనం క్లీనర్ మహేష్ నాయుడు ఫిర్యాదు మేరకు పోసీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నీ అనుమానాలే..! అయితే ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూర్‌మహ్మద్ హత్యకు కుట్ర జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతోనే చనిపోయాడని పేర్కొంటున్నారు. చమన్ మృతిపైనే అభిమానాలకు నెలకొన్న అనుమానాలు నివృత్తి కాకమునుపే ఆయన కారు డ్రైవర్ చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత టీడీపీ ముఖ్యనేతలపై ఉంది. -
చమన్ హఠాన్మరణం
అనంతపురం సెంట్రల్: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దూదేకుల చమన్(56) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. రామగిరి మండలం వెంకటాపురంలో మంత్రి పరిటాల సునీత నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కారులో అనంతపురానికి తీసుకువస్తుండగా ఎన్‌ఎస్‌గేటు – కుంటిమద్ది గ్రామాల మధ్య గుండెపోటురాగా మార్గమధ్యలోనే మృతి చెందారు. అయినప్పటికీ కుటుంబీకులు సవేరా ఆస్పత్రికి తీసురాగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చమన్ భౌతికకాయం వద్ద ఆయన భార్య రమీజాబీ విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. చమన్‌కు ఓ కుమారుడు ఉమర్ ముక్తర్ సంతానం.. కర్ణాటకతో 9వ తరగతి చదువుతున్నాడు. కాగా చమన్ మృతి రాజకీయవర్గాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు, టీడీపీ కార్యకర్తలు సవేరా ఆస్పత్రికి తరలివచ్చారు. ‘‘నేను వెళ్లొస్తా వదినా’’ మంత్రి పరిటాల రవి అనుచరుడైన చమన్...ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరిగిన మంత్రి పరిటాల సునీత కుమార్తె స్నేహలత వివాహ వేడుకల ఏర్పాట్లు చూసేందుకు దాదాపు 10 రోజులుగా వెంకటాపురంలోనే ఉన్నారు. ఆదివారం పెళ్లి ముగియగానే అక్కడి నుంచి వచ్చేసిన ఆయన...సోమవారం తిరిగి వెంకటాపురానికి వెళ్లారు. పెళ్లి వేడుకల గురించి పరిటాల సునీత బంధువులతో ముచ్చటించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అనంతపురానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. ‘‘నేను వెళ్లొస్తా వదినా’’ అంటూ మంత్రి సునీతతో చెప్పి ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు. కుప్పకూలిన మంత్రి సునీత తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చమన్ విగతజీవిగా కనిపించడంతో రాష్ట్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోయారు. వెంకటాపురం నుంచి చమన్‌ను తరలిస్తున్న వాహనం వెనుకే మంత్రి సునీత కూడా బయలుదేరి వచ్చారు. సవేరా ఆసుపత్రికి చేరుకున్న ఆమెకు చమన్ ఇక లేరని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా బోరున విలపించారు. ఏడుస్తూనే కుప్పకూలిపోయారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. నేడు అంత్యక్రియలు చమన్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం రామగిరి మండలం ఆర్.కొత్తపల్లికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఉదయం వరకూ భౌతిక కాయాన్ని ఆయన నివాసం వద్ద ఉంచుతామనీ, ఆ తర్వాత మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహి పార్టీ వర్గాలు వెల్లడించాయి. చమన్ మృతికి ‘అనంత’ సంతాపం అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ మృతి పట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకట్రామిరెడ్డి సంతాపం తెలిపారు. జెడ్పీ చైర్మెన్‌గా ఉన్న సమయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, రాజకీయాలకతీతంగా ఆయన పని చేశారని గుర్తు చేశారు. ఆయన హఠాన్మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. బహిష్కృత నేత నుంచి... జెడ్పీ చైర్మన్‌గా... చమన్ ఒకప్పుడు జిల్లా బహిష్కరణకు గురయ్యారు.. కానీ తిరిగొచ్చి జిల్లా ప్రథమ పౌరునిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన... పరిటాల రవి ఉన్నన్నాళ్లు కుడిభుజంగా పనిచేశాడు. 2004 ముందు జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు వందల సంఖ్యలో జరిగాయి. ప్రత్యర్థులు ఒకర్నొకరు నెత్తుటేరులు పారించుకున్నారు. ఫ్యాక్షన్ హత్యల వెనుక పరిటాల రవి అనుచరుడైన చమన్ హస్తం ఉండేదన్న ఆరోపణలున్నాయి. 1992లో ఆర్వోసీ(రీ ఆర్గనైజేషన్ కమిటీ) ఏర్పాటులో పోతుల సురేష్‌తో కలిసి చమన్ ప్రధాన భూమిక పోషించారనీ, వీరిద్దరూ పరిటాల రవికి ముఖ్య అనుచరులుగా ఉంటూ ప్రత్యర్థివర్గాన్ని మట్టుపెట్టినట్లు ఆరోపణలున్నాయి. 1998లో హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో జరిగిన జంటహత్యల కేసులోనూ చమన్ పేరు స్పష్టంగా వినిపించింది. అప్పటి నుంచి చమన్ పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో 2004లో కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి రాగానే చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత 2012లో బయటకు వచ్చారు. గుజరాత్ రాష్ట్రంలోని చిన్న కుగ్రామంలో గడిపినట్లు పలు సందర్బాల్లో ఆయన సన్నిహితులతో చెప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చిన చమన్.. రామగిరి జెడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందడంతో పాటు 2014 జూలై 5న 19వ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ప్రమాణ చేశారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం పూల నాగరాజుకు అవకాశం ఇచ్చేందుకు 2017 సెప్టెంబర్ 8వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. చైర్మెన్‌గా పనిచేసినన్నాళ్లు మృధుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఇసుమంతైనా కూడా ఆరోపణలు రాకుండా చూసుకున్నారు. అయితే పార్టీ పెద్దలు తనతో బలవంతంగా రాజీనామా చేయించారని కొద్దిరోజుల పాటు ముభావంగా ఉన్న ఆయన, ఇటీవల చురుగ్గానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్గా పార్టీ బాధ్యతలు అప్పగించడంతో కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాలతో పాటు దూదేకుల సం ఘం అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు. -
పరిటాల ముఖ్య అనుచరుడు చమన్ హఠాన్మరణం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ హఠాన్మరణం చెందారు. చమన్‌కు సోమవారం ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్న సవేరా అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పరిటాల రవి కుమార్తె వివాహ వేడుకల పర్యవేక్షణ కోసం గత మూడు రోజులుగా చమన్ వెంకటాపురంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఆయన అస్వస్తతకు గురైనట్టు సన్నిహితులు తెలిపారు. చమన్ మరణవార్త విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆయనకు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన చమన్.. రవి హత్య తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చమన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 2014 నుంచి 2017 వరకు ఆయన అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. సొమ్మసిల్లిన మంత్రి సునీత చమన్ అస్వస్తతకు గురైన వార్త తెలుసుకున్న మంత్రి సునీత హుటాహుటిన సవేరా ఆసుపత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చమన్ చనిపోయారన్న వార్త విన్న ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. డాక్టర్లు వెంటనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించారు. -
పరిటాల ఇంటికి పవన్ ; ఆసక్తికర వ్యాఖ్యలు
-
పరిటాల ఇంటికి పవన్; ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం : గుండు వివాదంపై స్పష్టత ఇచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి పరిటాల కుటుంబాన్ని కలుసుకున్నారు. చలోరే చలోరే చల్ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించి, అనంత సమస్యలపై చర్చోపచర్చలు చేశారు. పవన్ రాక సందర్భంగా పరిటాల నివాసం వద్ద కోలాహలం నెలకొంది. మంత్రి తనయుడు శ్రీరామ్ దగ్గరుండి పవన్‌ను లోనికి తీసుకెళ్లారు. ఆసక్తికర వ్యాఖ్యలు : అల్పాహార విందు అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. దివంగత పరిటాల రవితో తనకు ఎలాంటి విబేధాలు ఉండేవికావని మరోసారి చెప్పుకొచ్చారు. టీడీపీతో జనసేన పొత్తు, సీమకు పొంచిఉన్న ప్రమాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాభీష్టం మేరకు, ప్రజలు కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై నిర్ణయం తీసుకుంటా. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సరికాదు. ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తాను. వెనుకబాటుకు గురైన రాయలసీమను సత్వరం అభివృద్ధి చేయకుంటే ప్రాంతీయవాదం తలెత్తే ప్రమాదం ఉంది’’ అని పవన్ అన్నారు. 2019 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చెయ్యబోయేది ఇంకా నిర్ణయించుకోలేదని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు. బాబు మాట.. టీడీపీ నేతలతో భేటీలు : తాను ఎవరికీ తొత్తు కాదన్న పవన్.. సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేస్తున్నట్లు ఇదివరకే చెప్పుకున్నారు. అయితే బీజేపీతో పొత్తుపై సీఎం చంద్రబాబు విరక్తివ్యాఖ్యల అనంతరం.. టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా పవన్‌తో భేటీలకు సిద్ధం అవుతుండటం జిల్లాల్లో చర్చనీయాంశమైంది. శనివారం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో ప్రత్యేక భేటీ జరిపిన ఆయన ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటిలో అల్పాహారవిందు ఆరగించారు. ఆదేశానుసారం రాబోయే రోజుల్లో ఇంకొందరు టీడీపీ కీలక నేతలు కూడా పవన్‌ను కలుస్తారని వినికిడి. -
జుట్టు ఎక్కువై నేనే గుండు కొట్టించుకున్నాను
-
‘గుండు’ ప్రచారం చేయించింది టీడీపీ వాళ్లే: పవన్
సాక్షి, విజయవాడ : గతంలో తనకు పరిటాల రవి గుండు చేయించారన్న ప్రచారంపై ప్రముఖ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. శుక్రవారం ఆయన విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ...‘ పరిటాల రవి నాకు గుండు కొట్టించింది అనేది ప్రచారం మాత్రమే. అది పచ్చి అబద్ధం. ఆ ప్రచారం చేయించింది కూడా టీడీపీ వాళ్లే. టీడీపీ వాళ్లు అప్పుడు నాకు చాలా ద్రోహం చేశారు. అయినా అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు. అన్ని చేసిన టీడీపీకి గత ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చానంటే కులాల ఐక్యత కోసమే. సినిమాలపై చిరాకు వచ్చే నేను గుండు చేయించుకున్నా. ఈ ప్రచారం మొదలు అయినప్పుడు పరిటాల రవి ఎవరో కూడా నాకు తెలియదు’ అని అన్నారు. గతంలో ఒక వివాదం విషయంలో పరిటాల రవి స్వయంగా బెదిరించి పవన్ కల్యాణ్‌కు గుండు చేయించారని ప్రచారం బాగా జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ స్వయంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం పలువురిని విస్మయపరుస్తోంది. అలాగే వంగవీటి రంగా హత్యపై కూడా పవన్ ప్రస్తావించారు. వంగవీటి రంగాను చంపడం తప్పు. విజయవాడలో ఇంకా కులాల వ్యవస్థ నుంచి మారలేదు. నగర ప్రజలు కులం ఉచ్చు నుంచి ఇంకా బయటకు రాలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా తెలంగాణలో కులాభిమానం తక్కువ.. తెలంగాణ అభిమానం ఎక్కువ అంటూ పవన్ పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలో సినిమాలు కూడా పూర్తిగా వదిలేస్తానని తెలిపారు. -
'పరిటాలది రాజకీయ హత్యకాదు..సెటిల్ మెంట్ హత్య'
శ్రీకాకుళం: అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి అని ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ వైఫ్యల్యాలకు సమాధానం చెప్పలేకే అసెంబ్లీలో తప్పుదోవ పట్టిస్తోందని తమ్మినేని విమర్శించారు. పరిటాల రవిది రాజకీయ హత్య కాదు.. సెటిల్మెంట్ హత్య అని తమ్మినేని వ్యాఖ్యలు చేశారు. పరిటాలరవి హత్యకు కారకులైన జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. నేరచరితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. -
‘పరిటాల’ కేసులో జేసీ నిందితుడా.. కాదా..? తేల్చండి
సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ జిల్లా నేతల డిమాండ్ రవి హత్య కేసును నీరుగార్చింది ఆయనేన ని ఆరోపణ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నీలాపనిందలు మానాలని హితవు అనంతపురం అర్బన్ : టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నిందితుడా? కాదా..? అన్నది తొలుత సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక రెండో రోడ్డులోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నాయకులు వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, పెద్దవడుగూరు మండల కన్వీనర్ గురివిరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, శ్రీరాములు, శ్రీధర్‌లు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తన తొమ్మిదేళ్ల పాలనలో హత్యా రాజకీయాలు ప్రోత్సహించింది చంద్రబాబు కాదా? అంటూ ధ్వజమెత్తారు. 2005లో పరిటాల రవి హత్య జరిగిందని, టీడీపీ నాయకుల డిమాండ్ మేరకు అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ కేసును సీబీఐకి అప్పగించారని గుర్తు చేశారు. అయితే అప్పట్లో ప్రతి పక్షనేతగా ఉన్న చంద్రబాబు, ఈ కేసులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ దివాకర్‌రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని సీబీఐని కోరారన్నారు. అయితే కేసును పూర్తి స్థాయిలో పరిశీలించిన సీబీఐ వారిద్దరినీ నిందితుల జాబితా నుంచి తొలగించిందన్నారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడే కేసును నీరుగార్చారని ఆరోపించారు. కేసు పూర్తయి, నిందితులకు కూడా శిక్ష పడిందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు మోసపూరితమైన హామీలిచ్చి ముఖ్యమంత్రిగా అందలమెక్కిన చంద్రబాబు, ఆయన మంత్రి వర్గం పదేళ్ల తర్వాత పరిటా రవి హత్య కేసుపై రాజకీయం చేస్తూ, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడం వారి నీచ సంస్కృతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. జేసీ దివాకర్‌రెడ్డి పరిటాల కేసులో నిందితుడని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించినప్పటికీ, ఆయనకు, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డికి టీడీపీలో ఎందుకు చోటు కల్పించి పదవులు కట్టబెట్టారని చంద్రబాబును వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. మొదట జేసీ దివాకర్‌రెడ్డి హస్తం ఉందా? లేదా..? అనే విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేయాలని, ఆ తర్వాతే ఇతర విషయాలు మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. అంతే కాని వైఎస్ జగన్‌పై నిలాపనిందలు వేయడం చంద్రబాబుకు, మంత్రులకు మంచిది కాదని వారు హితవు పలికారు. -
అర్థం లేని వ్యాఖ్యలు చేస్తే పరువు నష్టం దావా వేస్తా
హైదరాబాద్ : పదే పదే తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. పరిటాల హత్యను టీడీపీ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారన్నారు. పరిటాల రవి హత్యకేసులో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా తనపై ఆరోపణలు చేయటం తగదన్నారు. ఆ కేసులో దోషులకు ఇప్పటికే కోర్టు శిక్షలు విధించిందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రవి హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసునని అన్నారు. అసెంబ్లీలో టీడీపీ నేతలు ఈ ఆరోపణలు చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ అదే వాస్తవమైతే జేసీ దివాకర్ రెడ్డి సోదరులకు చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చేవారా అని ప్రశ్నించారు. మళ్లీ ఇవే ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా ఎందుకు వేయకూడదని సూటిగా ప్రశ్న వేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలపై, దానికి వంత పాడుతున్న ఓ వర్గం మీడియాపై పరువునష్టం దావా ఎందుకు వేయకూడదన్నారు. మరి వంగవీటి రంగా హత్య కేసుపై సీబీఐ విచారణ ఎందుకు జరపలేదని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా తనపై బురద చల్లడమే లక్ష్యామా అని ఆయన ప్రశ్నించారు. -
అర్థం లేని వ్యాఖ్యలు చేస్తే పరువు నష్టం దావా
-
పరిటాల కోటలో వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనంతపురం జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం లభించింది. పరిటాల రవి ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన పెనుకొండ, ఆయన భార్య సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. బుధవారం జరిగిన సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కనగానపల్లి, తగరకుంట, పెనుకొండలో జగన్ రోడ్ షో నిర్వహించారు. తాజా ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ తరపున సునీత పోటీచేస్తుండగా, వైసీపీ అభ్యర్తిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు మారారు. వైసీపీ తరపున శంకర నారాయణ పోటీ చేస్తున్నారు. టీడీపీ కంచుకోటలుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో జగన్ సభలకు విశేష స్పందన రావడంతో వైసీపీ శ్రేణుల్లో ధీమా మరింత పెరిగింది. రోజుకో హామీ ఇస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన హయాంలో ఎందుకు చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఏ రోజైనా మంచి పని చేశారా అని విమర్శించారు. ఆయన పాలనలో రైతులు, ఉద్యోగులు, అన్ని వర్గాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని జగన్ అన్నారు. చంద్రబాబు తన పాలనలో మద్యపాన నిషేధం తొలగించారని, రెండు రూపాయిల కిలో బియ్యం పథకానికి తూట్లు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారినికి వస్తే ఈ అంశాలను నిలదీయాలని సూచించారు. జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. -
చీరాల ‘దేశం’లో చిటపటలు
చీరాల, న్యూస్‌లైన్ : చీరాల తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి.. అన్న చందంగా తయారైంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. నియోజకవర్గంలో క్యాడర్‌ను పూర్తిగా కోల్పోయి బలహీనపడింది. సీటు వ్యవహారంలో నేతల మధ్య విభేదాలు వచ్చి కొందరు పార్టీకి ఇప్పటికే దూర మయ్యారు. ఇదిలావుండగా చీరాల నియోజకవర్గ టీడీపీ సీటు పరిటాల రవి అనుచరుడు కర్నూలు జిల్లాకు చెందిన పోతుల సురేష్ భార్య సునీతకు కేటాయించినట్లు పార్టీ శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. కొద్ది రోజులుగా చీరాల సీటు సునీతకే కేటాయిస్తారని ప్రచారం జరిగినా చివరకు స్థానికులకే టిక్కెట్ ఇస్తారని పార్టీలో ఉన్న సీనియర్ నాయుకులు ఆశించారు. చివరకు సునీతకు సీటు దక్కడంతో సీనియర్లు అధినేత చంద్ర బాబు నిర్ణయంపై మండిపడుతున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తర్వాత ఏడాది పాటు జంజనం శ్రీనివాసరావు నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరించారు. వ్యాపారాల పేరుతో జంజనం ఇన్చార్జ్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలు ఉన్న కొద్ది మంది నేతలే చూశారు. పంచాయతీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలోకి సునీత అడుగు పెట్టారు. అప్పటి నుంచి అమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. చివరకు సీటు కూడా అమెనే వరించింది. కనీసం తమను సంప్రదించకుండా స్థానికేతురలకు టిక్కెట్ ఎలా ఇస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీగా, పార్టీలో సీనియర్‌నేతగా గుర్తింపున్న చిమటా సాంబు చీరాల అసెంబ్లీ సీటును ఆశించారు. యాదవ సామాజికవర్గానికి చెందిన ఆయన.. తనకు సీటు వస్తుందని చివరి వరకూ ఆశించి భంగపడ్డారు. స్థానికేతరులకు టిక్కెట్ దక్కుతుందని తెలియడంతో ఆయన కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలానే చేనేత వర్గానికి చెందిన గోడుగుల గంగరాజు పార్టీ రాష్ట్ర కార్యదర్మి హోదాలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ సీటు ఆశించి భంగపడ్డాడు. ఈ సారైనా టిక్కెట్ ద క్కుతుందని చివర వరకూ తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ కోసం ముందునుంచి కష్టపడి పనిచేసిన వారిలో గంగరాజు కూడా ఒకరు. అధినేత తీరుతో పార్టీలో ఉండలా లేక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలా.. అన్న అలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అలాగే వేటపాలెం నాయుకుడు మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) చీరాల టిక్కెట్ కొసం తీవ్రంగా ప్రయత్నించారు. పంచాయతీ ఎన్నికల కొసం భారీ గానే డబ్బు ఖర్చు పెట్టారు. చివరకు సీటు దక్కకపోవడంతో అయన రాజకీయ భవిష్యత్తు కుడా సందిగ్ధంలో పడింది. అయన పార్టీకి దూరమవుతారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈపురుపాలేనికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జి.చంద్రమౌళి కుడా టిక్కెట్ ఆశించారు. పలు ప్రయత్నాలు కూడా చేశారు. పార్టీ కోసం చివరి వరకు కష్టించి పనిచేశారు. టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీలో ఉంటారా.. లేదా.. అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే సీనియర్లుగా గుర్తింపున్న షేక్ సుభానీ, గుంటూరు మాధవరావు, కూరపాటి స్టాలిన్, బోయిన రాఘవరావు, కంకణాల అచ్చియ్య, పండుబాబు వంటి నాయకులు పార్టీని విడిచి వెళ్లారు. స్థానికేతురులకు సీటు కేటాయించడంపై మరి కొందరు నాయకులు గుర్రుగా ఉన్నారు. మొత్తానికి టీడీపీలో మళ్లీ సీటు చిచ్చు రగులుతోంది. -
పరిటాల గుండు గీయించినప్పుడు పౌరుషం ఏమైంది?
జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. సొంత నియోజకవర్గమైన కరీంనగర్లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పొన్నం ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఓట్లు-సీట్లు కోసం కాదన్నప్పుడు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావంటూ పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. నీతి,నిజాయితీ గురించి మాట్లాడే నీవు సినిమా రెమ్యూనరేషన్‌కు ఇన్‌కంట్యాక్స్ సరిగ్గా చెల్లిస్తున్నావా అని అడిగారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చావు...ఆ సమయంలో ఆమెకు చెల్లించిన కోట్లాది రూపాయిలు బ్లాక్ మనీనా లేక వైట్ మనీనా అనే విషయాన్ని పవన్ బహిరంగంగా వెల్లడించాలన్నారు. టీడీపీ నాయకుడు పరిటాల రవి గుండు గీయించిన సమయంలో నీవు ఎందుకు మౌనంగా ఉన్నావంటూ పొన్నం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని పవన్ కల్యాణ్‌ను ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
వీళ్లకా పార్టీలో చోటు?: అయ్యన్న
నర్సీపట్నం : పరిటాల రవితోపాటు, 150 మంది టీడీపీ కార్యకర్తల హత్యకు కారకుడైన జేసీ దివాకరరెడ్డికి పార్టీలో చోటెలా కల్పిస్తారో తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం జోగినాథునిపాలెంలో సోమవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో టీడీపీ కార్యకర్తల వరుస హత్యలకు జేసీయే బాధ్యుడని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. పార్టీలో కొంతమంది వ్యక్తులు ప్యాకేజీలకు పడిపోయి మాజీమంత్రి గంటా శ్రీనివాస్‌రావు బృందానికి స్వాగతం పలికారని దుయ్యబట్టారు. అవినీతిపరులైన గంటా, ఎమ్మెల్యే కన్నబాబు లాంటి వ్యక్తులను చేర్చుకుంటే పార్టీలో విలువలు ఏం ఉంటాయని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి ఇనుము దొంగిలించి అక్రమంగా పోగేసిన దొంగ గంటా అని ధ్వజమెత్తారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన చంద్రబాబును పక్కనపెట్టి చిరంజీవితో జతకట్టి ప్రజారాజ్యంలో చేరారని, మంత్రి పదవి పొందాక సొంత పనుల కోసం కిరణ్‌తో రాసుకుపూసుకు తిరిగారని దుయ్యమట్టారు. మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబును అవినీతిపరుడని విమర్శించిన గంటాను పార్టీలో చేర్చుకోవడం బాధాకరంగా ఉందన్నారు. చింతలపూడి వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాసరావులకు తెలుగుదేశం పార్టీ జెండా గురించి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. దీనిపై అధినేత ఆలోచించాలని, ఈ విషయమై పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతో కూడా మాట్లాడినట్టు ఆయన వివరించారు. -
పరిటాలది ప్రభుత్వ హత్య: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి పరిటాల రవీంద్రది ప్రభుత్వ హత్య అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోలీసులను ఉపయోగించి పరిటాలను హత్య చేశారని తీవ్ర ఆరోపణ చేశారు. పరిటాల తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీఆర్ భవన్లో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. పరిటాల రవిని చంపిన వారిపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో కోడెల శివప్రసాదరావు, పంచుమర్తి అనూరాధ, టీడీ జనార్ధన్‌రావు, డాక్టర్ సీఎల్ వెంకట్రావు, పిన్నమనేని సాయిబాబా పాల్గొన్నారు. -
పరిటాలను చంపించింది బాబే: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత పరిటాల రవిని చంద్రబాబునాయుడే హత్య చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. టీడీపీలో పరిటాల ఎదుగుదలను ఓర్వలేక చంద్రబాబే హత్య చేయించారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని ఆయన అన్నారు. అయితే నేడు సిగ్గులేకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రతి విషయానికీ రాజశేఖరరెడ్డిని, జగన్‌లను విమర్శించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు, బి.గుర్నాథరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. హత్యా రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, పదవికోసం ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచి హత్య చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. అంతేగాక.. కాపు నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హత్య చేయించారన్నారు. అలాగే ఎలిమినేటి మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, పి.ఇంద్రారెడ్డిలను కూడా చంద్రబాబే హత్య చేయించారనే ఆరోపణలున్నాయన్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వీరి మరణాలతో చంద్రబాబుకు నిజంగా సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు.