గుండు వివాదంపై స్పష్టత ఇచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి పరిటాల కుటుంబాన్ని కలుసుకున్నారు. చలోరే చలోరే చల్ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించి, అనంత సమస్యలపై చర్చోపచర్చలు చేశారు. పవన్ రాక సందర్భంగా పరిటాల నివాసం వద్ద కోలాహలం నెలకొంది. మంత్రి తనయుడు శ్రీరామ్ దగ్గరుండి పవన్‌ను లోనికి తీసుకెళ్లారు.