
పరిటాలది ప్రభుత్వ హత్య: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి పరిటాల రవీంద్రది ప్రభుత్వ హత్య అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోలీసులను ఉపయోగించి పరిటాలను హత్య చేశారని తీవ్ర ఆరోపణ చేశారు. పరిటాల తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. పరిటాల రవిని చంపిన వారిపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో కోడెల శివప్రసాదరావు, పంచుమర్తి అనూరాధ, టీడీ జనార్ధన్‌రావు, డాక్టర్ సీఎల్ వెంకట్రావు, పిన్నమనేని సాయిబాబా పాల్గొన్నారు.