చిన్నారులకు పవన్ కళ్యాణ్ పరామర్శ
హైదరాబాద్: మెదక్ జిల్లాలో పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై సినీ నటుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.... రైలు ప్రమాద దుర్ఘటనలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. పిల్లలు సురక్షితంగా స్కూల్ వెళ్లలేని పరిస్థితులు నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు నష్టపరిహారంతోనే సరిపెట్టకుండా భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.