టీడీపీ నుంచి గంగన్న సస్పెన్షన్
టీడీపీ నుంచి గంగన్న సస్పెన్షన్
Published Sat, Jun 24 2017 7:46 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గంగన్నపై వేటు
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట‍్టపర్తి మున్సిపల్ చైర‍్మన్ పీసీ గంగన‍్నపై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు గంగన్నను సస్పెండ్ చేస్తూ టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి శనివారం ఉత‍్తర్వులు జారీచేశారు. మున్సిపల్ చైర‍్మన్ పదవికి రాజీనామా చేయాలని వారం కిందట ముఖ‍్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఆదేశించినా గంగన‍్న ఖాతరు చేయలేదు. దాంతో ఆగ్రహించిన టీడీపీ అధిష్టానం సూచన మేరకు గంగన‍్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా అధ‍్యక్షుడు ఉత‍్తర్వులు జారీచేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ఉత్కంఠకు తెరపడుతుందని ఆశించిన టీడీపీ శ్రేణులు, పుట్టపర్తి ప్రజలు భావించారు. చైర్మన్‌గా పీసీ గంగన్న రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో తక్షణమే రాజీనామా చేసి, ఇతరులకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం ఆదేశించినా ఆయన వెనక్కి తగ్గలేదు. తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూనే.. గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చిన హామీలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నెరవేరిస్తే రాజీనామా చేస్తానంటూ మెలిక పెట్టిన విషయం తెలిసిందే. వివాదం పూర్తిగా ముదిరిన నేపథ్యంలో పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్ గంగన్నపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
Advertisement