అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలైనా గడవక ముందే తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు తీవ్రం రూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో తమ్ముళ్లు నిరసన బాట పట్టగా.. అనంతపురం జిల్లాలోనూ చిచ్చు రాజుకుంది.
పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి మంత్రి వర్గంలో స్థానం దక్కనందుకు ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రొద్దం మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అనంత నుంచి పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కాగా, పార్థసారథికి బెర్తు లభించలేదు.
అనంతలో తెలుగు తమ్ముళ్ల నిరసన జ్వాలలు
Published Mon, Jun 9 2014 5:48 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement