నా టిప్పర్లనే పట్టుకుంటారా.. మీ అంతు చూస్తా: బీకే | Former TDP MLA Parthasarathy Using Obscene Language On Police | Sakshi

నా టిప్పర్లనే పట్టుకుంటారా.. మీ అంతు చూస్తా: బీకే

Oct 17 2020 7:10 AM | Updated on Oct 17 2020 10:12 AM

Former TDP MLA Parthasarathy Using Obscene Language On Police - Sakshi

సాక్షి, రొద్దం: ‘‘నేనెవరో తెలుసా....కంకర తరలిస్తున్న నా టిప్పర్లనే పట్టుకుని కేసులు పెడతారా...? మీ అంతు చూస్తా’’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారధి పోలీసులపైనే జులుం ప్రదర్శించాడు. వివరాల్లోకి వెళితే....రొద్దం మండల పరిధిలోని కంబాలపల్లి సమీపంలో బీకే పార్థసారథికి ఓ క్వారీ ఉంది. పరిమితికి మించి టిప్పర్లలో కంకర తరలిస్తుండటంతో రోడ్లు దెబ్బతినడంతో పాటు దుమ్ముధూళి చెలరేగి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పోలీసులు సీజ్‌ చేసిన టిప్పర్‌ 
ఈ క్రమంలోనే కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ నెల 15న తనిఖీలకు వెళ్లిన పోలీసులు బీకే సాయి కనస్ట్రక్షన్స్‌కు చెందిన టిప్పర్లలో పరిమితికి మించి కంకరను తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్‌ చేసి ఆర్టీఓ అధికారులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న సదరు కనస్ట్రక్షన్స్‌ యజమాని, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వెంటనే ఎస్‌ఐ నారాయణకు ఫోన్‌ చేశారు. ‘నా టిప్పర్‌ నీకు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు కనబడుతోంది. కంకర క్వారీ అమ్మేసి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించారు.   (ఇదేంటయ్యా..? ఇన్‌చార్జ్‌లే దొరకడం లేదు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement