ప్రజల నమ్మకం..దేవుని ఆశీస్సులు గెలిపించాయి | People believe that the blessings of God, supported .. | Sakshi
Sakshi News home page

ప్రజల నమ్మకం..దేవుని ఆశీస్సులు గెలిపించాయి

Published Sun, May 18 2014 4:34 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

ప్రజల నమ్మకం..దేవుని ఆశీస్సులు గెలిపించాయి - Sakshi

ప్రజల నమ్మకం..దేవుని ఆశీస్సులు గెలిపించాయి

  • కాలి నడకన తిరుమల వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
  •  తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం.. దేవుని ఆశీస్సులే తనను గెలిపించాయని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున విజ యం సాధించిన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందితే కాలినడకన తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పిస్తానని శ్రీవారి చెంత గతంలో చెవిరెడ్డి మొక్కుకున్నారు.

    శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో శ్రీవారికి మొక్కులు తీర్చుకునేందుకు శనివారం సాయంత్రం అలిపిరి పాదాల నుంచి కాలినడక మార్గా న తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూప్రజలు తన నాయకత్వంపై నమ్మకంతో గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. తనను ఆదరించిన ఓటరు దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పా రు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా పోరాటం చేస్తానన్నారు.

    తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. ఆదరించిన నియోజకవర్గ ప్రజలు గర్వపడేలా నడుచుకుంటానని చెప్పారు. ఒకటి రెండు చోట్ల కార్యకర్తల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుని అందర్నీ కలుపుకుని వెళతానన్నారు. కులమతాలకు అతీతంగా అందరి సహకారంతో కలిసికట్టుగా నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తానన్నారు. ఎక్కడా తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా శత్రువులు లేరన్నా రు.

    అందరి సహకారంతో గెలిచిన తనకు నియోజకవర్గ ప్రజలందరూ సమానమేనని ఆయన పేర్కొన్నా రు. అనంతరం శ్రీవారి పాదాలకు నమస్కరించి నడకను ప్రారంభించారు. దారి పొడవునా వెలసిన దేవతామూర్తుల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు కుటుం బ సభ్యులు, బంధువులు, వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement