విజయనగర్ కాలనీలో ఓటింగ్‌కు వెళ్లకుండా ధర్నా చేస్తున్న మహిళలు
మదనపల్లె : పేదలు నివసించే ప్రాంతమని వివక్ష చూపుతూ, కనీసం ఓటు అడిగేందుకు రాకపోవడంతో మూకుమ్మడిగా అందరూ కలిసి ఓట్లు వేసేందుకు వెళ్లమని పోలింగ్‌ను బహిష్కరించిన సంఘటన పట్టణంలోని విజయనగర్ కాలనీలో జరిగింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో స్థానిక విజయనగర్ కాలనీ సిమెంట్ రోడ్డు ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మహిళలు ఓటు వేసేందుకు వెళ్లకుండా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2, 3 వార్డుల పరిధిలో తమ కాలనీ వస్తుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు అడిగేందుకు తమ వార్డులకు రాలేదన్నారు. నాయకులు వస్తే వారికి తమ సమస్యలను చెప్పి, గెలిచిన తర్వాత పరిష్కరించమని అడుగుదామనుకుంటే ఎవరూ అటువైపు చూడకపోవడంతో మా ఓట్లు వారికి అవసరం లేదనుకున్నారేమోనని ఓటుకు వెళ్లడం మానుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment