పట్నంబజారు(గుంటూరు) : ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్షకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు.
పట్నంబజారు(గుంటూరు) : ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్షకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. స్థానిక అరండల్‌పేటలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం తెనాలి, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ముఖ్యనేతలతో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ పోగ్రామ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సమీక్షకు హాజరయ్యారు.
తెనాలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కత్తెర సురేష్‌కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు హాజరయ్యారు. జూన్ 3, 4 తేదీల్లో జరగనున్న సమరదీక్ష కార్యక్రమానికి జన సమీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేరే వరకు జననేత వైఎస్ జగన్ పోరాటాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేశారు. ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ మాట్లాడుతూ కేవలం టీడీపీ కార్యకర్తల కోసమే అధికారంలోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా, ఏ మొఖం పెట్టుకుని విజయోత్సవ యాత్రలు చేసేందుకు సిధ్దపడుతున్నారని ప్రశ్నించారు.
పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని అభివృధ్ధి పధంలో దూసుకుపోతోందని ప్రకటనలు చేయటమే తప్ప జరుగుతోందని ఏమి లేదని విమర్శించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున,పార్టీ నాయకులు అన్నాబత్తుని శివకుమార్, కత్తెర సురేష్‌కుమార్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల, మండల, గ్రామ నేతలు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, మెట్టు వెంకటప్పారెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, ఉప్పుటూరి నర్సిరెడ్డి, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, కంది సంజీవరెడ్డి, యోగీశ్వరరెడ్డి, శివరామిరెడ్డి, సుందర్‌రెడ్డి, అనిల్, తియ్యగూర బ్రహ్మారెడ్డి, హబీబుల్లా, కిషోర్, శివారెడ్డి వెంకటరెడ్డి, సిద్ధయ్య, ప్రకాష్, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.