పాలమూరు, న్యూస్‌లైన్:
ఆడబిడ్డలకు ఉన్నత భవిష్యత్తును అందించేందు కు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బంగారు తల్లి’కి అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. గ్రామీణస్థాయిలో ఈ పథకం విధివిధానాలు తెలియక పోవడం, దరఖాస్తుకు ఎలాంటి పత్రా లు ఇవ్వాలనే అంశాలపై అవగాహన లేకపోవడంతో అర్హులు ఇ బ్బం దులు పడుతున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో సర్వే చేపట్టి జి ల్లాలో 6131 మంది అర్హులని గుర్తించారు. అందులో 3120 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 712 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. మరోవైపు ఐకేపీ సి బ్బంది సర్వేలు కొనసాగిస్తున్నా పలు విభాగాల సిబ్బంది సహకరించని కారణంగా ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. బిడ్డ పుట్టిన సమాచారాన్ని 24 గంటల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉన్నా వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. సాఫ్ట్‌వేర్ అప్ లోడింగ్ చేసి సమస్య పరిష్కరించే పనిలో ఉన్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. బంగారు తల్లి పథకం కింద అర్హత సాధించాలం టే ఈ ఏడాది మే 1 నుంచి మొదటి, రెండో కాన్పుల్లో ఆడ పిల్లలు పుట్టిన వారై, వారు కుటుంబ నియంత్ర ణ పరిధిలో ఉండాలి.
ఈ అర్హతతో దరఖాస్తు చేసుకు నే వారు బిడ్డ, కాన్పు, బ్యాంకు ఖాతా వివరాలు, రు జువు పత్రాలు కలిపి మొత్తం 60 కాలమ్‌ల వివరాలు అందివ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఇవ్వడానికి గ్రామస్థాయిలో సిబ్బంది ప్రజలకు సహకరించడం లే దు. స్థానికంగా ఉన్న ఐకేపీ సిబ్బంది సరైన సమాచా రం ఇవ్వకపోవడంతో రెండు నెలలుగా దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయి. అచ్చంపేట, అలంపూర్, కల్వకుర్తి, కొల్లాపూర్, నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పథకం ప్రారంభించి నాలుగు నెలలు దాటినా జిల్లాలో ఎంతమంది అర్హులున్నారో తేల్చలేదు. దీంతో ఈ పథకం ఎంతవరకు విజయం సాధిస్తుందనే కొలమానం లేకుండాపోయింది.
అప్‌లోడింగ్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి bangarutalli.ap.gov.in వెబ్‌సైట్ సర్వర్ సహకరించడం లేదు. రాత్రి సమయాల్లోనూ పని చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి రాత్రి 11 గంటలు దాటితే సర్వర్ పూర్తిగా నిలిచిపోతుంది. ఇప్పటివరకు 3120 దరఖాస్తులు కార్యాలయాలకు వస్తే అందులో సగం మాత్రమే ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయి వివరాలు పొందుపరిచారు. ఈ పథకానికి బ్యాంక్ ఖాతాలుంటేనే అర్హులు. ఖాతాలు తెరవడానికి బ్యాంకర్లూ సహకరించడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక దరఖాస్తు చేసుకున్నవారంతా డబ్బుల కోసం ఎదురు చూ స్తున్నారు. మొన్నటి వరకు డబ్ల్యూపీ సీరిస్‌లో రేషన్ కా ర్డులు వచ్చాయి. ఇప్పుడు వైఏపీలో వస్తుండటంతో వీటి ని సాప్ట్‌వేర్ తీసుకోవడం లేదు. ఫలితంగా జిల్లాలో 2400 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
‘బంగారుతల్లి’కి బాలారిష్టాలు
Published Fri, Oct 11 2013 4:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement