అక్రమ అనుమతులకు పంచాయతీ కార్యదర్శులే బాధ్యులు
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో లేఔట్లకు టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతి తప్పనిసరి అని జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారి ప్రసాదరావు తెలిపారు. కొంత మంది అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా లేఔట్లను వేస్తున్నారన్నారు. అనుమతులు, అక్రమ లేఔట్ల వల్ల వచ్చే ప్రజలకు వచ్చే ఇబ్బందులు తదితర వాటిపై సోమవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
జిల్లా పట్టణ, గ్రామీణ అధికారి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో లేఔట్ల అనుమతి విషయంలో జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారికార్యాలయం పర్యవేక్షిస్తుందన్నారు. 2.5 ఎకరాల వరకు లేఔట్ల అనుమతి తమ పరిధిలో ఉందని, 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అనంతపురం జిల్లాలోని డీటీసీపీప ప్రాంతీయ కార్యాలయం అనుమతి ఇస్తుందన్నారు. 5 ఎకరాలు దాటినా వాటికి హైదరాబాద్‌లోని డెరైక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో పలుచోట్ల అక్రమ లేఔట్లపై సెల్ 98490 83365 నంబర్‌కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
అనుమతులు తప్పనిసరి: పట్టణ ప్రాంతాల్లో కన్న మునిసిపాలిటీ, కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా లేఔట్లు వెలుస్తున్నాయి. అనుమతులు తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. గ్రామ పంచాయతీల్లో వెలిసే లేఔట్లకు సంబంధించి విధిగా 10 శాతం స్థలం గ్రామ పంచాయతీకి అప్పగించాలి. తప్పనిసరిగా జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారి కార్యాలయం నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. మునగాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని స్వే నంబర్ 5/1లో1 ఎకరాకు అన్ని అనుమతులు ఉన్నాయి.
అదే విధంగా అదే గ్రామంలోనిమరో 16 ఎకరాలకు పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ నుంచి లేఔట్లను మంజూరయ్యాయి. నందనపల్లె గ్రామంలో 291 సర్వే నంబర్‌లో 4.96 ఎకరాలు,పసుపుల గ్రామంలో 314-3పి సర్వే నంబర్‌లో 3.80 ఎకరాలు, ఆదోని డివిజన్‌లోని బైచిగేరి గ్రామంలో 47/పి సర్వే నంబర్‌లో 2.94 ఎకరాలు, అదే డివిజన్ పరిధిలోని 38 సర్వే నంబర్‌లో 2.65 ఎకరాలు, ఉల్లిందకొండ గ్రామం లో 45/3బి సర్వే నంబర్‌లో 3.99 ఎకరాలకు ప్రణాళిక శాఖ అనుమతి ఉంది.
ప్రయోజనాలు ఇవి:
ఏదేని వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా(ల్యాండ్ కన్వర్షన్) చేసి ఇళ్ల ప్లాట్లుగా విభజించాలి. రోడ్డు నిర్మాణం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, పార్కులు, ఆట స్థలాల ఏర్పాటు, వీధి దీపాలు తదితర మౌళిక సదుపాయాలు, రోడ్లకు ఇరువైపుల చెట్లు లేఔట్లు ఉంటాయి. అప్రోచ్ రోడ్డు 33 అడుగుల అంతర్గత రోడ్లు ఉంటాయి. ఎకరానికి 10 శాతం చొప్పున లేఔట్లు స్థలాన్ని గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. భవిష్యత్తులో ఉద్యానవనాలు, ఆట స్థలాల కోసం వినియోగిస్తారు.
లేఔట్లకు అనుమతులు తప్పనిసరి
Published Tue, Jan 28 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
Advertisement
Advertisement