క్రిమినల్ కేసులు పెడతాం!
ఆర్టీసీకి పీఎఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నోటీసులు
పక్షం రోజుల్లో మొత్తం జమచేస్తామని అధికారుల విజ్ఞప్తి
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు చెందాల్సిన రూ. 160 కోట్ల భవిష్య నిధి మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా సొంత అవసరాలకు వాడుకున్న తీరుపై ఆర్టీసీకి షాక్ తగిలింది. ఈ వ్యవహారాన్ని భవిష్యనిధి విభాగం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలకు విరుద్ధంగా సొంత అవసరాలకు వినియోగించిన మొత్తాన్ని వెంటనే ‘నిధి’కి జమ చేయకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ పీఎఫ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వ్యాడ్ ఆర్టీసీకి తాజాగా నోటీసులు జారీ చేసింది.
ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి కార్మికులతో పాటు సంస్థ జమ చేసే భవిష్య నిధి మొత్తాన్ని గుట్టుగా సొంతానికి వాడుకున్న తీరును ఇటీవల ‘పీఎఫ్‌నూ మింగేశారు’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి పీఎఫ్ విభాగం స్పందించి ఈ మేరకు ఆర్టీసీకి నోటీసులు జారీ చేసింది. పీఎఫ్ నిధులను మళ్లించ డమంటే కేంద్ర చట్టాలను అతిక్రమించినట్లేనంటూ క్రిమినల్ కేసులు నమోదు చేయటానికి సిద్ధం కావటంతో ఆర్టీసీ అధికారులు గతుక్కుమన్నారు. ఆ నిధులు మళ్లించటానికి దారితీసిన పరిస్థితులను తెలుపుతూ పీఎఫ్ కార్యాలయానికి వివరణ ఇచ్చారు. తమకు పక్షం రోజుల గ డువు ఇస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమచేస్తామని విజ్ఞప్తి చేశారు.
పీఎఫ్ సొమ్మును మింగేస్తారా...
Published Sun, Sep 14 2014 2:16 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
Advertisement
Advertisement