
పీజీ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
ఎస్కేయూ : స్కూసెట్-2014లో ర్యాంకు సాధించిన వారికి వర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే తేదీల షెడ్యూల్ సోమవారం వీసీ ఆచార్య కె.రామక్రిష్ణారెడ్డి విడుదల చేశారు. అంతకు ముందు అడ్మిషన్స్ అడ్వైయిజరీ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందులో మొదటి విడత కౌన్సెలింగ్‌ను 29 నుంచి జూలై 5 వరకు నిర్వహించనున్నారు.
7న క్యాప్(చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్‌డ్ పర్సన్స్), పీహెచ్ కేటగిరి. 8న ఎన్‌సీసీ, ఎన్‌ఎఎస్, స్పోర్స్ట్, 9న అడ్మిషన్ రద్దు, 12న రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అడ్మిషన్ రద్దు చేసుకునే వారికి ఫీజులో 10 శాతం లేదా రూ.500 ఏది ఎక్కువైతే ఆ మొత్తం వెనక్కు చెల్లించరు. ఎంపెడ్ కోర్సులో ప్రవేశం పొందగోరువారు జూలై ఆఖరి వారంలో వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.