ప్రారంభమైన పీజీ కౌన్సెలింగ్ :ఏఎన్‌యూ : యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2015-16 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ కౌన్సెలింగ్ సోమవారం యూనివర్సిటీలో ప్రారంభమైంది.
ప్రారంభమైన పీజీ కౌన్సెలింగ్ :ఏఎన్‌యూ : యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2015-16 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ కౌన్సెలింగ్ సోమవారం యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఇన్‌చార్జి వీసీ కేఆర్‌ఎస్ సాంబశివరావు కౌన్సెలింగ్‌ను ప్రారంభించి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు మొదటి ర్యాంకర్ పి.భరత్‌కుమార్‌కు, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సు మొదటి ర్యాంకర్ ఆర్.ఆశామౌనికకు సీటు ఖరారు పత్రాలు అందజేశారు. కౌన్సెలింగ్ ఏర్పాట్లను అడ్మిషన్ల డెరైక్టర్ ఎం.రామిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సి.రాంబాబు, డాక్టర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరు:
పీజీ కౌన్సెలింగ్‌కు తొలిరోజు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సుకు 232 మంది, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సుకు 128 మంది హాజరయ్యారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సులో సీట్లు అధికంగా భర్తీ అయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు కెమికల్ సెన్సైస్‌లో 501 నుంచి 800 ర్యాంకు వరకు, ఇంగ్లిష్‌కు ఎన్‌సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పీహెచ్ కేటగీరిల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 256 వ ర్యాంకు వరకు మధ్యాహ్నం 2 గంటలకు కెమికల్ సెన్సైస్‌లో 801 నుంచి 1200 వ ర్యాంకు వరకు, తెలుగులో ఎన్‌సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పీహెచ్ కేటగీరిల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 161వ ర్యాంకు వరకు, హిందీలో ఎన్‌సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పీహెచ్ కేటగీరిల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 35వ ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది.