ముగిసిన పీజీఈసెట్ పరీక్షలు | PG e-set the end of this  tests | Sakshi
Sakshi News home page

ముగిసిన పీజీఈసెట్ పరీక్షలు

Published Sun, Jun 1 2014 12:41 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

PG e-set the end of this  tests

17న ఫలితాలు... జూలై చివరి వారంలో వెబ్‌కౌన్సెలింగ్

హైదరాబాద్, ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు  ఈ నెల 26న ప్రారంభమైన పీజీఈసెట్-2014 ప్రవేశ పరీక్షలు శనివారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 సబ్జెక్టులకు జరిగిన ఈ పరీక్షలకు  92 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు  పీజీఈసెట్ కన్వీనర్ ప్రొ.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. జూన్ 17న ఫలితాలను విడుదల చేసి, జూలై చివరి వారంలో వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. 

గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఉన్న 70 వేల సీట్లలో 50 వేల సీట్లను కన్వీనర్ కోట కింద భర్తీ చేశామన్నారు. ఓయూ క్యాంపస్‌లోని టెక్నాలజీ కాలేజీ, కాకినాడ జేఎన్‌టీయూలో ఫుడ్ టెక్నాలజీలో పీజీ కోర్సులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement