జూలై రెండో వారంలో కౌన్సెలింగ్
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్- 2016 ఫలితాలను ఎస్వీయూ వీసీ దామోదరం గురువారం విడుదల చేశారు. గత నెల 23న 18 పట్టణాల్లోని 27 పరీక్ష కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.ఫలితాలు విడుదల సందర్భంగా వీసీ దామోదరం మాట్లాడుతూ.. ఈ పరీక్షలో 96.16 శాతం మంది అర్హత పొందారని తెలిపారు. ఎడ్‌సెట్‌కు 9,561మంది హాజరు కాగా వారిలో 9,194 మంది అర్హత సాధించారని చెప్పారు. ఈ ఫలితాల్లో బాలురదే స్వల్పంగా పైచేయి కన్పించిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి తీసుకున్న అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. జూలై రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నామన్నారు.
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
Published Fri, Jun 3 2016 1:05 AM | Last Updated on Thu, Mar 28 2019 5:30 PM
Advertisement
Advertisement