ఫణిగిరి గట్టులో రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు
ఫణిగిరి గట్టులో రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు
హుజూర్‌నగర్,
హుజూర్‌నగర్ పరిధిలోని ఫణిగిరి గట్టు శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు శనివారం ప్రారంభమయ్యాయి.
రెండు, నాలుగు పండ్ల గిత్తల విభాగంలో రాష్ట్రస్థాయి, ఆరు పండ్లు, లోకల్ సైజ్ విభాగంలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. కాగా మొదటి రోజు నిర్వహించిన రెండు పండ్ల విభాగంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నల్లగొండ జిల్లాలకు చెందిన 26 జతల ఎడ్లు పాల్గొన్నారు. పోటీల్లో ప్రకాశం జిల్లా పొట్లపాడు గ్రామానికి చెందిన కూసం బైపిరెడ్డి ఎడ్ల జత 6 క్వింటాళ్ల బండను నిర్ణీత సమయంలో 3,939 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి గెలుపొందాయి. అలాగే గుంటూరు జిల్లా నలగర్లపాడు గ్రామానికి చెందిన గోగిరెడ్డి బాల్‌రెడ్డి, కనిపర్తి గ్రామానికి చెందిన పచ్చం బ్రహ్మారెడ్డిల ఎడ్ల జత 3,806 అడుగుల దూరం లాగి ద్వితీయ, గుంటూరు జిల్లా చినకొండ్రపాడు గ్రామానికి చెందిన ఎరుకల ఆదినారాయణ ఎడ్ల జత 3,600 అడుగులు లాగి తృతీయ, గుంటూరు జిల్లా నాదెండ్ల గ్రామానికి చెందిన నల్లమోతు శేషగిరిరావు ఎద్దుల జత 3,5552 అడుగుల దూరం లాగి చతుర్థ బహుమతి గెలుచుకు