hujurnagar
-
హుజూర్‌నగరం.. గరం!
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఎవరన్న దానిపై కాంగ్రెస్‌లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మొదటి నుంచీ ఊహిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో ఉంటారా.. అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేశారా లేదా అనే విషయాల్లో డోలాయమానం కన్పిస్తోంది. అయితే గతంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్‌కే తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకమాండ్ ఇచ్చే అవకాశాలున్నా.. ఈలోపే వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, ఫిర్యాదులు హుజూర్నగర్ కాంగ్రెస్ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. పద్మావతే అభ్యర్థి..? హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన నాటి నుంచే ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన సతీమణి పద్మావతిని పోటీ చేయించే ఆలోచన లేదని ఉత్తమ్ మొదట్లో చెప్పడంతో అభ్యర్థి ఎవరన్న దానిపై సందిగ్ధత నెలకొంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, స్థానిక నేతలు, కేడర్ అభిప్రాయం ప్రకారం పద్మావతే అక్కడ సరైన అభ్యర్థి అనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఉత్తమ్‌తో పాటు మంచి పరిచయాలున్న ఆమె అయితే టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వొచ్చని, కచ్చితంగా గట్టెక్కే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తన సతీమణి పద్మావతి పోటీ చేస్తారనే సంకేతాలను ఉత్తమ్ పంపారు. దీంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ వార్తలను ఖండించారు. హుజూర్నగర్ అభ్యర్థిగా ఎవరినీ ఖరారు చేయలేదని ప్రకటించారు. హైకమాండ్ చెప్పాలి కదా? హుజూర్నగర్ బరిలో పద్మావతి ఉంటారని ఉత్తమ్ ఎలా చెబుతారని, అసెంబ్లీ అభ్యర్థిత్వాలను పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుందనే వాదన కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరుగుతోంది. ఉత్తమ్ ప్రకటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అభ్యం తరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను కలసి రేవంత్ చర్చించారని, పద్మావతి అభ్యర్థిగా ఖరారైనా కూడా ఉత్తమ్ ప్రకటించడమేంటని ప్రశ్నించినట్లు గాంధీభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్‌రెడ్డిని తాను ప్రతిపాదిస్తున్నానని పేర్కొనడం మరింత వేడిని రాజేసింది. ప్రస్తుతానికి కొంత గందరగోళం ఉన్నా కాంగ్రెస్ హుజూర్నగర్ అభ్యర్థిగా పద్మావతి పేరే చివరకు ఖరారవుతుందని సమాచారం. సెల్ఫీ కావాలంటే వారినే అడగాల్సింది : రేవంత్‌రెడ్డి ‘పవన్ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు సెల్ఫీ దిగే అవకాశం రాకపోతే నేనేం చేయాలి. దానికి టీపీసీసీ చీఫ్‌నే అడగాల్సింది’ అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యురేనియం తవ్వకాలపై పార్టీ తరఫున ఓ కమిటీని వేసి దాని చైర్మన్‌గా వీహెచ్ ను పీసీసీ అధ్యక్షుడు నియమించారు. వాళ్లిద్దరూ హాజరైన సమావేశానికి నేను కూడా వెళ్లాను. యురేనియం తవ్వకాలతో ప్రభావితమయ్యే ప్రాంతంలో నా సొంతూరు ఉందనే ఆవేదనతో వెళ్లా. అక్కడకు సంపత్ రావడం ఎందుకు.. పవన్‌తో సెల్ఫీ దిగాలని అనుకుంటే టీపీసీసీ అధ్యక్షుడిని అడగాల్సి ఉండే’ అని అన్నారు. రేవంత్ మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అటుగా వచ్చారు. ‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని వదిలేసి నన్ను రాజగోపాల్‌రెడ్డి సోదరుడి గా దత్తత తీసుకున్నారని రేవంత్ అన్నారు. -
ఆటోను ఢీకొట్టిన లారీ
చిలుకూరు: వారంతా కోదాడలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వచ్చారు. అది ముగియగానే జాన్‌పహాడ్ దర్గాను దర్శించుకుని రాత్రి హుజూర్‌నగర్‌లో ఉన్న మరో బంధువు ఇంట్లో బస చేశారు. ఉదయం అక్కడినుంచి సొంత ప్రాంతానికి వెళ్లాలంటే కోదాడకు రావాలి. దీంతో హుజూర్నగర్నుంచి కోదాడకు ఓ ఆటో మాట్లాడుకుని బయలుదేరారు. మార్గమధ్యలోకి రాగానే ఆటో వేగంగా ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు షేక్ అఫ్జల్‌పాషా (48), గౌసియాబేగం (40), మహమూదాబేగం (35), మహిన్ (15), ముస్కాన్ (12), షేక్ మహబూ బ్ పాషా (40) మృతిచెందారు. జాకీర్‌పాషా, ఆటో డ్రైవర్ నాగుల్ మీరాకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ శివారులో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫంక్షన్‌కు వచ్చి.. కుటుంబ పెద్ద అయిన షేక్ అఫ్జల్ పాషా, ఆయన భార్య గౌసియా బేగం, తమ్ముడు షేక్ మహబూబ్ పాషా, తమ్ముడి భార్య మహమూదాబేగం, తమ్ముడి కుమార్తెలు మహిన్, ముస్కాన్, ఆయన కొడుకు జాకీర్పాషాలు సూర్యాపేట జిల్లా కోదాడలో ఉంటున్న తన చెల్లెలు అక్తర్‌బేగం ఇంట్లో ఫంక్షన్ కోసం బుధవారం వచ్చారు. ఫంక్షన్ పూర్తికాగానే హుజూర్‌నగర్‌లో ఉంటున్న అఫ్జల్ పాషా చిన్న తమ్ము డు యాకుబ్ ఇంటికి వెళ్లారు. అ రోజు రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం జాన్‌పహాడ్ దర్గాకు వెళ్లారు. అదే రోజు రాత్రి 7 గంటలకు తిరిగి హుజూర్‌నగర్‌కు చేరుకున్నారు. రాత్రి సమయంలో వెళ్లడం ఇబ్బంది అనుకుని అక్కడే నిద్రపోయారు. ఉదయం 6 గంటలకు తమ స్వగ్రామానికి బయలుదేరారు. హుజూర్ నగర్ నుంచి కోదాడ వచ్చేందుకు లోకల్ ఆటో మాట్లాడుకున్నారు. కోదాడకు వస్తుండగా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ శివారులోకి రాగానే ఆటో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో షేక్ అఫ్జల్‌పాషా, గౌసియాబేగం, మహమూదాబేగం, మహిన్లకు తీవ్ర గాయా లు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రగాయాలైన ముస్కాన్, షేక్ మహబూబ్ పాషా, ఆటోడ్రైవ ర్ నాగుల్ మీరాలను హుజూర్నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా ముస్కాన్ మార్గమధ్యలో చనిపోయింది. మహబూబ్ పాషా, డ్రైవర్‌ను మెరుగైన చికిత్స అక్కడినుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహబూబ్ పాషా మృతిచెందాడు. జాకీర్ పాషా, ఆటోడ్రైవర్ చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను శవపరీక్ష అనంతరం బంధువులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, డీ ఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐలు రవి, శ్రీనివాస్‌రెడ్డిలు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుప్తనిధుల కోసం తవ్వకం
హుజూర్నగర్ రూరల్: కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నాణేల నిధి... తన ఇంటిలోని మూలగదిలో వచ్చిచేరిందని, మంత్రగాళ్ల సహాయంతో మేకపోతులను బలిచ్చి రక్తపుధారలు అర్పిస్తే బంగారం తన వశమవుతుందని కలలో వచ్చిన ఆనవాళ్లతో ఓ రైతు తనింటిలో తవ్వకాలు జరపడంతో నాణేలు లభ్యమయ్యాయి. అయితే వాటిని పరీక్షిస్తే.. రాగి, ఇత్తడివిగా తేలాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అమరవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరవరం గ్రామానికి చెందిన సింగతల గురవారెడ్డి తన ఇంట్లో బంగారు నిధి ఉందంటూ ఇద్దరు మంత్రగాళ్ల సహాయంతో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మేకపోతులను బలిచ్చి దేవుడి గదిలో ఒక మూలన గొయ్యి తవ్వాడు. ఈ గొయ్యిలో సుమారు 24.4 కేజీల బరువున్న (662 నాణేలు) బంగారాన్ని పోలిన నాణేలు లభ్యమయ్యాయి. వాటిని ఒకబ్యాగులో సర్ది అటకమీద పెట్టారు. అప్పటికే కొద్దిరోజులుగా మేకపోతులను బలి ఇస్తూ మంత్రగాళ్లు పలుదఫాలుగా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా ఇంట్లో క్షుద్రపూజల అలజడి గమనించిన స్థానికులు గుప్తనిధుల తవ్వకం పసిగట్టి పోలీసులకు సమాచారం అందించారు. కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐ కె.భాస్కర్ పోలీసు సిబ్బందితో రాత్రి సమయంలోనే హుటాహుటిన అమరవరం చేరుకుని గురవారెడ్డి ఇంట్లో సోదా చేశారు. గదిలో తవ్వకాలు జరిపిన గొయ్యిని పరిశీలించారు. బంగారు నాణేలుగా భావించి అటకమీద దాచిన నాణేల బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షలో రాగి, ఇత్తడి నాణేలుగా గుర్తింపు హుజూర్‌నగర్‌లోని పుల్లయ్యచారి అనే నిపుణుడితో రసాయన పరీక్షల ద్వారా ఆ నాణేలను పరీక్షించగా అవి రాగి, ఇత్తడివిగా తేలినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అమరవరంలో స్వాధీనం చేసుకున్న నాణేలను ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. గురవారెడ్డి మరో ఇద్దరితో కలసి కొంతకాలంగా ఇంట్లో ఉన్న గుప్తనిధి తవ్వకాల కోసం పలుదఫాలుగా మేకపోతులను బలిచ్చి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి కూడా మేకపోతును బలిఇచ్చి ఇంట్లో గొయ్యి తవ్వడంతో 24.4 కేజీల (662నాణేలు)బరువున్న బంగారాన్ని పోలిన నాణేలు లభ్యమవడంతో వాటిని అటకపై ఉంచారని, స్థానికుల సమాచారంతో డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నాణాలను స్వా«ధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
టీఆర్ఎస్ పార్టీలో చేరిక
నేరేడుచర్ల : పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌కు చెందిన ఐఎన్టీయూసీ మండల నాయకుడ, 9వ వార్డు సభ్యుడు కాటూరి శేషగిరి ఆదివారం టీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కాసోజు శంకరమ్మ ఆధ్వర్యంలో రాష్త్ర విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లచ్చిరాం నాయక్, జాన్‌పహాడ్ టీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శ్రీను, జింకల భాస్కర్, గుమ్మడెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఫణిగిరి గట్టులో రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు
ఫణిగిరి గట్టులో రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు హుజూర్నగర్, హుజూర్నగర్ పరిధిలోని ఫణిగిరి గట్టు శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండు, నాలుగు పండ్ల గిత్తల విభాగంలో రాష్ట్రస్థాయి, ఆరు పండ్లు, లోకల్ సైజ్ విభాగంలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. కాగా మొదటి రోజు నిర్వహించిన రెండు పండ్ల విభాగంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నల్లగొండ జిల్లాలకు చెందిన 26 జతల ఎడ్లు పాల్గొన్నారు. పోటీల్లో ప్రకాశం జిల్లా పొట్లపాడు గ్రామానికి చెందిన కూసం బైపిరెడ్డి ఎడ్ల జత 6 క్వింటాళ్ల బండను నిర్ణీత సమయంలో 3,939 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి గెలుపొందాయి. అలాగే గుంటూరు జిల్లా నలగర్లపాడు గ్రామానికి చెందిన గోగిరెడ్డి బాల్‌రెడ్డి, కనిపర్తి గ్రామానికి చెందిన పచ్చం బ్రహ్మారెడ్డిల ఎడ్ల జత 3,806 అడుగుల దూరం లాగి ద్వితీయ, గుంటూరు జిల్లా చినకొండ్రపాడు గ్రామానికి చెందిన ఎరుకల ఆదినారాయణ ఎడ్ల జత 3,600 అడుగులు లాగి తృతీయ, గుంటూరు జిల్లా నాదెండ్ల గ్రామానికి చెందిన నల్లమోతు శేషగిరిరావు ఎద్దుల జత 3,5552 అడుగుల దూరం లాగి చతుర్థ బహుమతి గెలుచుకు