నాలుగురోజులపాటు పాలమూరు ముంగిట నువ్వానేనా అని సాగిన ‘పైకా’ సమరం శుక్రవారం ముగిసింది.
నాలుగురోజులపాటు పాలమూరు ముంగిట నువ్వానేనా అని సాగిన ‘పైకా’ సమరం శుక్రవారం ముగిసింది. దేశంలోని 18 రాష్ట్రాలనుంచి వచ్చిన క్రీడాకారులు తమ సత్తాచాటి పతకాల పంటతో తమ తమ ప్రాంతాలకు వెనుదిరిగారు. ఇక్కడ అందరితో పంచుకున్న అనుభూతులను ఒకరితో ఒకరు చెప్పుకొని మురిసి పోయారు. జిల్లా ఆటగాళ్లూ ఆటల్లో మన ప్రాభవాన్ని చాటి ఔరా అనిపించారు. పల్లె బిడ్డల పౌరుషం చాటారు.