జగన్ కేసు విచారణ మార్చి 6కు వాయిదా | Pics trial postponed to March 6 | Sakshi

జగన్ కేసు విచారణ మార్చి 6కు వాయిదా

Jan 30 2015 1:52 AM | Updated on Jul 25 2018 4:09 PM

పెట్టుబడుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు.

సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, పారిశ్రామికవేత్తలు శ్యాంప్రసాద్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, సీనియర్ ఐఏఎస్‌లు శామ్యూల్, మన్మోహన్‌సింగ్ సహా ఇతర నిందితులు కూడా హాజరయ్యారు. వారి హాజరును నమోదుచేసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి తదుపరి విచారణ మార్చి 6కు వాయిదా వేశారు. అలాగే ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్‌లో నుంచి తమను తొలగించాలని కోరుతూ నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను కోర్టు వచ్చే నెల 4కు వాయిదా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement