2 వేల కోసం బాలుడి దారుణ హత్య | Police arrest four in young kidnapping and murder case in rain bazar | Sakshi
Sakshi News home page

2 వేల కోసం బాలుడి దారుణ హత్య

Published Wed, Jan 15 2014 9:05 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

Police arrest four in young kidnapping and murder case in rain bazar

హైదరాబాద్ : హైదరాబాద్‌ రెయిన్ బజార్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాపైన బాలుడు నవాజ్‌ (16) హత్యకు గురయ్యాడు. నవాజ్‌ను అతని స్నేహితులే చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నవాజ్‌ను చంపేశామంటూ.. అతని తల్లి అనీసా బేగంకి ఫోన్‌ చేసి చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అతడి స్నేహితులిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. నవాజ్‌ను చంపి యాకుత్‌పుర నాలాలో పడేశామని అతని స్నేహితులు అంగీకరించారు. ఈ హత్యకేసులో మొత్తం నలుగురు బాలురు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేవలం 2 వేల రూపాయల కోసం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement