వై జంక్షన్ వద్ద యముడి వేషధారణలో వాహన చోదకులను అడ్డుకుంటుండగా నమస్కారం పెడుతూ అవగాహన కల్పిస్తున్న పోలీసులు
విజయనగరం క్రైమ్: కోవిడ్ 19 నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న ప్రయోగాలతో ముందుకు వెళ్తూ ప్రజల్లో అవగాహన కలిగిస్తోంది. పక్క జిల్లా విశాఖను ఇప్పటికే రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో విజయనగరం జిల్లా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం స్థాని క వై జంక్షన్ వద్ద రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో యముడి వేషధారణలో ఇద్దరు వ్యక్తులు కరోనా వ్యాధి కారకమైన కోవిడ్ 19 వైరస్ ఆకారంలో గల గదలను ధరించి, నిబంధనలను పాటించకుంటే యమపురికి వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఎస్పీ రాజకుమారి, ఓఎస్డీ జె.రామమోహనరావు, రూర ల్ సీఐ రమేష్, ఎస్‌ఐలు వాహనచోదకులకు నమ స్కారం పెడుతూ ఇంట్లోనే ఉండండని అవగాహన కల్పించారు.
నిబంధనలు అతిక్రమిస్తే కేసు తప్పదు: ఎస్పీ
లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ బి.రాజకుమారి ఆదేశించారు. పోలీస్ శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను చెక్‌పోస్టుల పనితీరును గురువారం పరిశీలించారు. భద్రతా చర్య లు చేపట్టినప్పుడు కూడా పోలీసులు భౌతిక దూ రం పాటించాలని, ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. అనుమతి లేకుండా షాపులు తెరిచిన వారిపైనా కేసులు నమోదుచేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment