వైఎస్సార్‌ జిల్లాలో కానిస్టేబుల్‌కు కరోనా | Police Constable Tested Positive For Coronavirus In YSR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌

Published Wed, Apr 22 2020 2:06 PM | Last Updated on Wed, Apr 22 2020 2:11 PM

Police Constable Tested Positive For Coronavirus In YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : కడప నగరంలో ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. కడపలోని రెడ్‌ జోన్‌ ప్రాంతంలో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉంది. రెడ్‌ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న తరుణంలోనే ఆ కానిస్టేబుల్‌కు కరోనా సోకి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ కానిస్టేబుల్‌ ఎవరిని కలిశాడు, ఏయే ప్రాంతాల్లో తిరిగాడు అనే వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. నగర శివారులోని సరోజిని నగర్‌లో నివాసం ఉంటున్న ఆ కానిస్టేబుల్‌.. సీఐ దగ్గర పనిచేస్తున్నట్టుగా సమాచారం. 

చదవండి : ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement