
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ప్రకాశం : గత సంవత్సరం అక్టోబర్‌లో తప్పిపోయిన చిన్ని ఆచూకీ దొరికింది. పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ఆశ్రమంలో బాలికను గుర్తించారు. 2017 అక్టోబర్ నెలలో చిన్ని అనే 12 సంవత్సరాల బాలిక మార్కాపురం ప్రభుత్వ వసతి గృహంనుంచి అదృశ్యమైంది. బాలిక అదృశ్యం కేసును జిల్లా ఎస్పీ సవాల్‌గా తీసుకుని నిరంతరం శ్రమించారు. 8 పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ఆశ్రమంలో బాలికను గుర్తించిన పోలీసులు ఒంగోలుకు తరిలించారు. చిన్ని ఆచూకీ లభించటంతో కుటుంబ సభ్యులు సంతోష వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment