అనకాపల్లి, న్యూస్‌లైన్: ఆ పోలీసు అధికారి తీరు ఎన్నికల కమిషన్ నిష్పాక్షిక నిర్ణయాలకే మాయనిమచ్చగా మా రుతోంది. పదవి ద్వారా సంక్రమించిన బలంతో, అధికార జులుంతో నచ్చనివారిని వేధిం చుకుతింటున్న ఆయన వైఖరి సర్వత్రా విమర్శలకు గురవుతోంది. పైవారి కనుసన్నల్లో నడుస్తూ ఇప్పటికే బోలెడంత అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆయన తీరు ఉన్నత పదవికే చెడ్డపేరు తెస్తోంది.
పెద్దవారి కనుసన్నల్లో నడుస్తూ, వారి రాజకీయ ప్రత్యర్థులపై అధికార దండాన్ని ప్రయోగిస్తూ పదవిని దుర్వినియోగం చేయడం ప్రజల్లో నిరసనకు పాత్రమవుతోంది. వలసవాదిగా గుర్తింపు తెచ్చుకున్న నేత తాను ఏరికోరి ఓ పోలీస్ అధికారిని బదిలీ కాకుండా అడ్డుకోవడం గతంలోనే చర్చనీయాంశమైంది. క్రమశిక్షణ చర్యలు లేకుండా అడ్డుపడి, ఎన్నికల వేళ తనకు అనుకూలంగా పని చేయించుకోవడానికి తురుపు ముక్కగా వాడుకోవాలన్న ఎత్తుగడ బాగానే పని చేస్తోందని సర్వత్రా వినవస్తోంది.
పోలీస్ సాక్షిగా మీడియాపై దాడి
ఎంపీటిసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యలమంచిలి నియోజకవర్గంలోని ఒక మండలంలో దేశం పార్టీకి చెం దిన నేతలు బియ్యాన్ని తరలిస్తున్నారనే ఫిర్యా దు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దీనిని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై పోలీసుల సాక్షిగా భౌతిక దాడి జరిగింది. పోలీసులు పక్కనే ఉన్నా ఈ దారుణం అడ్డూఅదుపూ లేకుండా సాగింది. బియ్యం బస్తాలను ఏవో కాగితాలు చూసి వదిలేయడం వెనుక ఈ అధికారి హస్తం ఉందన్న ప్రచారం సాగుతోంది.
అనకాపల్లి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నప్పుడు మార్క్‌ఫెడ్ మాజీ ఛైర్మన్, వైఎస్‌ఆర్ సీపీ నేతపైనే కావాలని పోలిసులు దురుసుగా ప్రవర్తించారు. అదే విధంగా అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీలో పోలిం గ్ సిబ్బంది నిర్వాకం వల్ల వ్యవహారం చినికిచినికి గాలి వానలా మారంది. అనకాపల్లి నియోజవర్గ పరిధిలో నమోదైన బైండోవర్ కేసులు సైతం ఏకపక్షంగా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా బాస్ ఆగ్రహం
అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలకు తోడు అదుపులోకి తీసుకున్న బియ్యాన్ని వదిలేయడం, మీడియాపై దాడులు, వైఎస్‌ఆర్ సీపీ నేతలపై కవ్వింపు చర్యలు వంటి పరిణామాలపై ఎస్పీ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే అనకాపల్లి పరిధిలోని ఒక పోలీస్ అధికారికి జిల్లా బాస్ అక్షింతలు వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనైనా ఆ అధికారి తీరు మారుతుందో లేదోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పెద్దల కనుసన్నల్లో ఖాకీ దాష్టీకం
Published Wed, Apr 9 2014 4:09 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement