వీటి వెనుక ఏముంది(ఫైల్) వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు (ఫైల్)
సాక్షి, రాజాం: నగర పంచాయతీ పరిధి పొనుగుటివలస కూడలి చెక్‌పోస్టు వద్ద ఈ నెల 18న పట్టుకున్న నగదు వ్యవహారం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అప్పట్లో రాజాం టీడీపీ నేతల కారులో ప్రచార పత్రాలు మాత్రమే ఉన్నాయని సంతకవిటి ఎన్నికల అధికారులు సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. అయితే కారులో రూ. 5 కోట్లకుపైగా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ మేరకు ఎస్పీ ఏ వెంకటరత్నంను ప్రభుత్వానికి రెండ్రోజుల క్రితం సరెండ్ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడినప్పటికీ అధికారులు ఉదాసీనతగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని బాహాటంగానే పలువురు విమర్శిస్తున్నారు. అయితే రోజూ ఇదే తరహాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నగదును రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఎంత?
కరపత్రాలతోపాటు నగదును రవాణా చేస్తున్న ఈ కారు రాజాంకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిది కావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి టీడీపీ రాజాం ఇన్‌చార్జి ప్రచార పత్రాలను, నగదును కారులో తరలిస్తునట్లు తెలుస్తోంది. ఈ కారును పట్టుకున్న వెంటనే పెద్ద ఎత్తులో టీడీపీ నేతల నుంచి ఫోన్లు రావడంతో మొదటి నుంచి ఈ తంతు అనుమానాస్పదంగా మారింది. ఇదే విషయమై చోద్యం చూడటంపై ఎన్నికల సంఘం ఎస్పీపై బదిలీ వేటు వేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయినప్పటికీ ఆ రోజు తనిఖీల్లో ఎంత నగదు పట్టుకున్నారో తెలియరావడం లేదు. రూ.5 కోట్ల అని కొందరూ, రూ. 10 కోట్లు అని మరికొందరూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. చివరకు నగదు దొరికిందా లేదా..ఎంత దొరికింది... అసలేం జరిగిందనేది మాత్రం ఇటు తనిఖీ అధికారులుగానీ, అటు పోలీసులుగానీ వెల్లడించకపోవడం గమనార్హం. ఈ తంతు కారణంగా రాజాం నియోజకవర్గ ఎన్నికల తనిఖీ అధికారుల్లో ప్రస్తుతం గుబులు అధికమైంది.
Comments
Please login to add a commentAdd a comment