కర్నూలు: జిల్లా పోలీస్‌శాఖలో పని చేస్తున్న వారు పోలీస్ హాస్పిటల్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సూచించారు. కొత్తపేటలోని జిల్లా పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్‌లో ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. ల్యాబ్‌లో బ్లడ్, షుగర్, ప్రెగ్నెన్సీ, యూరిన్, టైఫాయిడ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసేందుకు అవసరమైన సామగ్రి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొలస్ట్రాల్ టెస్ట్, ఇతర ముఖ్యమైన టెస్టులకు సంబంధించిన సౌకర్యాలు, సామగ్రిని సమకూర్చడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.
స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ స్నేహలతారెడ్డి ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ వైద్య సేవలందిస్తున్నారు. పోలీసు మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, ఏఆర్ కానిస్టేబుల్ పుండరీక, ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉదయం 10 గంటల నుంచే మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి ఏడు గంటల వరకు హాస్పిటల్‌లోనే ఉండి వైద్య సేవలందిస్తున్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ రాధాక్రిష్ణ, డీఎస్పీలు డీవి రమణమూర్తి, ఏజి.క్రిష్ణమూర్తి, అశోక్‌బాబు, ఆర్‌ఐ రంగముని, జిల్లా పోలీస్ కార్యాలయం పరిపాలనాధికారి అబ్దుల్ సలాం, సూపరింటెండెంట్ సరళమ్మ, మినిస్టీరియల్ సిబ్బంది, ఏఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
హోంగార్డు కుటుంబాలకు చెక్కుల పంపిణీ
కర్నూలు : విధి నిర్వహణలో మృతి చెందిన ఇద్దరు హోంగార్డు కుటుంబ సభ్యులకు చెక్కులను జిల్లా ఎస్పీ పంపిణీ చేశారు. డోన్ హోంగార్డు యూనిట్‌లో విధులు నిర్వహిస్తూ ఉమా మహేశ్వరరెడ్డి(హెచ్‌జి.నం. 892) ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన కారు ప్రమాదంలో మృతి చెందాడు. హోంగార్డు వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరయిన రూ.15 వేలు ఆర్థిక సహాయం చెక్కును ఆయన భార్య పద్మావతికి ఎస్పీ అందజేశారు.
అలాగే కర్నూలు యూనిట్‌లో విధులు నిర్వహిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బందోబస్తు విధులకు ఆదోనికి వెళుతూ మార్గమధ్యంలో ఏప్రిల్ 10వ తేదీన హోంగార్డు ఎండి.హుసేన్(హెచ్‌జి నం.75) గుండెపోటుతో మృతి చెందారు. హోంగార్డు వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేసిన రూ.15 వేల చెక్కును ఆయన భార్య వహీదా రెహ్మాన్‌కు స్థానిక కార్యాలయంలో బుధవారం అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డు డీఎస్పీ క్రిష్ణమోహన్, ఆర్‌ఐ రంగముని తదితరులు పాల్గొన్నారు.
హాస్పిటల్ సేవల, పోలీస్, డాక్టర్ స్నేహలతారెడ్డి,
పోలీస్ హాస్పిటల్ సేవలను వినియోగించుకోవాలి
Published Thu, Nov 13 2014 3:27 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement