సాక్షి, చిత్తూరు : వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజక వర్గంలో ఆయన పాదయాత్ర చేస్తున్నారు.
కాగా, ప్రజాసంకల్పయాత్ర నేడు 56వ రోజుకి చేరుకోగా.. మొరవపాటూరు నుంచి కాసేపటి క్రితం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. కొండారెడ్డిపల్లి క్రాస్ నుంచి తలుపులపల్లి గ్రామం చేరుకొని అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి తిమ్మిరెడ్డిపల్లి , తోటలోపు, టీ రంగం పేట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నాం భోజన విరామం అనంతరం తిరిగి యాత్ర మొదలుపెడతారు. రంగంపేట క్రాస్ చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.
ఇక మధ్యాహ్నాం పూతలపట్టు చేరుకొని అక్కడ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. తదుపరి సమనత్తం మీదుగా అనంతాపురం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా, పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా ఆయన 766.5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రతిపక్ష నేత యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుండటం ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment