మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 26వ తేదీ సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మార్చి 10వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి విరామం ప్రకటించారు. దీంతో దాదాపు రెండున్నర నెలలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది.
సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ప్రారంభించనున్నారు. రెండున్నర నెలలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయినా ప్రతి సోమవారం కొద్దిపాటి సంఖ్యలో బాధితులు, అర్జీదారులు కలెక్టరేట్‌కు వస్తూనే ఉన్నారు. దూరప్రాంతం నుంచి వచ్చే వారిని వెనక్కి పంపకుండా సిబ్బంది వారి నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపారు.
ఈ రెండున్నర నెలల వ్యవధిలో దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారులంతా ఎన్నికల విధుల్లో ఉండటంతో ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రస్తుతం కొనసాగనున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. హైదరాబాదులో ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన కలెక్టర్ రఘునందన్‌రావు సోమవారం నాటి ప్రజావాణిలో పాల్గొనే అవకాశం లేదు.
నేటి నుంచి ప్రజావాణి
Published Mon, May 26 2014 2:07 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Advertisement