ప్రజావాణికి నూతన సాఫ్ట్‌వేర్ | Prajavani new software | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి నూతన సాఫ్ట్‌వేర్

Published Mon, Aug 18 2014 4:28 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

ప్రజావాణికి నూతన సాఫ్ట్‌వేర్ - Sakshi

ప్రజావాణికి నూతన సాఫ్ట్‌వేర్

  •      పర్యావరణానికి హాని లేకుండా చర్యలు
  •      సంక్షేవు హాస్టళ్లలో రూపాంతరంతో అభివృద్ధి
  •      కలెక్టర్ సిద్ధార్థజైన్
  • కుప్పం : ప్రతి సోవువారమూ నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఆదివారం కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడారు. సంక్షేవు హాస్టళ్లలో సవుస్యల పరిష్కారానికి రూపాంతరం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు.

    హాస్టళ్ల అభివృద్ధికి తగు చర్యలు చేపట్టనున్నామన్నారు. వుంచినీరు సరఫరా చేసే ట్యాంకర్లకు ఇదివరకు కేటాయించే నగదును వురింత పెంచినట్లు తెలి పారు. వేరుశెనగ సాగు చేస్తున్న రైతులు పంట బీవూకు సెప్టెంబర్ 15లోగా ప్రీమియం చెల్లించవచ్చన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నావుని వివరించారు.

    కుప్పం డిగ్రీ కళాశాలకు తరగతి గదులు లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఏపీవీవీపీకి చెందిన భవనాలు అనువుగా ఉంటాయుని తవు దృష్టికి తెచ్చారని, ప్రస్తుతం ఈ భవనాలు ద్రవిడ వర్సిటీ వినియోగించుకుంటుండడంతో వారికి సైతం తగిన సవూచారం అందించామని పేర్కొన్నారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సవూవేశంలో వుదనపల్లె సబ్ కలెక్టర్ నారాయుణ భరత్‌గుప్త, కడ ప్రత్యేకాధికారి ప్రియూంక పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement