అనంత: పుటపర్తిలో సత్యసాయిబాబా మహాసమాధిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దర్శించుకున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. అనంతరం ఆయన తిరిగి పుటపర్తి చేరుకుని సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. 1926 నవంబర్ 23వ తేదీన జన్మించిన సత్య సాయిబాబా, 2011 ఏప్రిల్ 24వ తేదీన పరమపదించిన విషయం తెలిసిందే.
14 ఏళ్ల వయసుదాకా సత్యనారాయణరాజుగా జీవితాన్ని కొనసాగించిన ఆయన అటు తరువాత తనకు తానుగా సత్యసాయిబాబాగా ప్రకటించుకున్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు.. తన భోదనలతో ప్రపంచాన్ని ఆకర్షించారు.. సేవా కార్యక్రమాలలో మమేకమయ్యారు.. ప్రశాంతి నిలయాన్ని నెలకొల్పారు.. బాబా ప్రభోదాలు ,ఆయన సేవా నిరతి ప్రపంచాన్ని ఆకర్షించింది..188 దేశాల్లో అనేకమందికి ఆయన ప్రత్యక్ష దైవమయ్యారు.. పుటపర్తికి విదేశీ భక్తుల రాకపోకలు ముమ్మరమయ్యాయి.. అదే క్రమంలో శాంతినిలయం ఆదాయం వందల కోట్ల రూపాయలకు చేరుకుంది.. పుటపర్తి ఓ మెగా పుణ్యక్షేత్రమయింది. బాబాకు ప్రముఖులు ఉన్న భక్తులుగా ఉన్న విషయం తెలిసిందే.