* రాష్ట్రపతికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల వినతి
సాక్షి, అనంతపురం: రాష్ర్ట విభజన ప్రక్రియకు అడ్డుకట్ట వేసి.. తెలుగు జాతిని ఐక్యం గా ఉంచాలని అనంతపురం, రాయదుర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న రాష్ట్రపతికి వారు వినతిపత్రం సమర్పించారు.
రాజకీయ లబ్ధి కోసం ఇరు ప్రాంతా ల మధ్య చిచ్చుపెట్టి శతాబ్దంలోనే అతి పెద్ద నేరం చేయడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జరుగుతున్న విభజన ప్రక్రియను నిలువరించాలని కోరారు. తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలనే ఆశయంతో 1956 లో బళ్లారి జిల్లాను, తుంగభద్ర నీటి వనరులను కోల్పోయామని పేర్కొన్నారు.
వేర్పాటువాద శక్తుల ఆటలు సాగనివ్వకుండా, ప్రాంతా లు, ప్రజలు అనే తారతమ్యం చూపించకుండా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విశేష కృషి చేశారన్నారు. ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి సాధించి దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. వైఎస్ మరణం తరువాత రాజకీయ లబ్ధి పొందేం దుకు చేస్తున్న ఈ విభజన కుట్రను అడ్డుకోవాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.
‘విభజన’కు అడ్డుకట్ట వేయండి
Published Tue, Dec 24 2013 1:49 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
Advertisement
Advertisement